నేడు అక్టోబర్ 29 వరల్డ్ బ్రేయిన్ స్ట్రోక్ డే. అన్ని అవయవాలూ బాగా ఉండి కూడా అకస్మాత్తుగా వైకల్యాన్ని తెచ్చిపెట్టే సమస్య స్ట్రోక్(పక్షవాతం). ఇంగ్లిష్‌లో బ్రెయిన్ స్ట్రోక్‌గా చెప్పే ఆ వ్యాధిని రాకముందూ, వచ్చాక కూడా నివారించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైన 20 శాతం మందిలో కాలూచేయిని ఆడకుండా చేసి మరొకరిపై ఆధారపడేలా చేస్తుందది. ప్రపంచవ్యాప్తంగా ఏటా రెండు కోట్ల మంది పక్షవాతానికి గురవుతున్నారు. అందులో 50 లక్షల మంది మృత్యువు బారిన పడుతున్నారు. దాని గురించి తెలుసుకుంటే నివారణ ఒకింత సులువవుతుంది.
పక్షవాతం పేరు వింటేనే వెన్నులో చలి మొదలవుతుంది చాలా మందికి. తలచుకోవడానికే భయపడే ఈ సమస్య మెదడుకు రక్త సరఫరా తగ్గడం వల్ల కానీ, రక్తనాళం చిట్లడం వల్ల కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పక్షవాతం రెండు రకాలుగా ఉంటుంది. స్ట్రోక్‌లో రకాలు...
ఇస్కిమిక్ స్ట్రోక్: మెదడులోని రక్తనాళాల్లో అడ్డంకి వల్ల అక్కడి భాగాలకు రక్తప్రసరణ సరిగా జరగక కొన్ని సెంటర్స్ చచ్చుబడటం వల్ల వచ్చేది ఇస్కిమిక్ స్ట్రోక్.
హేమరేజిక్ స్ట్రోక్: మెదడులో రక్తనాళాలు చిట్లడంతో అక్కడ రక్తస్రావం అయి వచ్చే పక్షవాతమే హేమరేజిక్ స్ట్రోక్.
నివారణ: ఇప్పటివరకు పక్షవాతం రానివారు అసలు రాకుండా చూసుకోడానికి తీసుకునే ముందుజాగ్రత్తలను తొలి జాగ్రత్తలు (ప్రైమరీ ప్రివెన్షన్) అంటారు. పక్షవాతం వచ్చిన వారిలో 70% మంది మొదటిసారి స్ట్రోక్ వచ్చిన వారే ఉంటారు. మిగతా 30% మంది స్ట్రోక్ మళ్లీ తిరగబెట్టిన వారు ఉంటారు. అందుకే నివారణలోనూ ప్రైమరీ ప్రివెన్షన్ మరీ ముఖ్యం. ఒకసారి పక్షవాతం వచ్చి మళ్లీ మామూలుగా అయినవారు రెండోసారి అది మరోమారు తిరగబెట్టకుండా తీసుకునే ముందుజాగ్రత్తలను ‘సెకండరీ ప్రివెన్షన్'గా పేర్కొంటారు. తొలిజాగ్రత్తలు ఒకింత సులువే. కాబట్టి తేలికగా పాటించవచ్చు.
జాగ్రత్తలు: బీపీ సాధారణంగా 140 /80 కంటే తక్కువగా ఉండాలి. అయితే షుగర్‌తో పాటు మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవారు బీపీని 130 / 80 లోపే ఉండేలా చూసుకోవాలి. అందుకే బీపీ ఉన్నవారు తరచూ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. లేని వాళ్లు కూడా రెండేళ్లకోసారి బీపీ చెక్ చేయించుకోవాలి. అయితే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మాత్రం మరింత తరచూ బీపీ చెక్ చేయిస్తూ ఉండాలి.
కొలెస్ట్రాల్ నియంత్రణ: రక్తంలో కొవ్వు శాతం (కొలెస్ట్రాల్) ఎక్కువగా ఉన్నవారు తరచూ రక్తపరీక్ష చేయించుకుని కొలెస్ట్రాల్‌ను మందుల ద్వారా అదుపులో ఉంచుకోవాలి.
బరువు నియంత్రణ: స్థూలకాయం ఉన్నవారు అదనంగా ఉన్న బరువును తగ్గించుకోవడం. వ్యాయామం: రోజుకు 30 నిమిషాల చొప్పున ప్రతి రోజూ లేదా రోజుకు 45 నిమిషాల చొప్పున వారంలో నాలుగైదు రోజులు తప్పనిసరిగా వ్యాయా మం చేయాలి.
ఆహారం: ఆహారంలో ఉప్పు పూర్తిగా తగ్గించడం. అన్ని పోషకాలు సమపాళ్లలో ఉండే సమతుల ఆహారం. కొవ్వు తక్కువగా ఉండే ఆహారం. ఆహార వ్యవహారాల్లో మార్పులు, వ్యాయామం, బరువు నియంత్రణ, పొగతాగడం మానివేయడం, ఆల్కహాల్ తీసుకునేవారైతే పరిమితంగా తీసుకోవడం వంటి మార్పులను జీవనశైలిలో మార్పులు అంటే... (లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్)గా డాక్టర్లు చెబుతుంటారు. స్ట్రోక్ నివారణకు ఇవి ముఖ్యం. మరి ముఖ్యంగా పక్షవాతం రాకుండా కాపాడే 7 అద్భుతమై ఆహారాలు మీకోసం...







0 Comments