ఒకస్థాయిలో ఉండే ఒత్తిడి అందరికీ అవసరం. ఎదుగుదలకు అది సహకరిస్తుంది. కానీ పరిమితిని మించిన ఒత్తిడికి తరచుగా గురవుతూంటే అది ప్రమాదకరం అవుతుంది. అనేక ఆరోగ్య సమస్య లకు దారి తీస్తుంది. నేటి ఆధునిక ప్రపంచం మానవ జీవన శైలినే మార్చేసింది. అన్నింటా కృత్రిమత్వం, యాంత్రికత చోటు చేసుకున్నాయి. ప్రపంచీకరణ, అత్యంత వేగవంతంగా జరుగుతున్న మార్పులు, ఎపrడూ లేనంతగా తరిగిపోతున్న సామాజిక విలువలు, అదుపు లేకుండా పెరుగు తున్న జనాభా, ఆర్థిక అసమానతలు, కలుషిత వాతావరణం... ఇలా అనేక అంశాలు మనను ఎంతో అభద్రతాభావానికి, తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఈ ఒత్తిడి పైన చెప్పిన రెండవ కోవకు చెందుతుంది. దీని ప్రభావం శరీరంపై తీవ్రంగా ఉంటుంది. ప్రమాదకరమైన ఈ ఒత్తిడి వల్ల శరీరంలో కలిగే మార్పులు ఒక్కసారిగా సంభవించవు. అవి నిదానంగా జరగడం వల్ల మనం వాటిని గుర్తించలేము. ఊబకాయం, రక్తపోటు ఎక్కువ కావడం, మధు మేహం, గుండెజబ్బులు, జీర్ణకోశ వ్యాధులు, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, పిల్లలలో ఎదుగుదల లోపాలు, ఇతర శారీరక సమస్యలు మొదలైనవి అధిక ఒత్తిడి కారణంగా మెదడులోని కార్టిసోన్ మొదలైన రసాయనాల్లో మార్పులు జరగడం వల్ల సంభవిస్తున్నాయని పరిశోధనల్లో రూఢి అయింది. ఈ వ్యాధులు ప్రస్తుతం అధికమవుతున్నాయి. నేడు ఈ ఒత్తిడిని చిన్న వయస్సు పిల్లలనుండి అన్ని వయ స్సుల వారిలోనూ చూస్తున్నాం. ఉదాహరణకు నేడు 12 సంవత్సరాల వయస్సు పిల్లలు కూడా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ చదువుకుంటున్నారు. వీరు ఆటపాటలను, ఇతర విషయాలను పూర్తిగా మర్చిపోయారు. దీని ప్రభావం వారి ఎదుగుదలపై ఉంటుందని గ్రహించాలి. ఒత్తిడి తీవ్రమైతే అది సృజనాత్మకతను తగ్గిస్తుంది. కార్పొరేట్ కల్చర్ కారణంగా యువతపై ఒత్తిడి ఎంత పెరిగిందో వేరే చెప్పనవసరం లేదు. కుటుంబ సభ్యులు ఒకరితో మరొకరు మాట్లాడుకో వడానికి కూడా సమయం ఉండటం లేదు. ఒక అధ్యయనంలో ఒత్తిడి కారణంగా చాలా పని గంటలు నష్టపోతున్నామని, ఈ నష్టం కొన్ని కోట్ల డాలర్ల విలువ ఉంటుందని వెల్లడైంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్న ఉద్యోగులలో తలనొప్పి, మెడ నొప్పి, వెన్నునొప్పి, కండరాల నొపrలు, ఎసిడిటీ, జీర్ణకోశ వ్యాధులు మొదలైనవి అధికంగా సంభవి స్తున్నాయి.నేడు టెలివిజన్ పుణ్యమా అని కొద్దిపాటి శారీరక వ్యాయామం కూడా మనకు కరువైంది. నిరాశ, నిస్పృహ అధికమై యువత మత్తు పానీ యాలకు, మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారు. ఒక ప్రక్క కాలుష్యం కారణంగా స్వచ్ఛమైన మంచినీరు, పచ్చదనం కూడా కరువవుతున్నాయి. ప్రకృతిని చూసి ఆనందించే సమయం కూడా లేకుండా పోయింది. ఇన్ని రకాల సమస్యలకు కార ణమయ్యే ఒత్తిడిని నివారించుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. అది ఎలా సాధ్యమనే అంశాన్ని పరిశీలిద్దాం.
ఒత్తిడిని ఎదుర్కోవడం సాధ్యమే. ఇది ఒక సామాజిక సమస్య కనుక సమిష్టి కృషి అవసరం.మానవ జీవన ప్రయాణం తల్లి గర్భంలో ఒక కణంగా మొదలవుతుంది. మన ఆరోగ్యాన్ని కొంత వరకూ మన జన్యువులు శాసిస్తాయి. కనుక వివాహంనుంచి మన జాగ్రత్తలు మొదలవ్వాలి. ఆరోగ్యవంతమైన స్త్రీలు మాత్రమే పరిపూర్ణ శారీ రక, మానసిక ఆరోగ్యం కలిగిన పిల్లలకు జన్మనివ్వ గలరు. మేనరికపు వివాహాల వల్ల జన్యుపరమైన సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంటుంది. 21 నుంచి 35 సంవత్సరాల వయస్సు వివాహానికి తగినది. గర్భిణీలకు సమగ్ర పోషకాహారంతోపాటు భర్త, ఇతర కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, ఉల్లాసభరిత వాతావరణం ఎంతో ముఖ్యం. శిశువులకు తల్లిపాలు ఇవ్వడం ముఖ్యం. తల్లి పాలు శిశువుల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వారి శారీరక, మానసిక ఎదుగుదలకు అవి ఎంతో అవసరం. అంతేకాదు. శిశువులకు తల్లి పాలు ఇవ్వడంవల్ల రొమ్ము కేన్సర్, అండాశయపు కేన్సర్, రక్తహీనత, ఎముకల సంబంధిత వ్యాధుల నుంచి తల్లులకు రక్షణ లభిస్తుంది. మన మనోవికాసానికి బీజం పసి వయస్సులోనే పడుతుంది. పోషకాహారం, ఆటపాటలు మానసిక అభివృద్ధికి దోహదం చేస్తాయి. సృజనాత్మక శక్తి పెరుగుతుంది. మనోభావాల వ్యక్తీకరణకు, ఇతరుల భావోద్వేగాలు అర్థం చేసుకోవడం, వాక్చా తుర్యం మొదలైనవి పరిసరాల్లోని వ్యక్తులను చూసి అల వర్చుకుంటారు. మానసిక వ్యాధులకు, అధిక ఒత్తిడికి భావవ్యక్తీకరణ లోపాలే దారి తీస్తాయి.
0 Comments