-Deafness cause for decreased Mental Ability ,వినికిడిలోపంతో మేధోక్షీణత- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
వినికిడిలోపం వృద్ధాప్యంలో వచ్చే సాధారణ సమస్యే కావొచ్చు. కానీ దీంతో ఆలోచన, జాపకశక్తి సామర్థ్యాలూ తగ్గే అవకాశముందా? వినికిడి మామూలుగా ఉన్నవారితో పోలిస్తే వినికిడిలోపం గలవారిలో ఆలోచన సామర్థ్యం 30-40% వరకు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అరవై ఏళ్లు పైబడినవారిలో సుమారు మూడింట ఒక వంతు మంది, డెబ్బై ఏళ్లు పైబడినవారిలో మూడింట రెండొంతుల మంది వినికిడిలోపంతో బాధపడుతున్నట్టు అంచనా. అయినప్పటికీ ఇది వృద్ధాప్యంలో వచ్చే మామూలు సమస్యగానే భావిస్తూ చాలామంది చికిత్స తీసుకోవటం లేదు. వినికిడిలోపంతో ఇతరత్రా రకరకాల సమ్యలు వచ్చే అవకాశముందని గుర్తించటం అవసరం. వినికిడిలోపం గలవారికి మతిమరుపు (డిమెన్షియా) ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు గత అధ్యయనాల్లోనూ బయటపడింది. ఆలోచన, జ్ఞాపకశక్తి సామర్థ్యాలు తగ్గుతున్నట్టు తాజాగా తేలటమూ దీనినే నొక్కి చెబుతోంది. అదృష్టవశాత్తు వినికిడిలోపం గల చాలామందికి డిమెన్షియా రావటం లేదు గానీ కొంతకాలానికి ఎంతోకొంత విషయగ్రహణ లోపం ఏర్పడుతోందని అధ్యయన కర్త డాక్టర్ ఫ్రాంక్ లిన్ అంటున్నారు. తాజా అధ్యయనంలో ఈ విషయం మీదనే దృష్టి కేంద్రీకరించారు. వినికిడిలోపం గలవారిలో చాలావేగంగా మేధస్సు క్షీణిస్తున్నట్టు గుర్తించారు. వినికిడిలోపం తీవ్రత పెరుగుతున్నకొద్దీ ఆలోచన, జ్ఞాపకశక్తి మరింత వేగంగా తగ్గుతున్నట్టూ తేలటం గమనార్హం. ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేస్తుండొచ్చని లిన్ చెబుతున్నారు. మన అంతర్ చెవిలోని కాక్లియా సంక్లిష్ట శబ్దాలను విద్యుత్ సంకేతాలుగా మార్చి మెదడుకు పంపిస్తుంది. ఈ ప్రక్రియ సరిగా జరగకపోతే సంకేతాలు కూడా అస్తవ్యస్తమవుతాయి. అందువల్ల మెదడు వినటానికి, అర్థం చేసుకోవటానికి ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుందని.. ఆ ప్రయత్నంలో ఆలోచన, జ్ఞాపకశక్తి వంటి వాటిపై దృష్టి పెట్టటం తగ్గిపోతుందనేది ఒక భావన.
వినికిడి లోపంతో బాధపడేవారు నలుగురితో అంతగా కలవలేక ఒంటరిగా ఉండిపోవటం కూడా రకరకాల అనారోగ్య సమస్యలతో పాటు మేధో క్షీణతకూ దోహదం చేస్తుండొచ్చనేది మరొక సిద్ధాంతం. మెదడులోని ఏదో ఒక ప్రక్రియ వినికిడి, మెదడు పనితీరు రెండింటినీ ప్రభావితం చేస్తుండొచ్చని కూడా అనుమానిస్తున్నారు. ఏదేమైనా వినికిడిలోపంతో ఇతరత్రా సమస్యలూ పొంచి ఉంటాయన్నది మాత్రం తథ్యం. అందువల్ల దీనికి చికిత్స తీసుకోవాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు.
చాలాకాలం నుంచే..
నిజానికి వినికిడి సమస్య తీవ్రం కావటానికి 5-15 ఏళ్ల ముందు నుంచే రకరకాల ప్రభావాలు ఆరంభమవుతాయి. సాధారణంగా మన లోపలి చెవిలో సూక్ష్మమైన కేశాలు శబ్దాలకు కంపించి, మెదడుకు సంకేతాలు పంపిస్తాయి. ఒకవేళ ఈ కేశాలు దెబ్బతింటే ఆ భాగంలో ఖాళీలు ఏర్పడతాయి. దీంతో మెదడుకు సంకేతాలు సరిగా అందవు. ఫలితంగా కొన్ని స్థాయుల్లోని శబ్దాలు సరిగా వినవబడవు. ఇది దీర్ఘకాలం కొనసాగితే ఆయా స్థాయుల్లోని శబ్దాల స్పందనలను అర్థం చేసుకోవటాన్ని మెదడు మరచిపోతుంది. దెబ్బతిన్న కేశ కణాలు తిరిగి కోలువకోవటమంటూ జరగదు. పెద్ద శబ్దాలతో వాటిని ప్రేరేపించినప్పటికీ మెదడు వాటిని అర్థం చేసుకోలేకపోవచ్చు.
రకరకాల ఇబ్బందులు
వినికిడిలోపం రోజువారీ పనుల్లోనూ చిక్కులు తెచ్చిపెడుతుంది. మాట్లాడటం కష్టంగా ఉండటం వల్ల ఒత్తిడి, చికాకు, నిరాశ వంటివి తలెత్తొచ్చు. ఇతరులు తమను చూసి గేలిచేస్తారనే భయం కలగొచ్చు. త్వరగా వృద్ధులమయ్యామని, వైకల్యం వచ్చిందనే భావనలో పడేయొచ్చు. నలుగురితో కలవలేక పోవటం వల్ల ఒంటరితనం.. వినటానికి ఎక్కువగా కష్టపడటం వల్ల శారీరకంగా అలసిపోవటం వంటివీ కనబడొచ్చు. వినికిడిలోపం గలవారికే కాదు వారితో సన్నిహితంగా మెలిగేవారికీ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వినికిడిలోపాన్ని తోసేసుకు తిరగకుండా తగు చికిత్స తీసుకోవటం మంచిది. వినికిడిలోపాన్ని గుర్తించేందుకు ఇప్పుడు అధునాతన పరీక్షలూ అందుబాటులో ఉన్నాయి. దీన్ని గుర్తించి అవసరమైతే వినికిడి యంత్రాలను వాడటం వల్ల ఇబ్బందులు దరిజేరకుండా చూసుకునే అవకాశం

వుంది.
0 Comments