Full Style

>

డ్రై షాంపు అంటే ఏమి..? డ్రై షాంపూ ఎలా వాడాలి....?


ఆహారం మితంగా, పద్ధతి ప్రకారం తీసుకుంటే ఎంత ఆరోగ్యాన్నిస్తుందో, పద్ధతి తప్పితే అంతకు రెట్టింపు అనారోగ్యాన్ని కలిగిస్తుంది. చాలా మంది తినడం కోసమే జీవిస్తున్నామన్న రీతిలో తింటూ ఉంటారు. ఇది అంత మంచి పద్ధతి కాదనీ, భవిష్యత్తులో తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. ఆహారాన్ని ఏ విధంగా తీసుకుంటే మంచిదో చాలా మందికి తెలుసు, అయితే ఆహారాన్ని ఏ విధంగా తీసుకోకూడదో తెలికపోవచ్చు. వారి కోసమే ఈ చిట్కాలు....
1. ఆకలి అనిపించినప్పుడల్లా ఏదో ఒక చిరుతిండి తింటూనే ఉంటారు. ముందు ఈ విధమైన అలవాటును మానుకోవాలి.
2. టీవీ చూస్తూనో, పుస్తకం లేదా పేపర్ చదువుతూనో తింటూ ఉంటారు. ఇది అస్సలు మంచి అలవాటు కాదు. ఆహారం తీసుకొంటున్నప్పుడు మరే దాని మీద ధ్యాస పెట్టకండి.
3. భోజనం ముందు లేదా భోజనంతో పాటుగా సోడా లాంటి పానీయాలు తీసుకోకూడదు.
4. రాత్రి సమయంలో ఎక్కువగా ఆహారం తీసుకోవడం లేదా, పూర్తిగా మానేయడం వంటివి అస్సలు చేయకూడదు.
5. బయట రెడీమేడ్ గా లభించే ఆహారం తీసుకోవడం ఎంత మాత్రమూ మంచికాదు. రెడీ మేడ్ ఫుడ్ అనేది బ్యాడ్ ఈటింగ్ హాబిట్ కిందకే వస్తుంది.
6. ఎవరో తరుముకుంటూ వస్తున్నట్లు లేదా, తొందర లేదు అన్నంత నిదానంగా ఆహారాన్ని తీసుకోకూడదు. భోజనాన్ని పది లేక పదిహేను నిమిషాలలో ముగిస్తే మంచిదని నిపుణులు అంటున్నారు.
7. ఒకేసారి ఎక్కువగా ఆహారం తీసుకోవడం అన్నది ఆరోగ్యానికి అంతి మంచిది కాదు. రోజు మొత్తం మీద తీసుకునే ఆహారాన్ని ఐదు లేక ఆరు భాగాలుగా విభజించి అన్ని సార్లు తీసుకోవాలి.
8. మధ్యాహ్నం లంచ్ లేదా రాత్రి డిన్నర్ ను ఆలస్యంగా ఎప్పుడూ తీసుకోకూడదు. ఇది ఒక విధంగా బ్యాడ్ ఈటింగ్ హాబిట్ అని నిపుణులు అంటున్నారు.

 

Post a Comment

0 Comments