Full Style

>

బరువును తగ్గించే దివ్వ ఔషదం గార్లిక్


అధిక బరువును కలిగి ఉండటం అంటే స్ర్తీ అయినా పురుషుడైనా వారి వయసుకు, ఎత్తు కు తగ్గట్టుగా ఉండవలసిన బరువుకన్నా అధికంగా ఉండడం. అధిక బరువు అనేది సాధారణంగా స్థూలకాయం వల్లే వచ్చినా అసహజ రీతిలో కండరాలు పెరగడం లేదా ద్రవాలు నిలిచిపోవడం వల్ల కూడా రావచ్చు. కొవ్వు కణాలు విస్తరించినా లేదా కొవ్వుగల కణజాలం అసహజంగా పెరిగినా లేదా వాటి సంఖ్య రెట్టింపు అయినా లేదా ఈ రెండు చోటు చేసుకోవడాన్ని స్థూలకాయంగా అభివర్ణించవచ్చు.
ప్రస్తుతం మారుతున్న జీవన శైలి ఆధారంగా ఎవరి శరీరం వారికే సమస్యను అవుతుందని, ధరించే దుస్తులు తరచుగా టైట్ అయిపోయి ఇబ్బంది అవుతోంది. ఎవరికి అలా అనిపిస్తుందో వారు ఊబకాయంతో బాధపడుతున్నట్లు తేలికగా చెప్పుకోవచ్చు. నలుగురిలో నవ్వులపాలయ్యే శరీరం వల్ల ఒక్కొక్కసారి మానసిక వేధన అనుభవించవలసిన వస్తుంది. నిజానికి స్థూలకాయానికి మూల కారణం క్రొవ్వు పదార్థాలు. వీటిని అపరిమితంగా తీసుకుంటూ ఉంటే ఊబకాయం సర్వ సాధారణం.
నిజానికి కొందరు పరిశోధకులు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న కొందరి మీద ప్రయోగాలు జరిపారు. వారికి రెండు నెలలపాటు ఆపకుండా వెల్లుల్లి తినిపించి, వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. దీని ఫలితంగా వారి శరీరాల్లో 30శాతం కొలెస్ట్రాల్, ట్రెగ్లిజరాయిడ్స్ తగ్గాయని తెలిసింది. పైగా శరీరారినికి మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్డియల్ స్థాయి బాగా పెరిగిందని తెలిసింది. అంతే కాకుండా వారి శరీరాల్లో కొవ్వును విరిచి పేగుల ద్వారా బయటకు పంపించిందట వెల్లుల్లి, కనుక శరీరంలోని కొవ్వుశాతాన్ని అధిక రక్తపోటును తగ్గించడమేకాక, గుండె జబ్బులను రాకుండా నిరోధించే శక్తి కూడా వెల్లుల్లికి ఉందని రుజువయ్యింది..
నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులన్నింటిపైనా వెల్లుల్లి ప్రభావం అమితంగా ఉంది. చేతులు, కాళ్ళు వణికే రోగాన్నుంచి వెల్లుల్లి కాపాడగలదు. తిమ్మిర్లు, మూర్చలు, మధుమేహవ్యాధిలో వచ్చే అన్ని రకాల నరాల జబ్బుల్లోనూ వెల్లుల్లి శక్తికి ధీటయినది లేదు.శీతాకాలంలో వాత ప్రకోపం అధికంగా ఉన్న సందర్భాలలో వెల్లుల్లి, పసుపు నూరి వాతపు పట్లు ఉన్న చోట్ల పట్టించాలి. అది సాధ్యం కాకపోతే వెల్లుల్లిని ఆహారపదార్థంగానైనా తరచుగా ఉపయోగించాలి. చర్మం సౌందర్య సాధనంగా వెల్లుల్లి వాడటానికి చాలా మంది ఇష్టపడకపోవడానికి కారణం దీనికున్న వాసన ప్రభావమే.
అయితే, అవసరమైన చోట చర్మానికి సున్నితత్వం కావాలంటే వెల్లుల్లిని వాడటం తప్పనిసరి. వెల్లుల్లి మూత్రాశయం వ్యాధులకు ఒక గొప్ప ఔషదం, మూత్రాన్ని సాఫీగా జారీ చేయడమే కాక, మూత్రాశయంలోని రాళ్లను కరిగిస్తుంది. కొంత వెల్లుల్లి ముద్దను తీసుకుని కడుపుపై కొద్ది సమయంపాటు పట్టుగా వేస్తే మూత్రం సాఫీగా అవుతుంది. వెల్లుల్లిలో ఉండే ఘాటయిన సల్ఫర్ కాంపౌండ్స్ అన్నీ చర్మం, ఊపిరితిత్తులు మూత్రం ద్వారా విసర్జించబడుతాయి. కనుక ఈ మూడే అవయవాలలో వచ్చే అన్ని వ్యాధులకూ వెల్లుల్లి మంచి మందు.

 

Post a Comment

0 Comments