Full Style

>

మధ్యాహ్నం చిరుతిండ్లు!


ప్రపంచంలోని డైటీషియన్లు అందరూ శరీర అవసరాలను గమనించి తినండని చెపుతారు. మధ్యాహ్నం అయ్యే సరికి తగ్గిపోయే ఎనర్జీ స్ధాయిలను, ఏకాగ్రతలను కాపాడేందుకు ఆరోగ్యకర ఆహారం తినమంటారు. మరి మీకు మధ్యాహ్నం అయ్యే సరికి ఆకలి దంచేస్తుంది. ఏది అందుబాటులో ఉంటే దానిని తినేయకండి. మీ మధ్యాహ్న ఆహారాలు ఎలా ఉండాలనేది పరిశీలించండి. మధ్యాహ్న ఆహారం 0 నుండి 100 కేలరీలు మాత్రమే కలిగి ఉండాలి.

రోజంతా కూడా ఎన్నో ఆహారాలు నోటిలో వేసేస్తూ ఉంటాం. ఏం తింటున్నామనేది మనకే తెలియదు. దానికి కారణం మన బిజీ లైఫ్ స్టైల్. ఆఫీస్ కాని ఇల్లు కాని, పని చేస్తూనే ఎన్నో చిరు తిండ్లను తినేస్తూ ఉంటాం. కాలేజీ విద్యార్ధి, ఇంటిలో ఉండే మహిళలు, ఆఫీసులకు వెళ్ళేవారు వివిధ రకాల చిరుతిండ్లను వారికి తెలియకుండా తినేస్తూంటారు. వాటిలో చిప్స్, కుక్కీస్, కేక్స్ లేదా ఇతర వేపుడు ఆహారాలు ఎన్నో ఉంటాయి.
1) కేరట్ మరియు దోస ముక్కలు - వీటిని ఒక రోజు ముందే రాత్రివేళ కోసి ఉంచుకోవాలి. చిన్న ముక్కలుగా తరిగి వాటిని రిఫ్రిజిరేటర్ లో పెట్టేయండి. మరుసటి రోజు ఉదయం మీరు పనికి వెళ్ళే సమయంలో వీటితో పాటు కొద్దిగా పెరుగు కూడా తీసుకు వెళ్ళండి. పెరుగు వాటిపై వేసుకొని తింటే ఎంతో ఆరోగ్యం దీనికి కొద్దిగా పండ్లు కూడా చేర్చి మంచి రుచి పొందవచ్చు.
2) ఫ్రూట్ సలాడ్ - పండ్లు గరిష్ట సంతోషాన్ని, తృప్తిని కలిగిస్తాయి. తక్కువ కేలరీలు అధిక పోషకాలు. కనుక ఆఫీసులో చేతికి అందుబాటులో కొన్ని పండ్లు పెట్టుకోండి. ఒక చిన్న చాకు పెట్టుకోండి. ఆపిల్స్, అరటిపండు, రేగు, ఆరెంజ్ పండ్లతో చక్కని రుచికర ఫ్రూట్ సలాడ్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ , పెప్పర్, తేనె వంటివి కూడా ఉంచుకుంటే, ఎంతో రుచికరంగా దానిని తినవచ్చు. చక్కటి ఆరోగ్య కరమైన తీపి పదార్ధంతిన్నట్లు కూడా ఉంటుంది.
3) కర కరమనే పాప్ కార్న్ - పాప్ కార్న్ తినని వారుండరు. ఇది ఎపుడూ స్టాక్ పెట్టుకోవచ్చు. దీనికి కొద్దిగా వెన్న లేదా తీపి కలిపితే, రుచిగా తినేయవచ్చు.
4) బిస్కట్లు - గడ్డ పెరుగు దానిలో దోస ముక్కలు, బిస్కట్లు వేసి ఒక్కొక్కటి తింటూ ఉంటే, ఎంతో రుచి, కడుపు నింపుతుంది కూడాను.
5) ఎండు ఫలాలు - బాదం పప్పులు, పిస్తా, వాల్ నట్స్, జీడిపప్పు, వంటివి తేనెతో కలిపి తినేయండి. ఎంతో రుచి, ఆరోగ్యం మీ మధ్యాహ్న చిరుతిండి పూర్తయినట్లు ఉంటుంది.
6) ఓట్లు గింజలు, పెరుగు - ఈ రెండూ కలిపి మధ్యాహ్నం వేళ రుచికర ఆహారంగా తినవచ్చు. తయారీ ఎంతో తేలిక, కడుపు బాగా నిండుతుంది.
ఈ రకమైన రుచికర, ఆరోగ్యకర ఆహారాలను చిరుతిండిగా మధ్యాహ్నం వేళ తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. వీటిలో కొవ్వు ఉండదు కనుక బరువు పొందే సమస్యకూడా మీకు లేదు.

 

Post a Comment

0 Comments