Full Style

>

చుండ్రుకు తగ్గించండి ఇలా..

స్త్రీలతో పోలిస్తే మగవారికే తలలో చుండ్రు వచ్చే అవకాశం ఎక్కువ. దీనికి ప్రధాన కారణం పురుషల తలలో నూనె ఉత్పత్తి చేసే గ్రంథులు ఎక్కువగా ఉంటాయి. అంతే గాక పురుష హార్మోన్లు కూడా చుండ్రుకు ప్రేరేపకంగా పనిచేస్తాయి. అంతేగాక జింక్ కాని విటమిన్ బి కాని ఉన్న ఆహారాన్ని తినడం మానేస్తే కూడా చుండ్రుతో బాధపడక తప్పదని వైద్య నిపుణులు అంటున్నారు. వీటితో తలలో ఉండే మలస్సీజియా అనే ఫంగస్ తలలో ఉన్న నూనెతో బతికేస్తూ చిటచిటలాడించేస్తుందట. తలకు ఎంత నూనె పెట్టుకుంటే అంత మంచిదని భావించారో అంతే సంగతులు.
చుండ్రు కూడా చకచక తలను చుట్టేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చుండ్రును వదిలించుకోవడానికి ముఖ్యమైనది తలను శుభ్రంగా ఉంచుకోవడమేనని వారు సూచిస్తున్నారు. దాంతోపాటు నాన్‌మెడికేటెడ్ షాంపూను ఉపయోగించడం, తలను షాంపూతో బాగా కడుక్కుని తలలో ఉన్న నూనెను, మృత చర్మ కణాలను తొలగించుకోవడం వల్ల చుండ్రు సమస్య తొలగిపోతుంది. అప్పటికీ వదలకపోతే యాంటీ డాండ్రఫ్ షాంపూను ఉపయోగించాలి. హెయిర్ స్ప్రేలు, జెల్, వ్యాక్స్ వంటివి పూర్తిగా మానేయాలి. వానలో తడిస్తే ఇంటికి రాగానే తలను శుభ్రంగా తుడుచుకుని పొడిగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

Post a Comment

0 Comments