Full Style

>

పురుషుల బరువును.. పొట్టను తగ్గించే డైయట్ ఫుడ్స్..


       స్త్రీ, పురుషుల ఫిజికల్ గా గమనించినట్లైతే ఇద్దరి శరీర తత్వాలు డిఫరెంట్ గా ఉంటాయి. వారి జీవక్రీయ పరిమితి కూడా భిన్నంగా ఉంటాయి. అందు వల్లే స్త్రీలతో పోల్చితే పురుషులు వివిధ మార్గాల్లో బరువు పెరగుతారు. సాధారణంగా మనం తీసుకొనే వివిధ రాకాలైనటువంటి సమతుల్య ఆహారం అందరికీ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందిస్తుంది. అయితే కొన్ని సార్లు మనం తీసుకొనే ఆరోగ్యకరమై ఆహారాలు లిగం బేదం(ఆడ, మగ)పై ఆధారపడి ఉంటాయి. కొన్ని ఆహార పదార్థాలు మహిళలకు, పురుషులకు అని లేకుండా తింటుంటారు. అయితే డైయట్ విషయంలో మహిళలు ఒక రకమైన ఫుడ్ ను తీసుకొంటే పురుషులకు మరో రకమైనా ఆహారాలు ఉన్నాయి. అది వారి వారి ఆరోగ్యాలపై ప్రభావాన్ని చూపెడుతాయి. కాబట్టి పురుషు తమ బరువును తగ్గించుకొనే క్రమంలో కొన్ని డయట్ విషయాలను పాటించినట్లైతే అతి త్వరగా బరువును తగ్గించుకోవచ్చు. డయట్ విషయంలో ముఖ్యంగా మగవారు తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏంటో ఒక సారి చూద్దాం...
diets that work men

1. గుండెకు సంబంధించి ఆరోగ్యకరమైన ఆహారం: సాధారణంగా గుండె జబ్బుల భారీన అధికంగా పడుతున్నది పురుషులు. అది కూడా వివిధ రకాలుగా సంబవించవచ్చు. మగవారి రక్తం ప్రవాహంలో హానికరమైన కొవ్వులను మరింత పేరుకుపోవడం చేత ఇలాంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి లోకొలెస్ట్రాల్ ఉన్న ఆహారం తీసుకోవడం పురుషులకు ఆరోగ్యకరం , కొవ్వులేని మాంసం, పచ్చసొన లేని గుడ్డు, లోఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ వంటివి పురుషుల యొక్క డైయట్ లో ప్రధానంగా తీసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు గ్రీన్ లీఫీ వెజిటెబుల్స్, హెల్తీ ఆయిల్స్, ఆలివ్ ఆయిల్ ను వంటల్లో ఉపయోగించడం వల్ల గుండెకు ఆరోగ్యకరం. చేపల్లో మంచి కొలెస్ట్రాల్ ఉండటం వల్ల పురుషు తీసుకొనే ఆహారంలో చేపలను చేర్చడం ఎంతో ఆరోగ్యం కరం.
హై ప్రోటీన్ డైయట్: స్త్రీలతో పోల్చుకుంటే పురుషులు అధిక ప్రోటీనులు కలిగిన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీనులు అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల పురుషులు తమ బరువును అతి సులభంగా, అతి త్వరగా తగ్గించుకోవచ్చు. పిండి పదార్థాలను సాధ్యమైనంత వరకూ తగ్గించేసుకోవాలి. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న బియ్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి మాంసహార, శాకాహార ఆహారాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి.
పాలియో డైయట్: పాలియోథిక్ డైయట్ లో ముఖ్యంగా పండ్లు, వెజిటేబుల్స్, మాంసం, చేపలు, గుడ్లును తీసుకోవాలి. పంచదార, ఉప్పు, చీజ్, బ్రెడ్ వంటివి తగ్గించాలి. ఈ డైయట్ పురుషులకు చాలా ఆరోగ్యకరం. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడానికి బాగా ఉపయోగపడుతాయి.
యాబ్స్ డైయట్: పురుషుల చాలా వరకు బెల్లీ ఫ్యాట్ ను ఇష్టపడరు. వారి పొట్ట ఎప్పుడూ సాధాగా ఉండాలని జాగ్రత్తలు తీసుకొన్న ఒకానొక సందర్భంలో ఈ సమస్యను ఎదుర్కోవల్సి ఉంటుంది. కాబట్టి కాబట్టి వారు యాబ్స్ డైయట్ తప్పనిసరిగా పాటిస్తే బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు. ఇది ముఖ్యంగా జీరో కార్బోహైడ్రేట్ డైయట్. ఇందులో ఎక్కువగా పండ్లు, కూరగాయలు. ఎక్కువగా నీళ్ళు తాగాలి. ఇవి పాటిస్తే తప్పనిసరిగా బరువుతగ్గి బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు.
జోన్ డైయట్: ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి డైయట్. శరీరంలోని జీవక్రియ సక్రమంగా జరగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ డైయట్ వల్ల పురుషులకు ముఫ్పై శాతం ప్రోటీన్స్, ముప్పై శాతం ఫ్యాట్స్, మరియు నలభై శాతం కార్బోహైడ్రేట్స్ అంధించి జీవక్రియను మెరుగుపరుస్తుంది. కొవ్వును కరిగించడానికి బాగా సహకరిస్తుంది.

Post a Comment

0 Comments