Full Style

>

ఆఫీసులో పని ఒత్తిడితో సతమతమవుతూ.. ఒత్తిడికి లోనౌతున్నారా?


ఇప్పుడు -హైబీపీ విస్మరిస్తే విపత్తే.. రోజు వారీ జీవితంలో మానసిక ఒత్తిడి ఎదుర్కోని వారు ఉండరు. ఇంటి నుంచి బయటపడినప్పటి నుండి తిరిగి ఇంటికి చేరేవరకు అంతా టెన్ష్‌న్..టెన్షనే. రోడ్డుపైన ట్రాఫిక్‌ను ఛేదించుకుని ఆఫీసుకు వెళ్లేంతవరకు ఒక పరిస్థితి..ఆఫీసులో పనిఒత్తిడి మరో పరిస్థితి. ఈ ఒత్తిడి నుంచి సులభంగా బయటపడేందుకు కొన్ని ఇన్‌స్టంట్ చిట్కాలను మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

1. మీరు చేయాల్సిన పనుల జాబితా చేంతాడంత ఉంటే కొద్దిసేపు వాటిని పక్కనపెట్టండి. వేడి వేడి పాలు తాగండి. మనసును ఉల్లాసపరిచే సెరోటోనిన్ హార్మోన్‌కు ఉద్దీపనంలా పాలు పనిచేస్తాయి. దీంతో టెన్షన్ తగ్గుతుంది.
2. పని ఒత్తిడితో సతమతమవుతున్నారా? అయితే కొద్దిగా రిలాక్స్ కావలసిందే. ఓ పావుగంట పనికి బ్రేక్ ఇచ్చి పచార్లు చేయడమో, తేలికపాటి వ్యాయామాలో చేయండి. మీ టెన్షన్ దూరమవుతుంది. జుఆఫీసులో బాగా టెన్షన్‌గా ఉంటే చెవులకు ఇయర్‌ఫోన్స్ తగిలించుకుని కొద్దిసేపు సంగీతం వినండి. ఒత్తిడిని ప్రేరేపించే కార్టిసాల్ హార్మోన్‌కు సంగీతం దివ్యౌషధంలా పనిచేస్తుంది. జుఒత్తిడి ఫీలవుతే మీకు తెలిసీ తెలియని భాషలో 10 అంకెలు లెక్కపెట్టడానికి ప్రయత్నించండి. దీనివల్ల ధ్యాస మళ్లి ఒత్తిడి నుంచి బయటపడుతారు.
3. టేబుల్ మీద గుట్టలుగా పేరుకుపోయిన ఫైళ్లను చూస్తే తాము చేయాల్సిన పని గుర్తొచ్చి ఉద్యోగులకు టెన్షన్ పెరిగిపోతుంది. అందుకే చేస్తున్న పనికి సంబంధించిన ఫైల్సు మాత్రమే టేబుల్ మీద ఉంచుకోవాలి. కష్టమనిపించినా సరే ఆఫీసులో ఆలస్యమైనా పని పూర్తి చేసే వెళ్లాలి. ఇంటికి తీసుకువెళ్లి పెండింగ్ పని పూర్తిచేయడానికి ప్రయత్నించకూడదు. దీని వల్ల హృద్రోగాలు వచ్చే అవకాశం 20 రెట్లు ఎక్కువగా ఉంటుందని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి.
4. పని ఒత్తిడి కారణంగా చికాకుగా అనిపిస్తే మీ ఆప్తులకు ఫోన్ చేయండి. మిమ్మల్ని ప్రేమించే వారితో మాట్లాడితే ఎంతటి చిరాకైనా చిటికెలో మాయమవుతుంది. ఒత్తిడి ఎక్కువగా ఉంటే మీ ఆలోచనలను కాగితం పైన పెట్టండి. మీరు చేయాల్సిన పనుల జాబితా తయారు చేయండి. అందులో అతి ముఖ్యమైన వాటిని టిక్ చేసుకుని ముందు వాటిపై దృష్టి నిలపండి. అలా చేయడం వల్ల చేయవలసిన పనులు తగ్గిపోయినట్లు అనిపించి మనస్సు ప్రశాంతమవుతుంది.
5. ఇక జీవనశైలి మార్పులు: అందరికీ తప్పవు. ఉప్పు: ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉండటం కచ్చితంగా బీపీని పెంచుతుంది. ఉప్పు తక్కువ తినే సమాజాల్లో హైబీపీ సమస్య తక్కువగా ఉండటమే దీనికి తార్కాణం. ఆహారంలో ఉప్పు తగ్గించటం చాలా అవసరం. సామాజికంగా కూడా ఈ ప్రయత్నం జరగాలి. ఊరగాయ పచ్చళ్లు, అప్పడాలు, వడియాలు, రడీమేడ్‌ ఆహారపదార్థాలు.. ఇలా అన్నింటా ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుందని మర్చిపోవద్దు. ఉప్పు తగ్గించగలిగితే బీపీ దానంతట అదే కొంతకాలానికి, కొంతైనా తగ్గే అవకాశం ఉంటుంది.
6. పండ్లు: ఆహారంలో పండ్లు, కూరగాయలు సమృద్ధిగా తీసుకుంటే బీపీ తగ్గే అవకాశం ఉంటుంది. పండ్లలో పొటాషియం బీపీ తగ్గేందుకు బాగా దోహదం చేస్తుంది.
7. బరువు: అధిక బరువు ఉంటే కచ్చితగా బీపీ పెరుగుతుంది. కాబట్టి తగినంత బరువు ఉండేలా చూసుకోవాలి. బరువు కొంత తగ్గించినా దానికారణంగా బీపీ కొంతైనా తగ్గుతుంది.
8. వ్యాయామం: రోజూ లేదా కనీసం వారానికి నాలుగైదు సార్లు వేగంగా నడవటం వల్ల కొంతైనా దానంతట అదే బీపీ తగ్గుతుంది. వ్యాయామం తప్పనిసరి అని అందరూ గమనించాలి.
9. పొగ: పొగ కచ్చితంగా బీపీ పెంచుతుంది. అంతేకాదు, అనేక విధాలుగా కూడా అనర్థదాయకం. కాబట్టి పొగ పూర్తిగా మానెయ్యాలి.
10. మద్యం: ఆల్కహాలు చాలా మితంగా విస్కీ, బ్రాండీ 1.5 ఔన్సులు (50-60 మిల్లీలీటర్లు మించకుండా) తీసుకోగలిగితే మంచిదేగానీ ఆ నియంత్రణలో ఉండలేనివారు దాని జోలికే పోకూడదు. అధికంగా మద్యం తీసుకోవటం హైబీపీకి ఒక ముఖ్యకారణం.
మందులు: నొప్పినివారిణి మందులు, గర్భనిరోధక మాత్రలు, ముక్కు రంధ్రాలు బిగిసినప్పుడు తగ్గేందుకు వేసుకునే చుక్కల మందులు, స్టిరాయిడ్స్‌.. వీటన్నింటి వల్లా బీపీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిని వైద్యుల సిఫార్సు, పర్యవేక్షణలోనే తీసుకోవాలి. అలాగే బీపీ చికిత్సకు వెళ్లినప్పుడు వాడుతున్న ఇతర మందుల వివరాలన్నీ వైద్యులకు చెప్పాలి. ఈ జాగ్రత్తలు అందరూ తీసుకోవాల్సినవి. వీటిని జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులుగా చెబుతున్నప్పటికీ అందరూ అసలు వీటినే జీవన శైలిగా అలవరచుకోవటం ఉత్తమం.

 

Post a Comment

0 Comments