Full Style

>

సిగరెట్లు తాగే అలవాటును మానుకోకపోతే..పెను ముప్పు !!


 



అన్నింటికన్నా ధూమపానం అత్యంత ప్రమాదకరమైందని న్యూ ఢిల్లీ కి చెందినా ప్రముఖ కార్డియాలజిస్టు ఒకరు చెప్పారు. "కేవలం సిగరెట్లు తాగడం వలనే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. సిగరెట్లు తాగడం వలన రక్తనాళాలు బ్లాక్ అయి, గుండెకు రక్తం సరఫరా కాదని చెప్పారు. మద్యపానం వలన కూడా ఇదే సమస్య ఉత్పన్నమవుతుందని ఆయన వివరించారు. ముఖ్యంగా స్త్రీలలో సిగరెట్లు తాగే అలవాటే వారిని గుండెజబ్బులకు చేరువ చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి మహిళలు, ఆడపిల్లలు ఏ మాత్రం మినహాయింపు కాదని అన్నారు. స్త్రీలు సిగరెట్లు తాగడం మానేయాలని, అల మనలేని పక్షంలో వాటిని తాగడం అన్న తగ్గి౦చాలని ఆయన సలహా ఇచ్చారు.
స్త్రీల విషయంలో గుండెకు, మెదడుకు అవినాభావ సంబంధం ఉందని వైద్యులు చెపుతున్నారు. స్త్రీలు చాల సున్నిత మనస్కులని, ప్రతి విషయాన్ని విపరీతంగా ఆలోచించి తీవ్రమైన ఒత్తిడికి గురవుతారని వారు అంటున్నారు. స్త్రీలలో గుండెజబ్బులు రావడానికి ఒత్తిడి కూడా ఒక కారణమని వారు చెపుతున్నారు. పురుషులకన్నా స్త్రీలకే పని ఒత్తిడి అధికంగా ఉండడం, కుటుంబంలో ప్రతి ఒక్కరి అవసరాలను ఆమె చూడవలసి రావడంతో పనితో పాటు ఒత్తిడి, ఆందోళన కూడా తోడవుతాయి. కుటుంబంలో అందరి అవసరాలను చూస్తూనే స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. క్రమ తప్పకుండా వైద్య పరీక్షలు, పోషకాహారం మగవారికీ, చిన్నపిల్లలకే కాదు స్త్రీలకూ అవసరమే అంటున్నారు.
గతంతో పోలిస్తే నేడు స్త్రీల జీవన విధానంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. మారిన ఆహారపు అలవాట్లు, మారిన సంస్కృతి వారి గుండె జబ్బులకు దారితీస్తున్నయ్యన్నది వాస్తవం. ఈ అలవాట్ల వలన ఒక్క గుండె జబ్బులే కాకుండా ఉబకాయం, డయాబెటిస్, శరీరంలో కొవ్వు శాతం పెరిగిపోవడం వంటి కారణాలకు దారితీస్తున్నాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
1. గుండె నొప్పి అనిపించినా వెంటనే డాక్టరును సంప్రదించడం తప్పనిసరి. అవసరమైన పరీక్షలు అన్ని చేయించుకోవాలి.
2. డాక్టర్లు తిరిగి ఎప్పుడు చెకప్ కు రమ్మంటారో ఆ తేదిని గుర్తు పెట్టుకొని ఆ రోజున డాక్టరు దగ్గరకు వెళ్లడం మరిచిపోకూడదు.
3. చెడు అలవాట్లను అంటే, పొగతాగడం, మద్యం సేవించడం వంటి వాటికీ దూరంగా ఉండాలి. ముఖ్యంగా గుండెనొప్పి అనిపించినప్పుడు వీటి జోలికి అస్సలు పోకూడదు.
4. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. జిమ్ కి వెళ్ళగలిగితే మరీ మంచిది. లేని పక్షంలో రోజులో కొద్ది సమయాని నడకకి కేటాయించుకోవాలి. నడిచేవారు వైద్యుని సలహా మేరకు ఆ సమయాని పాటించాల్సి ఉంటుంది.
5. ఆహారంలో మార్పులు చేర్పులు తప్పనిసరి. గుండె జబ్బు వచ్చిన వారు నూనే పదార్థాలకు దూరంగా ఉండాలి. పచ్చివి లేదా ఉడికించిన కూరగాయలు తినడం అలవాటు చేసుకోవాలి. దీనితో పాటు ఏ కాలమైనా నీరు తాగడం మరిచిపోకూడదు.
6. శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడానికి మంచి మంచి పాటలు వినడం, పుస్తకాలు చదవడంతో పాటు యోగా బాగా ఉపకరిస్తుంది.

 

Post a Comment

0 Comments