సాధారణంగా స్థూలకాయం ఉన్నవారు పొట్ట, నడుం చుట్టూ చేరిన కొవ్వును
తగ్గించుకునేందుకు పడరాని కష్టాలు పడుతుండడం మనం చూస్తూనే ఉంటాం. ప్రపంచ
ఆరోగ్య సంస్థ ప్రకారం పొట్టలో కొవ్వు వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం
ఉంది. ముఖ్యంగా గుండెకు సంబంధించినవి, చక్కెర వ్యాధులు పెరిగే అవకాశం ఉంది.
పొట్టలో కొవ్వు చేరడానికి ప్రధాన కారణాలలో హార్మోన్ల అసమతుల్యత, అతిగా
తినడం, అధికంగా మద్యం తీసుకోవడం, స్వీట్లు, చాకలెట్లు ఎక్కువగా తినడం,
వ్యాయామం చేయకపోవడం. ఇవి కాక కొవ్వు చేరేందుకు ప్రధాన కారణం ఒత్తిడి కూడా.
ఒత్తిడి వల్ల కార్టిసాల్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. కార్టిసాల్
అతిగా విడుదలైనప్పుడు అది పొట్ట చుట్టూ కొవ్వు చేరడాన్ని ఉత్తేజితం
చేస్తుంది. మరొక ప్రధాన కారణం జీర్ణ ప్రక్రియ సవ్యంగా లేకపోవడం. జీర్ణ
ప్రక్రియ సరిగా లేనప్పుడు వాయు సంబంధిత సమస్యలు వచ్చి పొట్ట ఉబ్బరంగా
అవుతుంది. వయసు పెరిగే కొద్దీ కాలరీలు ఖర్చు చేయడం తగ్గిపోయి పొట్ట చుట్టూ
కొవ్వు చేరడం జరుగుతుంది.
పొట్ట చుట్టూ కొవ్వు పెరిగినా నూనె వస్తువులు, కొవ్వు, కార్బో హైడ్రేట్లు
అధికంగా ఉన్న ఆహారాన్నే తింటూ ఉంటే ఆలోచించవలసిన సమయం ఏర్పడింది. ముందుగా
మీరు చేయాల్సింది ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. నిద్రించే సమయానికి రెండు
మూడు గంటల ముందు తినడం మానుకోవాలి. అంతేకాకుండా ఈ సమస్య నుంచి బయటపడేందుకు
సాయపడే ఆహారాన్ని తీసుకోవాలి. పొట్ట ఎక్కువగా ఉన్నవారు తీసుకోవాలసిన ఆహారం
ఇది.
పసుపు
రోజూ తినే తిండిలో వీలైనంత వరకు పసుపు వాడితే గుండెకు మంచిది. 'లో
డెన్సిటీ లిపొప్రొటైన్' (ఎల్.డి.ఎల్) అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి,
రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది పసుపు. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే
సమస్యను తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడుతుంది. నీళ్లలో కాస్తంత పసుపు
వేసి ఆవిరి పడితే జలుబు, దగ్గు మటు మాయమైపోతుంది.
తిన్న
ఆహారం సాఫీగా జీర్ణమైతేనే శరీరానికి తగినంత జీవశక్తి లభిస్తుంది.
యాలకులతో జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. ఇదివరకే శరీరంలో పేరుకుపోయిన అదనపు
కొవ్వును సైతం తొలగించే శక్తి యాలకులలో ఉంది.
మిరపకాయ
వీటిని (ఆహారంలో భాగంగా) తిన్నాక కేవలం 20 నిమిషాల్లోనే ప్రభావం కనిపిస్తుంది. మిరపలోని క్యాప్‌సైసిన్ క్యాలరీలను వేగంగా ఖర్చుచేస్తుంది. క్యాలరీలు తొందరగా ఖర్చయ్యేకొద్దీ కొలెస్ట్రాల్ పెరగదు.కరివేపాకు
బరువు తగ్గించేందుకు కరివేపాకులు చాలా కష్టపడతాయి. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు, చెడుకొవ్వును ఊడ్చేస్తాయి ఇవి. కూరల్లో కలిపి తిన్నా సరే, లేకపోతే రోజూ పది కరివేపాకులతో జ్యూస్ చేసుకొని తాగినా మంచిదే.వెల్లుల్లి
ఇందులోని
యాంటీ బాక్టీరియల్ యాసిడ్స్ కొవ్వును బాగా తగ్గిస్తాయి. అందుకే
వెల్లుల్లిని 'ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్' అని పిలుస్తారు. చెడు కొలెస్ట్రాల్‌ను
తగ్గించి, అధిక రక్తపోటు సమస్యను నివారించడంలో వెల్లుల్లి పాత్ర ఎనలేనిది.
0 Comments