Full Style

>

షుగర్ ను కంట్రోల్ చేసే టాప్ 10 సూపర్ ఫుడ్స్..


షుగర్ వ్యాధి రోగులు ఎపుడూ వైద్య పర్యవేక్షణలో వుండాలి. వీరు ఎల్లపుడూ తమ శరీరంలోని ఇన్సులిన్ స్ధాయిలను ఎప్పటికపుడు నియంత్రించుకోవాలి. అందుకవసరమైన ఆహారం పానీయాలు తీసుకుంటూ మిగిలిన జీవనాన్ని గడపాలి. మధుమేహానికీ, గుండెజబ్బులకూ దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఇప్పటికే వచ్చిన షుగర్‌ని నియంత్రించుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు తీసుకునే ఆహారంలో ఫ్లేవనాయిడ్‌లు అనే యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోండి'' యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకునేవారిలో కొవ్వు శాతం కూడా గణనీయంగా తగ్గుతుందట. శరీరంలోని కణాలను నాశనం చేసే ఫ్రీరాడికల్స్‌ను సమర్థంగా నిరోధించే శక్తి యాంటీ ఆక్సిడెంట్లకు ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

యాపిల్స్, బ్రోకోలి, బెర్రీలు వంటివాటిలో ఈ ఫ్లేవనాయిడ్‌లు అధికంగా ఉంటాయి. ఈ అధ్యయనం కోసం యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ యాంగ్లియా పరిశోధకులు 51ఏళ్ల 74 ఏళ్ల దాకా వయసున్న 93 మంది టైప్2 డయాబెటిస్ ఉన్న మహిళలను ఎంచుకున్నారు. వారిలో సగం మందికి రోజూ మామూలు ఆహారంతో పాటు ఫ్లేవనాయిడ్‌లు అధికంగా ఉండే రెండు చాక్లెట్‌బార్లు తినడానికి ఇచ్చేవారు. మిగతావారికి మామూలు ఆహారం మాత్రమే ఇచ్చేవారు. ఏడాది తర్వాత వారిని పరీక్షిస్తే.. ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉండే చాక్లెట్ బార్లు తిన్నవారిలో గుండెపోటు ముప్పు 3.4 శాతం మేర తగ్గింది.

అలాగే, ఇన్సులిన్ నిరోధకత, కొలెస్ట్రాల్ స్థాయులు కూడా గణనీయంగా తగ్గాయి. కాగా ఇవే పరిశోధనలు టైప్2 డయాబెటిస్‌తో బాధ పడుతున్న మగవారిపైనా చేయాల్సి ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అధ్యయన ఫలితాలు 'జర్నల్ డయాబెటిస్ కేర్'లో ప్రచురితమయ్యాయి. షుగర్ బాధితులకు ఏడాదిపాటు రోజూ రెండు చాక్లెట్లు ఇవ్వడం.. కానీ చివరికి వారిలో మధుమేహం నియంత్రణలోకి రావడం.. అంతా చిత్రంగా ఉంది కదూ. మరి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలేంటో చూద్దాం.. అన్నిరకాల నిమ్మజాతి పండ్లు, యాపిల్, స్ట్రాబెర్రీలు, దానిమ్మ, టొమాటోలు, ఉల్లిపాయలు (ఎర్రవి), తృణధాన్యాలు, గ్రీన్ టీ, ముదురు రంగులో ఉండే చాక్లెట్ (కొకోవా 70% కన్నా అధికంగా ఉండాలి).

బ్రోకోలి

విదేశీయులు బ్రొకోలీగా పిలుచుకొనే ఈ క్యాలీ ఫ్లవర్ లో పోషక తత్వాలు, విటమిన్ ఎ, యాంటి ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఉడికించిన లేదా పచ్చి క్యాలీఫ్లవర్ ను వ్యాయామానికి ముందు లేదా తర్వాత తీసుకుంటే చాలా మంచిది. మధుమేహ వ్యాధిగ్రతస్తులు కూడా దీన్ని తీసుకోవచ్చు. బ్రొకోలీలో ఉండే పోషకాలు కంటి శుక్లాల సమస్యలను దరిచేరనివ్వవు. ఫోలిక్ యాసిడ్ గర్భవతులకు మంచిది. ఇందులోని పొటాషియం రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది. కాల్షియం అస్టియోపోరాసిస్ లాంటి సమస్యలను దూరం చేస్తుంది. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటంవల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది


సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. సిట్రస్ పండ్లను (నిమ్మజాతికి చెందిన పండ్లు, ఆరెంజ్, బత్తాయి, జామ)వంటివి తీసుకోవడం వల్ల సాయంత్రంలో కలిగే ఆకలిని కంట్రోల్ చేస్తుంది. వీటిలో విటమిన్ సి, ఫ్లావోనోయిడ్స్ రక్తనాళాల పనితీరును మెరుగుపరిచి సుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది.

యాపిల్స్

రోజుకో యాపిల్ పండు లేక కమలాఫలం లేక ఉల్లిగడ్డ తింటే చాలు రక్తం గడ్డకట్టదు. అంతేకాదు భవిష్యత్తులో గుండెపోటు వచ్చే అవకాశం కూడా తక్కువే. యాపిల్ రుటిన్ అనే రసాయనం సిరలు, ధమనుల్లో రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది


స్ట్రాబెర్రీ-బెర్రీస్

స్ట్రాబెర్రీస్‌, నల్లద్రాక్ష, బ్లూబెర్రీస్‌, నేరేడు పండ్ల వంటి వాటిలో సైటో కెమికల్స్‌ ఉంటాయి. ఇవి కేన్సర్‌ నిరోధకశక్తిని కలిగి ఉంటాయి. నేరేడు పళ్ళలో విటమిన్‌ ఎ, సి ఉంటాయి. ఇవి చక్కెర వ్యాధిని నిరోధిస్తాయి. వీటిలో అరుగుదలను పెంచే గుణాలు కూడా ఉన్నాయి.


దానిమ్మ

అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ల సమాహారం దానిమ్మ. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ పని పట్టి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. ఫ్లవనోయిడ్స్ వలన కాన్సర్ వ్యాధి వచ్చే అవకాసము తగ్గుతుంది. దానిమ్మ రసములోని రసాయనాలు 'కొలెస్టరాల్ ' వల్ల జరిగే ప్రమాదాల జోరును తగ్గిస్తుంది.


టమోటో

అధిక రోగనిరోధక శక్తిగల కూరగాయ టమాటా. ఇది గుండె సంబంధిత వ్యాధులను, ఉదర, నోటి, పేగు కేన్సర్లను అరికడుతుంది. ఇందులో 'ఎ, 'ఇ విటమిన్లు ఎక్కువగా ఉండడం వల్ల కళ్లకు, చర్మానికి చాలా మంచిది. టమాటాను బ్యూటీ పార్లలో ఫేస్‌మాస్కుల్లో కూడా ఉపయోగిస్తారు.

ఉల్లిపాయలు

ఉల్లి చేసే మేలు తల్లి కుడా చేయదనే సామెత ఉన్నది. ఎర్రని ఉల్లిపాయ మధుమేహగ్రస్తులకు చాలా మంచిది. పచ్చి ఉల్లి మంచి ఊఫ్రొడయజిక్ గా పనిచేయును. ఎన్నో హార్మోన్ల గుణాలు ఉల్లి రసంలో ఉన్నాయి. టేస్తోస్తేరాన్, ఇన్సులిన్, గ్రౌత్ హార్మోన్, ఆక్షితోసిక్ వంటి లక్షణాలు ఉన్నాయి

గ్రీన్ టీ

గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. కొవ్వును కరిగించి మెటబాలిజం అధికం చేస్తుంది. రోజూ ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీ తాగితే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.



తృణధాన్యాలు

పెసలు, శనగలు, వేరు శనగ పప్పులు, అలచందలవంటివి నానపోసి మొలకలు వచ్చిన తర్వాత తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని శక్తి గుళికలు అంటారు. కడుపు నింపుతాయి. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు, విటమిన్లు సమకూరుతాయి.



డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ యాంటీ అక్సిడెంట్ ఎపికటెచిన్‌ను కలిగి ఉంటుంది. ఇది అధికంగా ఉన్న కొవ్వును కరిగించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుందన్నమాట. ఈ తాజా పరిశోధనలో కోకావా విత్తనాలలో ఉన్న రసాయనాలు కొలెస్ట్రాల్‌ను ప్రభావితం చేస్తాయని పరిశోధకులు గుర్తించారు. టైప్-2 మధుమేహం కలిగిన 12 మంది వాలంటీర్లకు 16 వారాల పాటూ పాలీఫినోల్స్ అధికంగా ఉన్న చాక్లెట్ బార్లను ఇచ్చి పరీక్షించారు. అనంతరం వారి కొలెస్ట్రాల్ స్థాయిని పరీక్షించి చూడాగా.. అది గణనీయంగా తగ్గింది.


Post a Comment

0 Comments