ఛీ.. ఛీ.. ఆ అలవాట్లు మానుకోండి
జంక్ ఫుడ్:
మనసుకి బాధగా ఇబ్బందిగా అనిపించినప్పుడు ఒక పెద్ద చాకొలెట్
బార్ తినేసి హమ్మయ్య ఇప్పుడు మనసు తేలిక పడింది అనుకుంటారు. కానీ ఆ
చాకొలేట్ బార్ మీ నడుము చుట్టుకొలతని పెంచుతుందనే విషయాన్ని గుర్తించరు.
విచారంగా ఉన్నప్పుడు జంక్ ఫుడ్ తినాలనిపించడం సహజం. ఇలా తినడం వల్ల
అప్పటికప్పుడు ఉపశమనం కలుగుతుంది. కాని మీ సమస్య పరిష్కారం కాదు. అందుకని
బరువులో మార్పు తెచ్చే ఈ పద్దతి కంటే మనసుకి ఉత్సాహాన్నిచ్చే ఇతర
పద్ధతులన్ని వెతుక్కోవాలి.మేకప్ తో నిద్ర:
చాలా మంది మేకప్ తీసేందుకు ఓపిక లేదంటూ రాత్రిళ్లు
మేకప్ తోనే నిద్రపోతారు. ఇలా చేయడం వల్ల ఉదయం నుంచి పేరుకుపోయిన దుమ్ము,
ధూళి రాత్రంతా అలానే ఉండి ముఖంపై చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దానివల్ల
ముఖంపై మచ్చలు ఏర్పడడం మొదలవుతుంది. అలాగే మస్కారా, ఐ మేకప్ వంటివి
తీయకుండా నిద్రపోవడం వల్ల కంటి దురద, ఇన్ఫెక్షన్ లు వస్తాయి.నిద్ర సరిగా లేకపోయినా:
నిద్ర సరిగా లేకపోవడం వల్ల సమస్యలు మగవాళ్లతో
పోలిస్తే ఆడవాళ్లలోనే ఎక్కువ నిద్రలేమి వల్ల రకరకాల సమస్యలు వచ్చిపడతాయి.
పనిసామర్థ్యం తగ్గిపోతుంది. లైంగికాసక్తి ఉండదు, వాహనాలు నడిపేటప్పుడు
యాక్సిడెంట్లు చేసే అవకాశం ఉంది. ఎక్కువ కాలరీలున్న ఆహారాన్ని తినడం వల్ల,
చర్మం కాంతి విహీనమైపోయి, ముడతలు వచ్చిన ముసలివాళ్లలా కనిపిస్తారు.


0 Comments