Full Style

>

దంత క్షయంపై పోరాడే కొబ్బరి నూనె

దంత క్షయానికి కారణమయ్యే సూక్ష్మజీవిపై సహజసిద్ధమైన యాంటి బయాటిక్‌ కొబ్బరినూనె పోరాడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొబ్బరి నూనెలో సహజ సిద్ధంగా ఉండే యాంటి బ్యాక్టీరియల్‌ను ఐర్లాండ్‌లోని అథ్లొన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజికి చెందిన పరిశోధకులు పరీక్షించారు. నోట్లో సాధారణంగా ఉండే స్ట్రెప్టొకాకస్‌ బ్యాక్టీరియా రకాలు వృద్ధిపై ఎంజైము మార్చిన కొబ్బరి నూనె బలంగా నియంత్రిస్తుంది. ఈ బ్యాక్టీరియా వల్లనే దంత క్షయం కలుగుతుంది. 'దంత సమస్యలను చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. దీంతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లోని 60 నుండి 90 శాతం పిల్లలు,
పెద్దల్లో ఇదొక ఆరోగ్య సమస్యగా పరిణమిస్తోంది' అని పరిశోధనకు నేతృత్వం వహించిన డమిన్‌ బ్రాడి తెలిపారు.

Post a Comment

0 Comments