Full Style

>

గుండె నొప్పి : కొన్ని లక్షణాలు



NewsListandDetails














గుండె చుట్టూ ఉన్న ఏ అవయవంలో వ్యాధి కలిగినా అది ఛాతీ నొప్పికి దారి తీయగలదు. ముందర రొమ్ము ఎముక, వెనుక ఆహార గొట్టం, ఆహార గొట్టం వెనుక వెన్నుపూస, కింద డయాఫ్రం అనే కండరం, ఇరుపక్కల ఊపిరితిత్తులు, ఛాతి మీద చుట్టూ ఉన్న కండరాలు, ఎముకలు, నరాలు, డయాఫ్రం కింద ఉన్న ఉదరం, లివర్‌, స్ల్పీన్‌, పాంక్రియాస్‌, గాల్‌ బ్లాడర్‌, పైన ఉండే మెడ ఎముకలు - ఇలా ఈ అవయవాల్లో కాని, భాగాల్లో కాని వేటిలో ఏ వ్యాధి కలిగినా, అది ఛాతీ నొప్పికి దారి తీయగలదు. అయితే కొందరిలో ఛాతీలో నొప్పి కలిగినపrడు అది గుండెకు సంబంధించనది కాదని నిర్ధారించు కున్నపrడే పై అవయవాలలో కారణాలు వెదకాలి. లేకపోతే గుండెపోటు సంభవించినపrడు దానిని అజీర్ణానికి సంబంధించినదనుకుని భ్రమపడి, వైద్యుణ్ణి సంప్రదించకుండా, ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొనే అవకాశముంది.

గుండెపోటు లక్షణాలు
నొప్పి రొమ్ము ఎముక వెనుకకాని, ఛాతీ ముందు భాగంలో అంతటా కాని ఉంటుంది. నొప్పి దవడ వైపు, సాధారణంగా ఎడమ చేతి కిందికి లేదా కుడి చేతికి, చేతి వేళ్లకు పాకుతుంది. గొంతులోకి, వీపు పై భాగానికి, భుజాల మధ్య ప్రాంతానికి, పొత్తి కడుపు పై భాగానికి కూడా వ్యాపిస్తుంది. నొప్పి ఏదో బరువుగా, మంటగా, లేదా చాతీని నొక్కి వేస్తు న్నట్లు ఉంటుంది. శారీరక వ్యాయామం చేస్తున్నపrడు నొప్పి వచ్చి వ్యాయామం మానివే యాల్సి వస్తుంది. అమితంగా భోజనం చేసిన తరువాత కాని, భరించలేని చలిగాలిలో నడిచిన పrడు కాని నొప్పి రావచ్చును. ఉద్రేకపూరితమైన చర్చలో పాల్గొన్నపrడు కాని, తరువాత కాని సంతోషం పట్టలేనపrడు కాని నొప్పి రావచ్చును. యాంజైనా నొప్పిగుండెలో ఒక భాగానికి రక్తసరఫరా కొంచెం తగ్గినపrడు ఐదు పది నిముషాలు మాత్రమే ఉంటుంది. గుండెకు రక్త సరఫరా తీవ్రంగా తగ్గి ఆ కారణంగా గుండెలో ఒక భాగపు కండరాలు తీవ్రంగా గాయపడినపrడు నొప్పి కొన్ని గంటలు ఉండవచ్చును. గుండెకు సంబంధించిన నొప్పికి, ఇతర అవయవాల సంబం ధిత నొప్పికి ముఖ్యమైన తేడాలు ఈ కింది విధంగా ఉన్నాయి. గుండె నొప్పి ఛాతీలో బరువుగానూ, మంటగానూ, ఛాతీని గట్టిగా వత్తుతున్నట్లుగాను, లేదా పట్టి పిండుతున్నట్లుగాను అని పిస్తుంది. గుండెకు సంబంధించని నొప్పి సూదులతో పొడు స్తున్నట్లు గాని, కత్తితో కోసినట్లు కాని, ముళ్లతో గుచ్చుతున్నట్లు కాని ఉంటుంది. గుండె నొప్పిని ఒక వేలుతో చూపించడానికి అవకాశం లేదు. గుండెకు సంబంధించని నొప్పి ప్రదేశాన్ని తరచుగా ఒక వేలితో చూపించడానికి అవ కాశం ఉంటుంది. గుండెకు సంబంధించని నొప్పి గంటల తరబడి ఒక్కొక్కసారి రోజుల తరబడి ఉంటుంది. గుండెకు సంబంధించిన నొప్పి సాధారణంగా ఐదు పది నిముషాలు మాత్రమే ఉంటుంది.

తీవ్ర గుండెపోటు లక్షణాలు
విపరీతమైన చెమట, శ్వాస అందకపోవడం, కళ్లు తిరగడం, వాంతులు,, స్పృహ కోల్పోవడం
ఎవరికి ఛాతీనొప్పి వచ్చినా డాక్టర్లను, ఆసుపత్రు లను సందర్శించాలనే సలహా అర్థం లేనిది. పసి గుడ్డు నుంచి పండు ముదుసలి వరకూ ఏదో ఒక కారణంగా ఛాతీ నొప్పి వస్తుంటుంది. అలా అని ఆ పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి డాక్టర్ల వద్దకు పరుగెత్తవల సిందేనా? ఏమాత్రం అవసరం లేదు.
ఈ కింద పేర్న్నొ వర్గాలలో గుండెపోటు లక్ష ణాలు ఉన్న, ఛాతీ నొప్పి వచ్చినపrడు డాక్టర్‌ను సంప్రదించడం శ్రేయస్కరం.
40 సంవత్సరాలు పైబడిన, మధుమేహ రోగులు, అధిక రక్తపోటు ఉన్నవారు, సిగరెట్లు తాగే అలవాటు ఉన్న వారు మాంసాహారం ఎక్కువగా తినేవారు వంశంలో గుండెపోటు చరిత్ర ఉన్నవారు

శారీరక శ్రమ ఏ మాత్రం చేయని వారు
వృత్తి రీత్యా కాని, ఆర్థిక, కుటుంబ పరిస్థితుల వలన కాని మానసిక ఒత్తిడికి లోనవుతున్నవారు డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. వీరందరి లోనూ ఛాతీ నొప్పి వచ్చినపrడు అది గుండెపోటు వల్ల మాత్రమే కానక్కరలేదు. కాని, అది గుండె పోటు అవునో? కాదో? తెలుసుకోవాల్సిన అవసరం వీరిలో ఉంది.
అలాగే 60 సంవత్సరాల వయస్సు దాటి ఏ వ్యాధి లేకపోయినా, గుండెపోటు లక్షణాలున్న ఛాతీ నొప్పి వచ్చినపrడు అశ్రద్ధ చేయకుండా డాక్టర్లను సంప్రదించి తగు సలహా తీసుకోవడం అవసరం.

Post a Comment

0 Comments