Full Style

>

డయాబెటీస్ రాకుండా చేయొచ్చా?


Prevention Diabetes Mellitis Type 2 Aid0181
టైప్ 2 డయాబెటీస్ ఆలస్యంగా వచ్చేలా లేదా నిరోధించేలా చేయవచ్చు. దీనికిగాను సరైన పోషక ఆహారం, ప్రతిరోజూ వ్యాయామం వుంటే చాలు. జీవన విధానాలు సక్రమంగా ఆచరిస్తే డయాబెటీస్ రాగల అవకాశాలను 50 శాతం తగ్గించివేయవచ్చు. వ్యాయామ ఫలితాలు, వ్యక్తి ఏ బరువులో వున్నప్పటికి ప్రభావం చూపుతాయి. ఆహారంలో పచ్చటి ఆకు కూరలు అధికంగా తినాలి. షుగర్ కలిపిన కూల్ డ్రింక్ లు ఇతర పానీయాలు తాగటం మానాలి. గ్లూకోజు తగ్గించటం, వ్యాయామాలు, మెట్ ఫార్మిన్ వంటి ప్రాధమిక ఔషదాలు డయాబెటీస్ అధికం కాకుండా చేస్తాయి. మందులు వాడే కంటే కూడా జీవన విధానాలు సరి చేసుకుంటే డయాబెటీస్ బాగా నియంత్రణలో వుంటుంది.

డయాబెటీస్ రోగులు డయాబెటీస్ నియంత్రణ కొరకు మందులు వాడటమే కాక గుండె సంబంధిత చికిత్సలు కూడా జాగ్రత్త పడాలి. డయాబెటీస్ రోగులు ఏ రోజుకారోజు రక్తంలోని వారి గ్లూకోజ్ స్ధాయిని ఇంటివద్దే తగిన గ్లూకో మీటర్ వంటి పరికరాలతో తెలుసుకోవచ్చు. దానికి తగినట్లు ఆహారాలను నియంత్రించవచ్చు. అయితే, ఇన్సులిన్ తీసుకోవలసిన రోగులకు మాత్రం టైప్ 2 డయాబెటీస్ వారు ఆచరించే ఆహార వ్యాయామాలు నియంత్రణ వంటివి ఫలితాలనీయవు.

బరువును తగ్గించే డయాబెటిక్ ఆహారాలు వీరికి అధిక ప్రయోజనం చేకూరుస్తాయి. తక్కువగా వుండే గ్లైసీమిక్ ఇండెక్స్ డైట్ షుగర్ వ్యాధిని చక్కని నియంత్రణలో వుంచుతుంది. టైప్ 2 డయాబెటీస్ వారికి కొంత సమాచారం ఇచ్చి వారి ఆహార వ్యాయామాలు చేసి షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు.

Post a Comment

0 Comments