మనలను పలు రకాల ఇబ్బందులకు, ఇక్కట్లకు, అసౌకర్యా నికి గురి చేసే జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన అనేక రకాల సమస్యల్లో గ్యాస్‌ట్రబుల్ ఒకటి. నిజంగా చెప్పాలంటే వ్యవహారికంగా గ్యాస్ ట్రబుల్ అని మనం పిలిచే ఈ సమస్య వివిధ లక్షణాల సముదాయాత్మక సమాహారం. ఈ లక్ష ణాలు అందరిలోనూ ఒకేవిధంగా ఉండవు. విభిన్న వ్యక్తుల్లో, వివిధ సమయాల్లో, కాల వ్యవధిలో విభిన్న తీవ్రతతో ఆయా లక్షణాల ఉద్రేక ఉపశమనాలు కలుగు తుండటం ఈ రుగ్మతల ప్రత్యేకత. మనుష్యులు ఎదుర్కొనే అన్ని రకాల ఆరోగ్య సమస్యల్లో చాలా ఎక్కువగా కనబడే ఈ సమస్య అంత్యంత ప్రాధాన్యత సంతరించుకుం దంటే అతిశయోక్తి కాదు. సుమారు 70 శాతం మందిలో, ముఖ్యంగా నలభై ఏళ్లలోపు వారిలో ఎండోస్కోపి, బేరియం మీల్ ఎక్స్‌రే, కొలనోస్కోపి, స్కానింగ్ వంటి వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో ఎలాంటి స్పష్టమైన లోపాలు కనిపించనప్పటికీ అనేక ఇబ్బందులకు గురి చేసే ఈ సమస్య గురించిన అవగాహన ఉంటే దీనిని ఎదుర్కొనడం కష్టమేమీ కాదు. కడుపు ఉబ్బరం, త్రేన్పులు, కడుపులో, ఛాతీలో మంట, అపాన వాయువు ఎక్కువగా పోతుండటం, నోటిలో నీళ్లు ఊరడం, ఆకలి మందగించడం, అన్నం హఙతవు లేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.
కడుపు ఉబ్బరం వల్ల ఉదరభాగం బిగదీసుకు పోయి పట్టేసినట్లు ఉండి, అసౌకర్యంగా ఉంటుంది. కొద్దిగా ఆహారం తీసుకోగానే కడుపు నిండిన భావన, ఒళ్లు నొపrలు, ఆహారం సరిగ్గా జీర్ణం కాక పోవడం వంటి వివిధ లక్షణాలు అన్నీ కాని, లేదా వీటిలో కొన్ని కాని ఉంటాయి. వైద్యపరిభాషలో ఈ లక్షణ సమూహాన్ని డిస్పెప్సియా అంటారు. దీనినే ఫంక్షనల్ లేదా నాన్ అల్సర్ డిస్పెప్సియా అని కూడా అంటారు.
అతి కొద్దిశాతంమందిలో, ముఖ్యంగా నలభై ఏళ్లు పైబడిన వారిలో ప్రేవుల్లో కేన్సర్ అల్సర్ల వంటి తీవ్ర సమస్యల్లో ఇలాంటి లక్షణాలతోపాటు బరువు తగ్గిపోవడం, తరచు జ్వరం రావడం, రక్తయుక్త వాంతులు, మలం నల్లటి రక్తంతో కూడి ఉండటం తదితర లక్షణాలు కనిపిస్తే దానిని ఆర్గానికి డిస్పెప్సియాగా భావించాల్సి ఉంటుంది.
ప్రస్తుత కాలంలో చిన్న వయస్సునుంచే గుండె పోటువంటి ప్రమాదకర జబ్బులు అధికమవుతు న్నాయి. వీటి లక్షణాలు కూడా గ్యాస్ ట్రబుల్ లక్షణాలుగానే కనిపిస్తాయి. కనుక ప్రాణాపాయ స్థితికి గురి కాకుండా ఉండేందుకు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యనిపుణులను సంప్రదిం చాలి. వారి సలహా మేరకు వైద్య పరీక్షలు చేయిం చుకుని చికిత్స తీసుకోవాలి.
కాఫీ, టీ, మసాలాలు, ధూమపానం, మద్య పానం, నూనె పదార్థాలు, వేపుళ్ల వంటివి ఎక్కు వగా సేవించడం, నియమిత వేళల్లో సరైన పోషకాహారం తీసుకోకపోవడం, రాత్రిళ్లు నిద్ర మేల్కొనడం, పని ఒత్తిడి, మానసిక ఆందోళన, దిగులు, కుంగుబాటు, ఆహారం సరిగ్గా నమిలి మింగకపోవడం, శారీరక శ్రమ రహిత జీవనం, జీర్ణకోశంలో ఇన్‌ఫెక్షన్లు గ్యాస్ ట్రబుల్ సోకడానికి కారణాలు. అలాగే బీన్సు, చిక్కుళ్లు, క్యాబేజి, కాలిఫ్లవర్, పాలు, పాల ఉత్పత్తులు, గోధుమ, శనగపిండి వంటకాలు, వేరుశనగ, కందిపపr, ఉల్లిపాయ, పచ్చి కూరగాయలు, ద్రాక్ష, యాపిల్ వంటి పండ్లను అధికంగా సేవించడం వల్ల గ్యాస్ ట్రబుల్ సమస్య జటిలమవుతుంది. అంతేకాకుండా, మనం ద్రవ, ఘన ఆహార స్వీకరణ సమయంలో గాలిని మింగడం, మలబద్ధకం, వివిధ వ్యాధులకు వాడే మందులు, మధుమేహం, ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ వంటి కొన్ని వ్యాధుల వల్ల ప్రేగుల కదలికల్లో మార్పులు జరగటం, హార్మోన్ల అస్తవ్యస్తత మొదలైన అనేక కారణాలు గ్యాస్ సమస్యను కలిగిస్తాయి. సహజంగా మనం నోటి ద్వారా మింగే గాలి త్రేన్పు రూపంలో, ప్రేవుల్లో తయారయ్యే గ్యాస్ ఎక్కువగా అపానవాయువు రూపంలో బయటకు పోతుంది.
0 Comments