నడక, పరుడువంటివే కాక తెరిపిలేకుండా చేసే వ్యాయామం కూడా గుండెకు ఎంతో మంచిదని బ్రిటన్‌లోని లివర్‌పూల్ జాన్‌మూర్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు.ఇది కనిపించకుండా ఉండే రక్తనాళాలను చురుకుగా పనిచేయిస్తుందని వారు గుర్తించారు.గుండెపోటువల్ల దెబ్బతిన్న రక్త నాళాలగాయాలను మాన్పివేస్తుందని వారు జరిపిన అధ్యయనం వల్ల తేలింది.30 నిమిషాలపాటు చేసే వ్యాయామం అంటే పరుగు, సైక్లింగ్‌ల వల్ల చెమటులు పట్టి గుండెకు రక్తప్రసరణ బాగా జరిగి చురుకుగా పనిచేసేలా చేస్తుందని వారు నిర్థారించారు. సాధారణ వ్యాయామంతోగుండెకు రక్తప్రసరణ బాగా జరుగుతుందని అదే 30 నిమిషాలపాటు తెరిపిలేకుండా చేస్తే రక్తకణాల ఉత్పత్తికి దోహదం చేయనున్నదని వారు నిర్థారించారు. ఈమేరకు బ్రిటన్‌కేంద్రంగా వెలువడే హర్ట్‌జర్నల్‌లో ఒక శాస్త్రీ యమయిన రచన ప్రచురితమయ్యింది. ఈమేరకు ఎలుకల మీద ఒక అధ్యయనంజరిగింది. ఆరోగ్య కరమయిన ఎలుకల మీద ప్రయోగాలు నిర్వహించి వాటిలో వచ్చే మార్పులను రికార్డు చేశారు. గుండెకు సంబంధించిన రక్తకణాలలో 60 శాతం పెరుగుదల కనిపించింది.రెండు వారాలపాటు ఎలు కలచేత తీవ్ర స్థాయిలో వ్యాయామం చేయించగా ఏడు శాతం రక్తకణాలు పెరిగాయి.ఇవి గుండెకండ రాలు కొట్టు కోవడానికి ఉపయోగపడతాయి. జాన్‌మూర్స్ శాస్త్రవేత్తలు గుండెపోటు వచ్చిన ఎలుక లపై కూడ పరిశోధనలు నిర్వహించారు. అర్థగంటపాటు చేసే వ్యాయామం వల్ల రక్తకణాల ఉత్పత్తి పెరిగి గుండెను మరింత ఉత్తేజపరిస్తుందని మొదటి సారి తమ అధ్యయనంలో తేలిందని శాస్త్రవేత్త జాన్‌మూర్స్ వివరించారు. గుండెపోటు వల్ల గుండె దెబ్బతీన్న రోగులు రోజు అర్థగంటసేపు వ్యాయామం చేయడం కష్టమైనప్పటికీ నడక, సైక్లింగ్‌లు చేయవచ్చునని అందువల్ల గుండెకు వచ్చిన ప్రమాదమేమీ లేదని వారు వివరించారు.
0 Comments