- సూదులతో గ్రుచ్చినట్లుగానూ,
- తలపై బరువు పెట్టినట్లుగానూ,
- తల దిమ్ముగా ఉన్నట్లుగానూ,
- తలంతా భగభగ మండుతున్నట్లుగానూ,
- గునపాలతో గుచ్చినట్లుగానూ,
- రంపంతో కోసినట్లు గానూ,
- సుత్తులతో మోదుతున్నట్లుగానూ
తలనొప్పి ఉంటుంది. కొన్ని తలనొపrలు దైనందిన కార్య క్రమాలకు అంతరాయం కలిగిస్తే, మరి కొన్ని ప్రాణాంతకంగా కూడా తయార వుతుంటాయి. తలనొపrలకు సంబంధించిన ప్రాథమిక అవగాహనను ఏర్పరచుకుంటే, దానిని ఎదుర్కో వడటం అంత కష్టతరం కాదు.
తలకు ఇరుపక్కలా నొప్పిగా, బరువు పెట్టినట్లు, బిగిం చినట్లు కొందరిలో తలనొప్పి వస్తుంది. ఆందోళన, ఆతృత, మనోవ్యాకులత, ఎపrడూ తన ఆరోగ్యం గురించి అతిగా చింతి స్తుండటం మొదలైన కారణాల వలన వచ్చే ఇలాంటి తలనొప్పిని టెన్షన్ హెడేక్‌గా వ్యవహరిస్తారు. జీవన శైలిలో మార్పులు చేసు కుని, మానసిక ప్రశాంతత అలవరచుకోవాలి. యోగ, ధ్యానంలాంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి.
మనం తీసుకునే ఆహార వేళల మధ్య వ్యవధి ఎక్కువగా ఉండటం, సరిపడని ఆహారం తీసు కోవడం, అకాల భోజనం మొదలైన కారణాల వలన కూడా తలనొప్పి వస్తుంటుంది. ఆహారపు అలవాట్లను నియమబద్ధం చేసుకుంటే ఈ సమస్య ఉండదు. కొందరిలో నుదురు భాగంలో కంటికి పైన ఉండే సైనస్ అనే గాలి కుహరాలకు ఇన్‌ఫెక్షన్ సోకినపrడు తలనొప్పి వస్తుంది. ఈ నొప్పి ఉదయంపూట ఎక్కువగా ఉంటూ, ఎండ పడే కొద్దీ క్రమేపీ తగ్గిపోతుండటం, ముందుకు వంగి నపrడు నొప్పి ఎక్కువకావటం వంటి లక్షణాల తోపాటు జ్వరం, వాంతులు అనుబంధంగా ఉంటాయి. దీనిని సైనసైటిస్ అంటారు. మరి కొంతమందిలో నేత్ర సంబంధ రుగ్మతల్లో అడపా దడపా కణతల వద్ద నొప్పిగానూ, నుదుటిమీద బరువు పెట్టిన ట్లుగానూ ఈ తల నొప్పి వ్యక్తవమవుతుంటుంది. అధికరక్తపోటు బాధితుల్లో తలనొప్పి కనిపించే అవకాశ ముంది. ముఖ్యంగా డయాస్టోలిక్ ప్రెషర్ 110 ఎంఎంహెచ్‌జి దాటిన వారిలో తప్పక ఈ తలనొప్పి అనుబంధంగా ఉండే అవకాశం హెచ్చు. చేతులు, కాళ్లు, శరీరంలో వణుకు, కోపం, గుండెదడ మొదలైన లక్షణాలు కూడా వీరిలో కనిపిస్తాయి. తలకు దెబ్బ తగిలినపrడు లేదా గాయమైన పrడు కలిగే తలనొప్పి క్రమంగా కొన్నాళ్లకు తగ్గిపోతుంది. అలాకాక, రోజు రోజుకు తీవ్రమ వుతుంటే తాత్సారం చేయకుండా వైద్యనిపుణు లను సంప్రదించాలి. మెదడుకు సంబంధించిన వివిధ రకాల వ్యాధుల్లో అకస్మాత్తుగా తీవ్ర తలనొప్పితోపాటు జ్వరం, మెడ బిగదీసుకు పోవడం, వాంతులు, నడకలో మార్పులు రావడం, మాటల్లో స్పష్టత లేకపోవడటం, వెలుతురు చూడలేకపోవడం, ఒళ్లు నొపrలు, అనియంత్రత, మూత్ర, మల విసర్జన, మూర్ఛల వంటి లక్షణాలుంటే వైద్య నిపుణులను సంప్రదించి, తగు చికిత్సలు చేయించుకోవాలి. కొంతమందిలో నిర్దిష్టమైన కారణాలు లేకుండా అజీర్తి, మల బద్ధకంలాంటి సమస్యల వలన కూడా తలనొప్పి వస్తుంది.
కొన్ని కుటుంబాలలో, ముఖ్యంగా మహిళ లలో మైగ్రెయిన్ అనే తలనొప్పి సాధారణంగా కనిపిస్తుంటుంది. ఈ నొప్పి చాలామందిలో చిన్న వయస్సు లేదా యవ్వనదశలో ప్రారంభమై ఇంచుమించు బహిష్టులాగిపోయిన తరువాత కనిపించక పోవచ్చు. ఒకవైపే నొప్పి వస్తుంది. వెలుతురును చూడలేక పోవడం, వెలుతురు వలన తలనొప్పి మరింత ఎక్కువ కావటం, తల నొప్పి ఉన్నభాగంపై స్పర్శ తగిలితే భరించలేక పోవడం మొదలైనవి అనుబంధంగా ఉంటాయి. 20నుంచి 40సంవత్సరాల మధ్య వయస్సు వారిలో వేధించే మరొక తలనొప్పి క్లస్టర్ హెడేక్. నిద్రకు ఉపక్రమించిన రెండు మూడు గంటల తరువాత తలనొప్పి ఒక వైపు కంటి ప్రక్కన మొదలై, కొన్ని నిముషాలనుంచి, కొన్ని గంటల వరకూ బాధి స్తుంది. ఎంత అకస్మాత్తుగా విజృంభిస్తుందో, అంత అక స్మా త్తుగా తగ్గిపోతుంది. ఈ విధంగా కొన్ని వారాలు ఇబ్బంది పెడుతూ, ఒక దశలో సంపూర్ణంగా తగ్గిపోయి, మళ్లీ కొన్నేళ్ల వరకూ కనిపించకుండా పోవచ్చు.
0 Comments