Full Style

>

వందేళ్ళ కంటి చూపుకు.. టాప్ టెన్ బెస్ట్ ఫుడ్స్...


 ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో కొన్ని విషయాలు, పనులు సర్వసాధారణంగా మారిపోయాయి. అందులో ఆఫీసులో బోలెడంత పని చేస్తారు. కళ్ళకు కంప్యూటర్‌ల వల్ల శ్రమ తప్పదు. ఆఫీసు ముగిసిన తరువాత ఇంటీకి వచ్చిరాగానే ఇక ఫ్రెండ్స్‌తో చాట్‌ చేయటం మొదలుపెడతారు. అప్పుడు కూడా కళ్ళకు రెస్ట్‌ వుండదు. ఇవి పూర్తి కాగానే నిద్రపోదాం అని అనుకుంటూనే గంటలు గంటలు టి.విని చూడటం మొదలు పెడతాం. ఇలా చేస్తే కళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది అని ఆలోచించరు. కంటికి సంబంధించి ఏమైనా సమస్య వస్తే అప్పుడు ఇబ్బంది పడతాము. టీవీల ముందు, కంప్యూటర్ల ముందు గంటల తరబడీ గడపటం వల్ల క్రమంగా కంటికి సంబంధించిన సమస్యల బారిన పడతారు. సరైన నిద్రలేని కారణంగా కళ్ళ కింద నల్లటి చారలు, కంటి చూపు తేడాగా వుండటం మరియు మందగించడం అంతేకాకుండా కళ్ళ మంటలు, కళ్ళలోంచి నీరు కారటం వంటివి జరుగుతుంటాయి. కళ్ళ భాదలు వేధిస్తుంటాయి. ఇలాంటి సమస్యల రాకుండా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కళ్లను ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే కాకుండా, అందమైనకళ్లను ఆరోగ్యంగా వుంచు కోవచ్చు.

వీటిని కోల్డ్ వాటర్ ఫిష్ అంటారు. వీటిల్లో డిహెచ్ ఎ అనే ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వలన సెల్ డ్యామేజ్ లేకుండా చూసి మాక్యూలర్ డిజనరేషన్ రాకుండా ఆపటం జరుగుతుంది.


సాధారణంగా మన శరీరంలో అవయవాలు సరీగ్గా పని చెయ్యాలంటే వాటికి తగిన పోషక పదార్ధాలు ఇవ్వాలి. అన్నిఅవయవాలలోకీ కళ్ళు ప్రధానం అంటారు. వాటిని జాగ్రత్తగా చూసుకోవటం జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. వయస్సు పెరిగిన కొద్దీ కళ్ళ కు వచ్చే సమస్యలు పెరుగుతూ ఉంటాయి. దానికి తోడు పొగత్రాగుట, స్థూలకాయం కూడా ఉంటే ఈ సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఆ సమస్యలు, మాక్యులర్ డిజనరేషన్(చుట్టూతా కనపడుతుంది కానీ చూపులో మధ్య భాగం కనపడదు), కాంటరాక్ట్స్(కంట్లో లెన్స్ మసక బారుతుంది), గ్లౌకోమా(కంట్లో నీటి వత్తిడి పెరిగి ఆప్టిక్ నర్వ్ చెడిపోయి చూపు సన్నగిల్లు తుంది.).

ఆహార నియమాలలో ముందుగా కొన్నిజాగ్రత్తలు పాటిస్తే కళ్ళ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు అంటారు ఆరోగ్య నిపుణులు. మనం తీసుకునే ఆహారంలో, ల్యూటిన్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ సి, విటమిన్ ఇ, ఉంటే కంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు అంటారు వారు. పచ్చికూరలు ఎక్కువగా తింటే మీ కంటికి మంచిది. మనకు విరివిగా లభ్యమయ్యే క్యారెట్స్ లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. మరి రొటీన్ గా తీసుకోవాల్సిన ఆ ఆహారాలేంటో చూద్దాం...
కోల్డ్ వాటర్ ఫిష్ మరియు ఆస్ట్రిచెస్
వీటిని కోల్డ్ వాటర్ ఫిష్ అంటారు. వీటిల్లో డిహెచ్ ఎ అనే ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వలన సెల్ డ్యామేజ్ లేకుండా చూసి మాక్యూలర్ డిజనరేషన్ రాకుండా ఆపటం జరుగుతుంది. 
ఆకు కూరలు-గ్రీన్ వెజిటేబుల్స్
బచ్చలి కూర, దుంప బచ్చలి. కాలే, స్విస్ చార్డ్, టర్నిప్, ఆవాలు మరియు కొల్లార్డ్ గ్రీన్ ఇవన్నీ కూడా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. అసలు పచ్చటి ఆకు కూరలేవయినా మంచివే. వీటిల్లో ఉండే లూటిన్, సెల్ డ్యామేజ్ ని అరికడుతుంది. అంతే కాదు వీటితో మస్కులార్ డిజనరేషన్, కాంటరాక్ట్స్ రాకుండా ఆపవచ్చు.
  పండ్లు మరియు కూరగాయలు
పండ్లు, కూరగాయల్లో అతి ముఖ్యమైన విటమిన్ ఎ, సి, ఇ మరియు బీటా కెరోటిన్ కలిగి ఉంటాయి. పసుపు కలర్ వెజిటేబుల్స్ ను ఆహారంలో తరచూ తీసుకోవడం వల్ల పగటి చూపు బాగా వుంటుంది.  
వెల్లుల్లి - ఉల్లిపాయ
వెల్లుల్లి, ఉల్లిపాయలో అధిక శాతంలో సల్ఫర్ గ్లూటథియొనో ఉత్పత్తి చేసే యాంటిఆక్సిండెంట్స్ కంటి చూపుకు చాలా ఉపయోగకరం.
సోయా
సోయా మిల్క్, సోయా సాస్, మిసో మరియు టెంఫ్ వీటిల్లో అత్యంత శక్తివంతమైన యాంటి ఆక్సిండెంట్స్ ఉత్ప్రేరకాలు ఉన్న ఐసోఫ్లెవెన్స్ వల్ల కళ్ళకి వచ్చే డ్రై ఐస్ సిండ్రోమ్, కాంటరాక్ట్స్ రాకుండా కాపాడుతాయి. 
బెర్రీస్
బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, మల్ బెర్రీస్, చెర్రీస్ మరియు గ్రేప్స్ ఇవన్నీకార్డియో మాస్కులర్ ఆరోగ్యానికి చాలా మంచివి. బ్లడ్ ప్రెజర్, వాపులు (inflammation) తగ్గించటానికి మంచివి. మస్కులర్ డిజనరేషన్ రావటానికి బ్లడ్ ప్రెజర్ కూడా ఒక కారణం. 


గుడ్లు
వీటిల్లో ఉన్న ఒమేగా 3ఫ్యాటీ ఆసిడ్స్ డిహెచ్ ఎ, ల్యూటిన్ మరియు జియాక్సిథిన్ కళ్ళకి చాలా మంచివి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇవి తినే ముందు డాక్టర్ ని అడగటం మంచిది. ఇందులో ఉన్న బిటమిన్ బి సెల్ ఫంక్షన్ కు ఎక్కువగా ఉపయోగపడుతుంది.
క్యారెట్ -బెల్ పెప్పర్
ఆరెంజ్ బెల్ పెప్పర్స్, గోబీ, బెర్రీస్, గుమ్మడికాయ, క్వాష్, స్వీట్ పొటాటో, మరియు క్యారెట్స్ వీటి ప్రత్యేకత అన్నీఆరెంజ్ రంగులో ఉండటం. వీటిల్లో విటమిన్ A, C, లూటిన్, జియాక్సిథిన్ ఉండటం మూలంగా కాంటరాక్ట్స్, మస్కులర్ డిజనరేషన్, రేచీకటి మొదలగు కళ్ళ వ్యాధులు రాకుండా రక్షణ ఉంటుంది.
 నట్స్ మరియు బెర్రీస్
నట్స్, పిస్తాచోస్. వీటిల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. ఇవి వాపు(inflammation)ను తగ్గించి కంటి ఆరోగ్యాన్ని, కార్డియో వాస్కులర్ ఆరోగ్యాన్నీ కాపాడుతాయి. బెర్రీస్ లో ఉన్న ఫ్లెవనాయిడ్స్, నేచురల్ యాంటీయాక్సిండెస్ కళ్ళును సురక్షితంగా ఉంచేందుకు ఉపయోగపడుతాయి.
డైరీ ప్రొడక్ట్స్
పాల ఉత్పత్తులు(పాలు, వెన్న, వనస్పతి, క్రీమ్, జున్ను)ఇవన్నింటిలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. విటమిన్ ఎ అనేక రకాలైనటువంటి కంటి సమస్యలను దూరం చేస్తాయి. దృష్టితక్కువగా కనబడం, రేచీకటి, రాత్రి సమయంలో కనబడుకుండుట వంటి అనేక సమస్యలకు పరిస్కారం విటమిన్ ఎ



Post a Comment

0 Comments