Full Style

>

మీ ఆయుష్షుని పెంచి, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే పండ్లు!




ప్రస్తుత జీవన విధానంలో చాలా మార్పుల చోటు చేసుకోవడంతో మనుషులు సుఖ జీవితానికి అలవాటు పడి ఊబకాయులుగా తయారవుతున్నారు. దాంతో డైటింగు మరియు ఇతరత్రా పండ్లకున్న ప్రాముఖ్యత తెలిసినదగ్గరి నుండీ వరి అన్నం మున్నగునవి తగ్గించి పండ్లు ఎక్కువగా తింటున్నారు. పండ్లలో విటమిన్లు, మినరల్స్, ఇతర ప్రధాన పోషకాలు పుష్కలంగా వుంటాయి. పోషకాలు బాగా వుంటాయి కదా అని రోజులో పండ్లు అధికంగా తింటే, అది అజీర్ణ సమస్యలను కలిగిస్తుంది. కొన్ని పండ్లులో వుండే సార్బిటాల్ అనే షుగర్ మరియు కరిగే పీచులు మీకు గ్యాస్ సమస్య తెస్తాయి. ఇవి త్వరగా జీర్ణం కావు కనుక పేగులలో గ్యాస్ ఏర్పడుతుంది. కాబట్టి మితంగా తీసుకోవాలి.
ప్రకృతి పరంగా లభించే పండ్లు, కూరగాయలను తీసుకోవడంతో మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. శరీరానికి కావలసిన పోషకపదార్థాలు పండ్లు, కూరగాయల్లో ఉంటాయనడంలో సందేహం లేదు. అనారోగ్యంగా ఉండేవారికి, ఆరోగ్యంగా ఉండే వారికి పండ్లు టానిక్‌లా ఉపయోగపడతాయి. మనిషి ఆయుష్యును పెంచుతాయి. అయితే పండ్లును చేర్చకుండా ఆహారం ఎప్పటికీ సమతుల్యమవదు. పండ్లను కూడా మితంగా తినాలి. కాబట్టి ఆహారంలో పండ్లు తప్పనిసరి. పండ్లు తినడం అనగానే మార్కెట్ నుంచి పండ్లు కొనితెచ్చి కోసుకుని తినడం మాత్రమే కాదు. మనం తీసుకుంటున్న పండ్లు ఎప్పుడు, ఎంత మోతాదులో, ఎలా తీసుకుంటున్నామన్నది కూడా ముఖ్యమే. కాబట్టి పండ్లు తినే పద్ధతి గురించి తెలుసుకుందాం.
పండ్లను ఎప్పుడు తినాలి:
సాధారణంగా పండ్లు ఇంట్లో ఉన్నాయంటే చాలు ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తుంటారు కొంతమంది. అయితే అది మంచి పద్దతి కాదు. భోజననాంతరం పండ్లు తీసుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. పండ్లు ఎప్పుడూ ఖాళీ కడుపుతో తింటే చాలా మంచిది. ఇలా ఖాళీ కడుపుతో పండ్లు తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. అంతే కాదు బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక మంచి ప్రత్యామ్నాయ ఆహారంగా కూడా ఉంటుంది.
పండ్లను ఎలా తినాలి..
పండ్ల రసాలకంటే పండును అచ్చంగా అలా తినేయడమే మేలు. అందువల్ల శరీరానికి మేలు చేసే పండ్లలో ఉండే అన్ని సుగుణాలను అందించవచ్చు. ఒక వేళ పండును రసంగా తీసుకోదలచుకున్నపుడు తప్పకుండా తాజాగా తీసిన దాన్ని మాత్రమే తీసుకోవాలి. రసాన్ని నోటి నిండుగా తీసుకొని అది నోటిలోని లాలాజలంతో కలిసేలా నెమ్మదిగా మింగాలి. నెలలో మూడు రోజులు కేవలం పండ్లు మాత్రమే తీసుకుంటే శరీరాన్ని లోపలి నుంచి శుభ్రపరచవచ్చు. వండిన పండ్లు, వేడి చేసిన పండ్ల రసాలు తీసుకోకూడదు. ఎందుకంటే వండిన ఫలాలో పోషకాలు నశిస్తాయి.
పండ్లను ఎందుకు:
సరియైన పద్ధతిలో పండ్లు తినడం వల్ల క్యాన్సర్ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. పండ్లు తినడం వల్ల ఆయుష్షు పెంచుకోవచ్చు, జుట్టు తెల్లబడటం నుంచి కాపాడుకోవచ్చు, కళ్లకింద నల్లటి వలయాలను నివారించవచ్చు, బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. వీటితో పాటు సంతోషంగా ఉండొచ్చు. కాబట్టి తప్పకండా రోజు తీసుకునే ఆహారంలో కొంత భాగాన్ని పండ్లకివ్వండి.

 

 

Post a Comment

0 Comments