Full Style

>

శీతాకాలంలో పిల్లల పట్ల ఆరోగ్య బాధ్యతలు...


5 Ways Keep Kids Healthy Winter
శీతాకాలం... వర్షాకాలంలో ఆరోగ్యమంత్రంచినుకులు పడుతుంటే.. చిన్నా రులకు భలే మజా! వేడివేడిగా నూడుల్స్‌ తినొచ్చు.. చాట్‌బండార్‌ దగ్గర మారాం చేయొచ్చు. అయితే దగ్గు, జలుబు జ్వరం వంటి ఇబ్బందులతో పాటు డయేరియా వంటి సమస్యలు కూడా తేలిగ్గా దాడి చేసే ఈ కాలంలో చిన్నారుల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం అందించడం ఆవశ్యకం.అన్ని కాలాలు వేరు. కానీ వర్షాకాలంలో మాత్రం పిల్లల ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్త వహించడం అవసరం. ఆరోగ్య పరిరక్షణకు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టడం ఆవశ్యకం. చల్లగాలుల్లో, వర్షపు చినుకుల్లో తడుస్తూ చిన్నారులు బడికెళతారు. వర్షపు చినుకులను ఆస్వాదిస్తూ ఆటపాటల్లో మునిగిపోతారు. ఫలితంగా జలుబు, దగ్గు వంటివి నెమ్మదిగా వారిని వచ్చి చేరతాయి. ఈ కాలంలో మామూలే కదా అనుకుని కాస్త అశ్రద్ధ వహిస్తే అవి జ్వరంగా మారి వేధిస్తాయి. ఈ సమస్యే కాదు.. తాగే నీరు, తీసుకునే ఆహారం, పాటించే పద్ధతుల్లో సరైన మెలకువ చూపకపోతే వర్షాకాలంలో డయేరియా, టాన్సిల్స్‌, వైరల్‌ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు పసి వారిపై దాడి చేస్తాయి. వారాల పాటు కుంగదీస్తాయి. అలా జరగకుండా ముందుచూపు ప్రదర్శించాలి.

1. హెల్తీ లంచ్ బాక్స్: 

ఎక్కీగా ఎమిటంటే శీతాకాలం ఆరెంజ్ సీజన్. కాబట్టి పిల్లల లంచ్ బాక్స్ లో ఆరెంజ్ నింపి పంపించండి. ఇందులకు విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని కలిగి ఉడటం వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్ పిల్లలకు కలగకుండా కాపాడుతుంది. ఈ సీజన్ ఎక్కువగా ఆరెంజ్ దొరుకు తాయి కాబట్టి పిల్ల లచ్ బాక్స్ లో నింపి పంపడం ఆరోగ్యకరం. మరియు వీటితో పాటు కొన్ని కివి పండ్లు, ఉడికించిన పచ్చిబఠానీలు, ఆకుకూరలు వంటివి లంచ్ బాక్స్ నింపి పంపడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

2. రాత్రి డిన్నర్ కి గ్రీన్ వెజిటేబుల్స్ కి ప్రాధాన్యత:

కూరగాయలను ఎక్కువగా ఉడికిస్తే అందులో ఉన్న విటమిన్స్, న్యూట్రిషియన్స్ ను కోల్పోతాయి. కాబట్టి సాద్యమైనంత త్వరగా కూరగాయలను కచపచగా ఉడికించాలి. మైక్రోవోవెన్ లో ఉడికించడం కూడా మంచిదే. బ్రోకోలి, క్యాబేజి వంటివి మైక్రోవోవెన్ లో వేసి ఉడికించి తర్వాత దానికి కొద్దిగా నిమ్మరసం చేర్చి పిల్లలకు అందించండి. వీటితో పాటు చీజ్ సాస్ చాలా రుచిగా ఉంటుంది. వీటితో పాటు పాలు, పెరుగు, మైదా వేసి చీజ్ సాస్ ను తయారు చేయవచ్చు. దీన్ని ఉడికించిన వెజిటేబుల్స్ మీద వేసి పిల్లలకు అందిస్తే ఇష్టంగా తింటారు.

3. సూప్స్: 

శీతాకాలంలో పిల్లలకు సూప్స్ బూస్ట్ లా పనిచేస్తుంది. ఫ్లూ ఫైటింగ్ యాంటిఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్(క్యారెట్)మరియు లైకోపిన్(టమోటో మరియు రెడ్ క్యాప్సికమ్) వంటి వాటిలో ఉంటాయి కాబట్టి వాటితో సూప్ తయారు చేసి అందివవచ్చు. శీతాకాలంలో కొన్ని రకాల వెజిటేబుల్స్ తో ఇలాంటి సూప్స్ తయారు చేసి ఇవ్వడం వల్ల, పిల్లకు ఇమ్యూనిటి పెరుగుతుంది. చిక్ పీస్ మరియు బ్రెడ్ ముక్కలు, గార్లిక్, ఇటాలియన్ హెర్బ్స్ వంటివి వేసి తయారు చేసి ఇవ్వడం వల్ల పిల్లలకు చాలా ఆరోగ్యకరం.

4వెజిటేబుల్స్:

 శీతాకాలంలో పిల్లలు తినే ఆహారంలో వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పిల్లలకు పెట్టే ఆహారాలు అతిగా కారం లేకుండా బేబీ కార్న్, తో తయారు చేసి ఇవ్వడం కూడా ఆరోగ్యకరమే. క్యారెట్, వంకాయ, గ్రీన్ క్యాప్సికమ్, వంటి వాటితో తయారు చేసి ఇవ్వడం వల్ల మంచి సువాసనతో పాటు రుచిని కూడా అందిస్తుంది. పిల్లలకు ఇచ్చే ఆహారంలో గార్నిషింగ్ గా టమోటో, అవకాడో, చీజ్ మరియు కార్న్ వంటివి అలంకరించి సర్వ్ చేయాలి అప్పుడు వారు ఇష్టంగా తింటారు.

5. చేపలు:

పిల్లలకు విటమిన్ డి అధికంగా కావాల్సి ఉంటుంది. వేసవిలో సూర్య రశ్మి నుండి పొందవచ్చు. అయితే మిగిలిన సీజన్ లో విటమిన్ డిని ఆయిల్ ఫిష్, మరియు డైరీ ప్రొడక్ట్స్, గుడ్లు వంటి వాటితో అధికంగా దొరుకుతాయి. పిల్లలకు ఎక్కువగా ఉడికించిన గుడ్లు, సాల్మన్ ఫిష్ వంటి వాటిని అందించాలి.

Post a Comment

0 Comments