Full Style

>

దాల్చిన చెక్కలో దాగిన రహస్యాలు



దాల్చిన చెక్కను ఏ భాషలో ఏమంటారు?
దీనిని సంస్కృతంలో బహుగందా, చీలదరుసీతా, రామభ్రహ్మా, శేకల, యువకల్ప అంటారు. హిందీలో దాల్చిని, దారుచినీ అంటారు.  లాటిన్ భాషలో సిన్నోమోనర జేలిల్యానికం అంటారు.
దాల్చిన చెక్క గుణ దోషములు
దాల్చిన చెక్క ఫైతోలు చేదుగా సువాసనగా తీక్షణమైనదిగా ఉంటుంది.
ఇది క్రిములను నాశనం చేస్తుంది, వాత రోగాలలో, పిత్తరోగములలో ఇది బాగా సహాయపడుతుంది, కంఠములో తడి అరిపోవటం, వాతనాడులలో మంటలు పుట్టడం అతిసారము, వంటి దురద, గుదద్వారము వద్ద కలిగే సమస్యలు, మొలలు, హృదయ వికారములు మొదలైన సమస్యలలో ఇది అత్యంత ఉపయోగకారి.
దాల్చినచెక్క గర్భాసయములలో ఉత్తేజకముగా పనిచేసి దానిని బిగువుగా సంకుచితముగా చేస్తుంది.  రక్తములో తెల్లకనాలను వృద్ది చేస్తుంది.  దాల్చిన తైలం నొప్పుల పైన లేపనము చేస్తే వెంటనే నొప్పులను తగ్గిస్తుంది.  వ్రణములపైన లేపనము చేస్తే వ్రణాలను తగ్గిస్తుంది.
పురుషుల యవ్వన శక్తిని ఎల్లపుడు కాపాడగల అనేక ములికలలో ఈ దాల్చిన అతి ప్రధానమైనది. ఇది శరీరంలోనికి వెళ్ళిన వెంటనే చిన్న చిన్న పరమాణువులగా మారిపోయి రక్తములో కలిసిపోయి శరీరం అంతా వ్యాపించి అన్ని అవయవాల క్రియలను క్రమబద్దం చేస్తూ ఉంటుంది.  కామశక్తి పెరుగుటకు,  కామేంద్రీయముకు ఉత్తెజము అగుటకు కూడా ఇది దివ్య ఔషధమే.
అంగబలహీనతకు
కొంచెము దాల్చిన చెక్క ముక్కను నోటిలో వేసుకుని చప్పరించి ఆ రసమును మర్మాంగముపై లేపనము చేసుకుని అది ఆరిన తరువాత సంసారములో పాల్గొంటూ ఉంటె మర్మాంగము మద్యలో వాలిపోకుండా ఉండి ఇరువురికి సంతృప్తి కలిగిస్తుంది.
ముఖము నునుపుగా ఉండుటకు
దాల్చిన చెక్కను మంచినీటితో అరగదీసి ఆ గంధాన్ని మొటిమలు మచ్చలు గుంటలు వీటిపైన లేపనము చేసి ఆరిన తరువాత చల్లని నీటితో కడుగుతూ ఉంటె చర్మము నునుపుగా తయారవుతుంది.
కడుపు ఉబ్బరము (గ్యాస్)
దాల్చిన చెక్కపొడి ఒక గ్రాము, ఏలక్కాయల పొడి ఒక గ్రాము, సొంతిపొడి ఒక గ్రాము కలిపి భోజనానికి ముందు సేవిస్తూ ఉంటె కడుపు ఉబ్బరము తగ్గిపోయి మందాగ్ని హరించి బాగా ఆకలి పుడుతుంది.
అతి జలుబు సమస్యకు
దాల్చిన చెక్కపొడి ఒక గ్రాము, లవంగముపొడి అర గ్రాము, సొంటి పొడి ఒక గ్రాము ఈ మూడింటిని క లీటర మంచి నీటిలో వేసి పావు లీటరు మిగిలే వరకు మరిగించి వడపోసి దానిని మూడు బాగములు చేసి ప్రతిరోజు మూడుపుటలా సేవిస్తూ ఉంటె తీవ్రమయిన జలుబు తగ్గిపోతుంది.
తలనొప్పికి
దాల్చిన తైలము మూలికల అంగళ్లలో దొరుకుతుంది, దానిని ఇంటిలో సిద్దముగా ఉంచుకుని తలనొప్పి కలిగినప్పుడు ఒకటి రెండు చుక్కల తైలాన్ని నుదిటిపైన లేపనము చేసుకుంటూ ఉంటె తలనొప్పి వెంటనే తగ్గి పోతుంది.
దంతములో క్రిములు భాధకు
దూదిపైన ఒక చక్క దాల్చిన తైలము వేసి ఆ దూదిని గుండ్రముగా చుట్టి నొప్పి ఉన్న పంటి వద్ద నొక్కి పెట్టి ఉంచితే వెంటనే లోపల ఉన్న పురుగు చనిపోయి బాధ తగ్గిపోతుంది.
చెవిలో నొప్పికి
దాల్చిన తైలము రెండు చుక్కల మోతాదులో రెండు పుటల చెవులలో వేస్తూ ఉంటె చెవి బాధ వెంటనే తగ్గిపోతుంది.

Post a Comment

0 Comments