Full Style

>

హర్ట్ సర్జరీ తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు...


గుండెజబ్బులతో పాటు రోగికి మరో జబ్బు ఉంటే అది కోలుకునే ప్రక్రియను ఆలస్యం చేయవచ్చు. ఉదాహరణకు డయాబెటిస్ వల్ల రికవరీ ఆలస్యం కావచ్చు. భారతీయుల్లో దాదాపుగా సగానికిపైగా మందిలో ఇదే జరుగుతోంది. గుండెజబ్బుల విషయంలో చేసే ఆపరేషన్స్ నుంచి రోగి త్వరగా కోలుకోవాలంటే కొన్ని అంశాలు దోహదపడుతుంటాయి. ఇలాంటి కొన్ని అనుబంధ అంశాలే ప్రతిబంధకంగా నిలుస్తాయి. రోగిని త్వరగా కోలుకునేలా చేయడానికి ఆ అనుబంధ అంశాలను గురించి ఒకసారి చదవడమో, లేదా చదివించడమో చేస్తే మంచిది. ఆత్వవిశ్వాసం నింపుకుని త్వరగా రికవర్ అవుతాడు. అనుభవజ్ఞులైన శస్త్రవైద్య నిపుణులు సూచించిన అంశాలివి.
గుండెజబ్బుకు తోడుగా మరో జబ్బు:
గుండెజబ్బులతో పాటు రోగికి మరో జబ్బు ఉంటే అది కోలుకునే ప్రక్రియను ఆలస్యం చేయవచ్చు. ఉదాహరణకు డయాబెటిస్ వల్ల రికవరీ ఆలస్యం కావచ్చు. భారతీయుల్లో దాదాపుగా సగానికిపైగా మందిలో ఇదే జరుగుతోంది. దీనికి తోడు ఒకవేళ రోగికి పొగతాగే అలవాటు ఉండటం లేదా నగరవాసంలో అనివార్యమైన ఒత్తిడి ఉండటం లేదా ఆల్కహాల్ తీసుకునే అలవాటుంటే వాళ్లలో సర్జరీ తర్వాత కోలుకోవడం చాలా సమయం తీసుకోవచ్చు.
జెండర్: పురుషులతో పోలిస్తే మహిళల్లో కాంప్లికేషన్లు ఎక్కువగా వస్తాయని వైద్యవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన టెక్ట్స్‌బుక్‌లో చెబుతుంటారు. కాని... వాస్తవాలని పరిశీలిస్తే మహిళలు తమ సమస్యను నిర్లక్ష్యం చేసి చాలా ఆలస్యంగా చికిత్సకోసం డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అయితే వాళ్లలో కోలుకునే ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. వాళ్ల రికవరీ రేట్‌తో డాక్టర్లను ఆశ్చర్యపరిచారు. మహిళారోగుల్లో ఫిర్యాదులు (కంప్లెయినింగ్) చాలా తక్కువ. మళ్లీ మామూలు పరిస్థితికి రావడం చాలా వేగం.
ఆహారం: మాంసాహారం తినేవాళ్లతో పోలిస్తే శాకాహారం తీసుకునేవాళ్లు ఆపరేషన్ తర్వాత త్వరగా కోలుకుంటారు. కాని... ఆపరేషన్ తర్వాత ప్రోటీన్ డైట్ తీసుకున్నవాళ్లు ఇంకా త్వరగా కోలుకుంటారు.
కుటుంబ సభ్యుల తోడ్పాటు: కుటుంబ సభ్యుల తోడ్పాటు, వాళ్లు తీసుకునే కేర్ అన్నది కోలుకునే ప్రక్రియలో చాలా ప్రభావం చూపుతుంది. కొంత అరుదుగా మితిమీరిన శ్రద్ధ తీసుకున్న కొన్ని సందర్భాల్లో ‘అది చేయి... ఇది వద్దు' లాంటి వాటితో రోగి పరిస్థితిని మరింత విషమం చేయడం, అతడిలో ఆత్మవిశ్వాసం లోపించేలా చేయడం, రోగి నిరాశనిస్పృహల్లో కుంగిపోయేలా చేయడం వంటి కేసులు ఉన్నా... కుటుంబ సభ్యుల ప్రేమ, ఆదరణ, శ్రద్ధ, తోడ్పాటు అన్నవి రోగి వేగంగా కోలుకునేందుకు మరింతగా ఉపకరిస్తాయి.
రోగి ధోరణి, దృక్పథం: చికిత్స ప్రక్రియ గురించి తెలిసీ, పాజిటివ్‌గా ఉండే రోగులు త్వరగా కోలుకుంటారు. కొందరు రోగుల విషయంలో వాళ్ల కుటుంబ సభ్యులు రోగికి ప్రొసిజర్ గురించి చెప్పవద్దని రిక్వెస్ట్ చేస్తారు. ప్రొసిజర్ గురించి తెలిస్తే రోగి భయం వల్ల డాక్టర్‌కు సహకరించకపోవచ్చని చెబుతారు.

 

Post a Comment

0 Comments