Full Style

>

డయాబెటిస్ ఉన్న మహిళలు తీసుకోవలసిన ఆహారం...


మనిషిని పట్టి పీడిస్తున్న వ్యాధులన్నీ ఒకెత్తయితే, డయాబిటీస్ ఒకటీ ఒకెత్తుగా మారిన ప్రస్తుత కాలంలో ఆహార నియంత్రణే ఈ వ్యాధి నివారణకు మార్గంగా వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కెలోరీలు తక్కువగా ఉండే ఆహార పదార్ధాల జాబితాను సిద్ధం చేసుకోవాల్సిందిగా కూడా ముందుజాగ్రత్తలను సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నడివయస్సులో ఉన్న మహిళలకు మధుమేహ వ్యాధికి తీసుకోవలసిన ఆహారపదార్థాలేమిటో చూద్దామా..  
డయాబెటిస్‌ మిల్లిటస్‌ అనేది వ్యాధి వల్ల మన ఆహార పదార్థాల్లో ఉండే చక్కెర, మనశరీరంలో సాధారణ కార్యక్రమాలకు అవసరమైన శక్తిరూపంలోకి మార్చబడదు. మనం చక్కెరలు, పప్పుధాన్యాలు తీసుకున్నప్పుడు,మన శరీరం వాటినిగ్లూకోజ్‌గా మారుస్తుంది. ఈ గ్లూకోజ్‌ తక్షణ వినియోగం కోసం రక్తంలో కలపబడుతుంది లేదా భవిష్యత్తు వినియోగం కోసం కాలేయంలో గ్లూకోజన్‌ రూపంలో నిల్వ చేయబడుతుంది. డయాబెటిస్‌లో, రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించే యాంత్రాంగం బలహీనంగా ఉంటుంది. దాని ఫలితంగా రక్తంలో గ్లూకోజ్‌ యొక్క స్థాయి ప్రమాదకరంగా ఉంటుంది, దీని ఫలితంగా ప్రమాదకరమైన రోగలక్షణాలు కనిపిస్తాయి అదేవిధంగా కీలకమైన అవయవాలు దెబ్బతింటాయి.
డైట్‌ ప్లానింగ్‌ అనేది బ్లడ్‌ గ్లూకోజ్‌ లెవల్స్‌ను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. డైట్‌ను ప్లానింగ్‌ చేసేటప్పుడు, డాక్టర్‌ రోగి యొక్క బరువును మరియు అతడు ఆమె రోజువారీగా ఎంత మేరకు భౌతిక కార్యకలాపాలు చేస్తున్నారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటాడు.బరువు ఎక్కువగా ఉన్న రోగుల్లో రక్తంలోని గ్లూకోజ్‌ను నియంత్రించడం కోసం బరువును తగ్గించే కార్యక్రమాలు అవసరం అవుతాయి.
ఎక్సర్‌సైజులు అనేవి ఎంతో ముఖ్యమైనవి ఇవి శరీరంలో అదనంగా ఉన్న గ్లూకోజ్‌ను శక్తిగా మార్చడంలోసాయపడతాయి. రోగి అతని/ఆమె యొక్క సాధారణ ఆరోగ్యానికి దోహదపడే విధంగా సంతులిక ఆహారం మరియు అవసరమై మందులతోపాటు వ్యాయామ కార్యక్రమాలను డాక్టర్‌ ప్లాన్‌ చేస్తాడు. డైట్‌ మరియు ఎక్సర్‌సైజుల ద్వారా రక్తంలోని చక్కెరలను నియంత్రించడం సాధ్యం కానప్పుడు మందులు(ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌లు లేదా నోటి ద్వారా తీసుకునే టాబ్లెట్‌లు) ఇవ్వాల్సి ఉంటుంది.కొన్నిసార్లురోగి ఔషదాలు లేకుండా బాగానే ఉంటాడు అయితే అస్వస్థత లేదా సంక్రామ్యత సమయంలో స్వల్పకాలిక ప్రాతిపదికన ఔషధాలను ఇవ్వాల్సి ఉంటుంది.
కాబట్టిడయాబెటిస్ ఉన్నవారు ఆహారంలో పీచు, కార్బోహైడ్రేట్స్, వంటి పదార్ధాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. జొన్న, మొక్క జొన్న, గోధుమ, దంపుడు బియ్యం, మొలకెత్తిన గింజలు, పళ్లూ, కూరగాయలు, ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వు పదార్ధాలైన నెయ్యి, వెన్న, జున్ను, మీగడ వంటి పదార్ధాలను బాగా తగ్గించాలి. వేపుళ్లు పూర్తిగా తగ్గించాలి. ఇవి పెరిగితే దయాబెటిక్ పేషెంట్లలో గుండె జబ్బులు పెరిగే అవకాశం పెరుగుతుంది కాబట్టి వాటన్నింటినీ తగ్గించాలి.
తీపి పదార్ధాల విషయానికి వస్తే చక్కెర, తేనె, బెల్లం చాలా పరిమితంగా తీసుకోవాలి. బ్రెడ్స్, బేకరీ ఫుడ్స్, కార్న్‌ప్లేక్స్ వంటి పీచు తక్కువగా ఉండేవి, మైక్రో న్యూట్రియంట్స్ తక్కువగా ఉండే పదార్ధాలను పూర్తిగా తగ్గించాలి. తాజా కూరగాయల్లో పీచు పదార్థాలు, కొన్ని విటమిన్లు, పైటో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని ఎక్కువగా తీసుకోవాలి.

Post a Comment

0 Comments