జాగ్రత్తలు: పల్లీలు అందరికీ పడతాయని కూడా చెప్పలేం. వేయించిన పల్లీలు కొందరిలో అలర్జీకి కారణం కావచ్చు. అలాంటివాళ్లు వీటికి కాస్త దూరంగా ఉండటమే మంచిది. నిజానికి వీటి వాడకం భారత్, చైనాల్లోనే ఎక్కువ. కానీ ఈ దేశాల్లో వీటివల్ల అలర్జీలు రావడం చాలా అరుదు. కానీ ఉత్తర అమెరికా దేశాల్లో మాత్రం కాస్త ఎక్కువే. వేయించి తినడమే ఇందుకు కారణమని ఓ అధ్యయనంలో తేలింది. రిఫైన్ చేసిన వేరుసెనగ నూనెతో పోలిస్తే ముడి నూనె ఎక్కువగా అలర్జీలకు కారణమవుతుంది.
వీటిని మరీ ఎక్కువగా వాడితే శరీరంలో ఆమ్లగుణం పెరుగుతుంది. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవాళ్లు తక్కువగా తినాలి. వీళ్లు కాస్త ఉప్పునీళ్లలో ఉడికించి తింటే అంతగా సమస్య ఉండదు. అలాగే గ్యాస్త్ట్రెటిస్, కామెర్లు ఉన్నవాళ్లు కూడా వీటిని ఎక్కువ వాడకూడదు. అజీర్తికీ హైపర్‌ఎసిడిటీకీ కారణమవుతాయి. పెరిగేదశలో లేదా నిల్వచేసే సమయంలో గింజలకి యాస్పర్‌జిలస్ ఫ్లేవస్ అనే ఫంగస్ సోకే అవకాశం ఉంది. ఇది ఎఫ్లోటాక్సిన్ అనే విషరసాయనాన్ని ఉత్పత్తిచేస్తుంది. ఇది రకరకాల క్యాన్సర్లకు దారితీస్తుంది. అందుకే వీటిని కొనేటప్పుడూ నిల్వచేసేటప్పుడూ చాలా జాగ్రత్త వహించాలి. ఏమాత్రం ఫంగస్ సోకినట్లున్నా వాడకూడదు. వేరుశనగ విత్తనాలు బలమైన ఆహారం. వీటిల్లో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. మరి వీటి వల్ల కలిగి ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం...
బరువు మరియు శరీసౌష్టం పెంచుకోవడానికి: వేరుశనగలో ఉన్న అధిక ప్రోటీన్స్, మినిరల్స్, యాంటియాక్సిడెంట్ మరియు విటమిన్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తాయి. ఇవి శరీరం పెరుగుదలకు, అభివృద్ధికి సహాయపడుతాయి.
యాంటిఆక్సిడెంట్స్: వేరుశెనగలను తినడం వల్ల అతి ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనం స్టొమక్(కడుపు) క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. ఇందులో ఫ్యాలీ ఫినోల్ యాక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
విటమిన్ ఇ: ఇందులో విటమిన్ ఇ అధిక శాతంలో ఉంటుంటి. ఇది చర్మ రక్షించడమే కాకుండి ఆక్సిజన్ ప్రీరాడికల్స్ నుండి కాపాడుతుంది.
న్యూట్రిషియన్స్: వేరుశెనగలో బి కాంప్సెక్స్ విటమిన్స్ అధికంగా ఉండటం చేత అందులో రిబోఫ్లెవిన్, థైమిన్, విటమిన్ బి మరియు ఫాంటోథెనిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి ఇవి మెదడును చురుకుగా ఉంచడంతో పాటు, రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. ఎముకల నిర్మాణానికి కావల్సిన క్యాల్షియం, ఐరన్ ను అందిస్తుంది.
గుండె జబ్బు, క్యాన్సర్: వేరుశెనగలో ఉండే రెస్వెరప్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండెజబ్బుల బారినుంచి కాపాడుతుంది. క్యాన్సర్ రిస్క్‌నూ తగ్గిస్తుంది. వార్ధక్యపు ఛాయలనూ దరిచేరనివ్వదు. గుండెజబ్బుల్ని నివారించే కొన్నిరకాల మందుల్లో వేరుశెనగ సుగుణాలుంటాయి. శరీరానికి మంచి చేసే మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ 50 శాతం మేరకు కలిగి ఉండే వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవటంవల్ల క్యాన్సర్ ముప్పు తొలగుతుంది, అంతేగాకుండా కొలస్ట్రాల్ శాతం అదుపులో ఉంటుంది.
0 Comments