Full Style

>

ఉప్పుకు బదులు బిపిని కంట్రోల్ చేసే ఐదు వస్తువులు


  సాధారణంగా మనం తీసుకొనే ఆహారంలో రుచికి తగ్గ ఉప్పు లేకపోతే ఆహారాన్ని తినలేం. అందుకే కొన్ని సార్లు సలాడ్స్, సూప్స్, డింక్స్ మరియు ఆహారంలో ఉప్పు తక్కువైతే వెంటనే కొద్దిగా చిలకరించేస్తుంటాం. అయితే అటువంటప్పుడు ఎంత మొత్తంలో వేస్తున్నాం అన్నది తెలియకుండానే వేసి రుచిగా లాగించేస్తుంటారు. దాంతో ఒత్తిడి మొదలవుతుంది. అవన్నీ తెలియకనే హైపర్ టెన్షన్ కు గురికావాల్సి వస్తుంది. మనలో హై బ్లడ్ ప్రెజర్ లేకపోయినప్పటికీ ఎక్కువ సోడియంను తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మనంతట మనం హై బీపీని కొనితెచ్చుకొన్న వాళ్ళం అవుతాం.

         కాబట్టి సోడియం(ఉప్పు)కు బదులుగా కొన్ని ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఉప్పుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించేటటువంటి అలాంటివి కొన్ని వస్తువులు వంటచేసేటప్పుడు లేదా తినేటప్పుడు ఉపయోగించవచ్చు. మరి అవేంటో చూద్దాం...

మిరియాలు  రుచికి ఘాటుగానూ, కారంగానూ వుంటాయి. మనం వాడే ప్రతి వంటకాలలో మిరియాలు, మిరియాలపొడి తప్పనిసరిగా ఉంటుంది. అవి మనకు, మన ఆరోగ్యానికి సంబంధించి ఎన్నోలాభాలను కలిగిస్తుంది. ఆహారంలో ఉప్పుకు బదులుగా వీటిని ఉపయోగించడం వల్ల శరీరంలో పేరుకున్న కఫాన్ని కరిగించడానికి తోడ్పడతాయి. ఒక్క జలుబు, దగ్గు మాత్రమే కాదు.. మరెన్నో విధాల మేలుచేస్తాయి మిరియాలు. శరీరంలోనున్న అధిక కొవ్వును తగ్గించాలంటే మిరియాల రసం తాగితే మంచి ఫలితం వుంటుంది.


నిమ్మరసం కొద్దగా ఉప్పు రుచినే కలిగి ఉంటుంది. అయితే ఇది ఉప్పు ఇచ్చినంత రుచిని ఇవ్వకపోయినా దీన్ని ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఉపయోగకరం. నిమ్మరసాన్ని గ్రిల్డ్ ఫుడ్ మరియు సలాడ్స్ లో ఉపయోగించడం వల్ల ఉప్పు లేకుండానే మంచి టేస్ట్ ను ఇస్తాయి.




ఇండియన్ మసాలాలతో తయారు చేసినటువంటిది చాట్ మసాలా. దీన్ని వివిధ సలాడ్స్, సూప్స్ లలో వినియోగిస్తుంటారు. చాట్ తయారు చేసుకొన్నప్పుడు లేదా బేల్ పూరీకి ఉప్పుకు బదులుగా ఛాట్ మసాలాను వినియోగిస్తే సరిపోతుంది.


 సలాడ్స్, సూప్స్ లో ఉప్పుకు బదులుగా వెనిగర్ ను వేయడం ఆరోగ్యకరం. ఆహారం పుల్లగా రుచిగా టేస్టీగా మార్చుతుంది. కాబట్టి సాల్టెడ్ వెనిగర్ కాకుండా సాదా వెనిగర్ మాత్రమే ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది. కాబట్టి వీటిని ఉప్పుకు ప్రత్యామ్నాయాలుగా వంటకాల్లో, ఇతర సలాడ్స్, సూప్ ల్లో ఉపయోగించి ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోండి....

Post a Comment

0 Comments