* తలనొప్పిని దూరం చేసేందుకు నీళ్లు ఎక్కువగా తాగాలి. వేడి కారణంగా డిహైడ్రేషన్ సమస్య వచ్చి, తద్వారా తలనొప్పి బాధిస్తే మాత్రమే ఈ చిట్కా ఫలిస్తుంది. విద్యార్థులు పాలు కలపని కాఫీ తాగితే రాత్రిళ్లు నిద్ర రాదు. కెఫీన్ నిద్ర పట్టకుండా చేస్తుంది. పైగా దీని ప్రభావం 20 గంటల దాకా ఉంటుంది. అయితే అతిగా తాగితే మాత్రం అనర్థమే.
* దంతాల నొప్పికి లవంగాల నూనె భేషుగ్గా పనిచేస్తుంది. లవంగ నూనెలో దూదిని నానబెట్టకుండా, ఒకసారి ముంచి తీసేయాలి. ఆ తర్వాత నొప్పి అనిపించిన చోట ఉంచాలి. ఆ ప్రాంతంలో వేడినీటితో అద్దుకోవడం లేదా పుక్కిలించడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే దాని తాలూకు ఇన్‌ఫెక్షన్ మిగిలిన ప్రాంతాలకూ వ్యాపిస్తుంది.
* శీతాకాలంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు పోషకాహారం కాస్త ఎక్కువగా తీసుకోవాలనేది వాస్తవం. అయితే ఏదిపడితే అది కాకుండా వేడివేడి సూప్‌లు, విటమిన్ ఇ ఉండే ఆహారపదార్థాలు, ముఖ్యంగా నట్స్‌ను ఎక్కువగా తీసుకోవడం మంచిది.
0 Comments