Full Style

>

గ్రీన్ టీ వల్ల ప్రయోజనాలు

గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది . అసలు గ్రీన్ టీ అంటే ఏంటో ముందుగా తెలుసుకోవాలి. గ్రీన్ టీ అంటే .... ఎండిపోయిన తేయాకులతో తయారు చేసేదే గ్రీన్ టీ. దీనిని కామెల్లియా సినెన్సిస్‌గా పిలుస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది . శారీరక శ్రమలేని ఆధునిక యుగ జీవితం రోగాలమయంగా వుంది. గుండె సంబంధిత వ్యాధులూ, క్యాన్సర్‌, ఉదరకోశ వ్యాధులు, మానసిక వత్తిడి, స్థూల కాయం వంటివి నేడు పలువురు యువతీ, యువకులలో కూడా సాధారణం అయ్యాయి. ఈ సమ కాలీన రుగ్మతల నివారణకు కొంత మేరకు దివ్య ఔషదమే గ్రీన్‌ టీ (తేయాకు).

గ్రీన్ టీ ఆరోగ్య ప్రయోజనాలను లెక్కించాలంటే చేతికున్న పదివేళ్లు చాలవు. మామూలు టీ కి గ్రీన్ టీకి ఒకే రకం ఆకులు. కాని తయారు చేసే ప్రక్రియలో మార్పు వుంటుంది. ఇది మనకు చైనా నుండి వస్తుంది. ఆ దేశపు సిల్కు, షుగర్ వలెనే ఇది కూడా. బరువు తగ్గాలంటే గ్రీన్ టీ మంచిదని పరిశోధనలలో తేలింది. సాధారణ టీ తో పోలిస్తే, గ్రీన్ టీ ఏ రకంగా అధిక ప్రయోజనం కలిగిస్తుందో చూద్దాం!
1. మరే ఇతర టీలలోను లేని ఇసిజిసి అనే ఒక కెమికల్ గ్రీన్ టీ లో వుంటుంది. దీనికి కారణం గ్రీన్ టీ ఆకులు మాత్రమే స్టీమింగ్ కు గురవుతాయి. ఫెర్మంటేషన్ చేసిన ఇతర టీ ఆకులలో ఈ కెమికల్ తొలిగిపోతుంది.
2. గ్రీన్ టీ తాగితే, కేన్సర్ వ్యాధి వుంటే నయమవుతుంది. లేకుంటే అది రాకుండా కాపాడుతుంది.
3, గ్రీన్ టీ చైనాలో 4000 సంవత్సరాల కిందటే కనుగొన్నారు. ఉత్తేజాన్ని కలిగించే పానీయంగా గుర్తించబడింది. దీనిలో టీ , కాఫీలలో వుండే కేఫెన్ మొత్తం కంటే తక్కువే వుంటుంది.
4, గ్రీన్ టీ ప్రధానంగా బరువు తగ్గిస్తుంది. ప్రత్యేకించి పురుషులలో బాగా తగ్గిస్తుంది. ఉదయాన్నే ఒక కప్పు గ్రీన్ టీ తీసుకుంటే ఆరోజులో తీసుకునే అధిక కేలరీలన్ని తేలికగా ఖర్చు చేయబడతాయి.
5. బ్లడ్ కొలెస్ట్రాల్ , డయాబెటీస్ లు- క్షార గుణాలుకల గ్రీన్ టీ బ్లడ్ లోని షుగర్, కొల్లెస్టరాల్ స్ధాయిలను తగ్గిస్తుంది. గ్రీన్ టీ షుగర్ లేకుండా తాగితే డయాబెటీస్ నియంత్రించవచ్చు.

కనుక ఇన్ని ప్రయోజనాలున్న గ్రీన్ టీకి వెంటనే మారటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి.




Post a Comment

0 Comments