ముఖ్యంగా మనిషి, శరీర సంరక్ష, చర్మ సంరక్షణలో ఎన్నెఎన్నోపద్దతులను వాడతుంటారు. అందులో బాగాలే వాటర్, అరోమా, ఆయిల్ థెరపిల్లాంటిది మరొకటుంది. అదేంటంటే జ్యూస్ థెరపి. దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా ఎంత ఒత్తిడినైనా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. అయితే, ప్రతినెలా మూడు రోజుల చొప్పున దీన్ని ఆచరించాలి. జ్యూస్ థెరపి శరీరంలోని కణాల్ని శుభ్రపరుస్తుంది. కణాల్లో లోపాలుంటే వాటిని సరిదిద్దుకునే శక్తినిస్తుంది. జ్యూస్ థెరపిని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనినే ‘డి టాక్స్ జ్యూస్ ఫాస్టింగ్' అని కూడా అంటారు. ఆరోగ్యకమరైన శీరానికి మరియు ప్రకాశించే చర్మానిక భరోసా పండ్లు మరియు కూరగాయలే...
ముఖ్యంగా నగరాల్లో జీవించే వారిలో చాలామందికి ఒత్తిడిలో కూడిన జీవన విధానం వల్ల సరిపడా నిద్ర ఉండదు. అలాగే జంక్‌ఫుడ్స్, నికోటిన్, కెఫిన్, ఆల్కహాల్ వాడకం వంటివి పెరిగాయి. జంక్‌ఫుడ్స్ ద్వారా విషపదార్థాలు శరీరంలోకి చేరతాయి. వీటిని బయటకు పంపేయాలి. లేదంటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే. అందుకే నెలలో మూడు రోజులపాటు జ్యూస్ థెరపీ చేయాలి. ఈ థెరపిలో మనం చేయవలసింది ఈ మూడు రోజులు ఘనాహారాన్ని తీసుకోకుండా అన్ని రకాల జ్యూస్‌లను తీసుకోవడమే. దీన్ని ప్రతి నెలా ఒక క్రమంగా ఆచరిస్తే మంచి ఫలితాలిస్తాయి.
అసలు జ్యూస్ థెరపికి ముందు ఆచరించేవారు మానసికంగా సిద్ధపడాలి. అప్పుడు ఆకలివేస్తున్న భావన మిమ్మల్ని వేధించదు. ఇది ప్రారంభించే వారం ముందునుంచి మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా చూసుకోవాలి. జంక్‌ఫుడ్స్, అధిక కాలరీలున్న ఆహారాన్ని మానేయాలి. పిండి, వేపుళ్లు, ప్రాసెస్డ్ ఫుడ్, ఆల్కహాలు, సిగరెట్లు, కాఫీ, చాక్‌లెట్లు, నొప్పి నివారణులు, మత్తుమందులు, యాంటీ బయాటిక్స్ వంటివి వాడకూడదు. మూడు రోజులు డీటాక్స్ జ్యూస్ ఫాస్టింగ్‌కు పని ఒత్తిడి ఎక్కువగా ఉండని నెలలో ప్లాన్ చేసుకోవాలి.
థెరపిలో భాగంగా రోజుకి ఐదారుసార్లు రకరకాల జ్యూస్‌లు తాగాలి. నిమ్మరసంతో మొదలుపెట్టాలి. రెండు గ్లాసుల నిమ్మరసం తాగిన తర్వాత కూరగాయల జ్యూస్ తీసుకోవాలి. తరువాత బత్తాయి రసం తాగాలి. టమాటో, కారెట్, బీట్‌రూట్ జ్యూస్‌లను మధ్యాహ్నం భోజనానికి రెండు, మూడు గంటల ముందు ఇవి తీసుకోవాలి. మధ్యాహ్నం పుచ్చకాయ, సాయంత్రం తోటకూర లేదా దోసకాయ జ్యూస్ తీసుకోవాలి. నిద్రకు ఉపక్రమించే ముందు బత్తాయి, యాపిల్, ద్రాక్షలను కలిపి జ్యూస్ చేసి తాగాలి. ఇలా మూడు రోజుల పాటు ఆచరించాలి. తర్వాత రోజుల్లో తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంతో పాటు జ్యూస్‌లు కూడా రోజుకు ఒకటి, రెండు సార్లు తాగాలి. తర్వాత అలవాటు పడ్డ ఆహారం తీసుకున్నా, శరీరంలోకి విషపదార్థాలు మాత్రం చేరకుండా జాగ్రత్తపడాలి. పౌష్టికాహారం తినడంవల్ల శక్తి ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఈ థెరపీలో ఏయే జ్యూస్‌లు ఎలాంటి ఆరోగ్యాన్ని యిస్తుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.






0 Comments