Full Style

>

ఎదిగే పిల్లలకూ నేర్పించండి ఫిట్ నెస్ మంత్ర..




Fitness Tips Growing Kids
       సాధారణంగాపిల్లలు పుట్టినప్పుడు ఒక బరువు, సంవత్సరం ఒక బరువు, సంవత్సరం తర్వాత మూడేళ్ళలోపు ఒకబరువు, దాని తర్వాత పెరుగుదలలో బరువులోనూ, శారీరకంగాను, వ్యక్తిగతంగానూ మార్పులు చేసుకుంటుంటాయి. అయితే ఎదిగే కొద్ది పిల్లలకు కూడా శారీరక ఎదుగుల ముఖ్యం. ఎదుగుతున్న పిల్లలు ఆరోగ్యంతోపాటు ఫిట్‌నెస్‌ తో ఉండాలంటే క్రీడా సంబంధ కార్యకలాపాలపై దృష్టి సారించాలంటున్నారు నిపుణులు. ఆటపాటలు పిల్లలకు పోటీతత్వంతోపాటు శారీరక దృడత్వాన్ని పెంచుతాయంటున్నారు. క్రీడలతోనే మీ పిల్లల స్టామినాతోపాటు పెరుగుదల మెరుగ్గా ఉంటుందంటున్నారు. పౌష్టికాహారం ఒక్కటే కాదు క్రీడలు పిల్లల స్టామినా పెంచటంలో దోహదపడుతుందంటున్నారు నిపుణులు.

1. పిల్లలు ఉత్సాహంగా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి. అవుట్‌డోర్ గేమ్స్, రన్నింగ్, క్లైంబింగ్, సైక్లింగ్‌లు పిల్లల స్టామినాను పెంచటంతోపాటు వారిని శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉంచుతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల పిల్లల బరువు పెరగకుండా ఉండటంతోపాటు మధుమేహం, అధిక రక్తపోటు లాంటి జబ్బులు దరిచేరవు.

2. ప్రతిరోజు పిల్లలు ఉదయం, సాయంత్రపు వేళల్లో వివిధ ఆటలు ఆడుకునేలా సమయాన్ని నిర్ధేశించండి. ఉదయం వేళ రన్నింగ్ చేయడం, సాయంత్రపు వేళ అవుట్‌డోర్ గేమ్స్ ఆడేలా ప్రణాళిక రూపొందించండి.

3. పిల్లలను రోజూ ఒకే ఆట ఆడేలా కాకుండా వివిధ రకాల వ్యాయామాలు, క్రీడల్లో పాల్గొనేలా అలవర్చండి. రన్నింగ్ ఒకటే కాదు సైక్లింగ్, ఫుట్‌బాల్, బాడ్మింటన్, టెన్నిస్, వాకింగ్, స్విమ్మింగ్, డ్యాన్సింగ్, యోగా, స్కేటింగ్ లాంటి క్రీడల్లో పాల్గొనేలా పిల్లల్ని ప్రోత్సహించండి.

4. సండే ఉదయం వేళ, సెలవు రోజుల్లో పిల్లలతో పాటు ఇంటిల్లిపాది కలిసి వివిధ ఆటలు ఆడేలా ప్రణాళిక రూపొందించుకోండి. ఫిట్‌నెస్‌తోపాటు మెరుగైన ఆరోగ్యం కోసం వ్యాయామం తప్పనిసరి అన్న విషయంపై కుటుంబసభ్యులందరికీ అవగాహన కల్పించండి.

5. మీ పిల్లల వయసును బట్టి వివిధ క్రీడా సంబంధ శిక్షణ కార్యక్రమాలకు పంపించండి. చిన్నారులకు డ్యాన్స్, సైక్లింగ్, స్కేటింగ్, స్విమ్మింగ్, కొంచెం పెద్ద పిల్లలకు టెన్నిస్, క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ లాంటి క్రీడల్లో శిక్షణ ఇప్పించండి.

6. మీ పిల్లల్ని ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్గొనేలా ప్రోత్సహించండి. డ్రామా, డిబేట్, గ్రూపు డిస్కషన్, మ్యూజిక్ లాంటి కార్యక్రమాల్లోనూ పొల్గొంటే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

Post a Comment

0 Comments