Full Style

>

షుగర్ ఉన్న వారు పాదాల సంరక్షణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు...


మధుమేహం కలిగిన వ్యాధి గ్రస్తులు శరీరంలో అన్ని భాగాలకు ప్రభావం ఉంటుంది. గ్లూకోమా వల్ల కంటి చూపు మందిగిస్తుంది, కిడ్నీ, లివర్ సమస్యలు ఏర్పడుతాయి. వీటితో పాటు పాదాల సమస్యలు. పాదాల సమస్యలు చూడటానికి అతి చిన్నసమస్యగా భావిస్తుంటారు చాలా మంది. అయితే డయాబెటీస్ వ్యాధి ముదిరితే రక్తంలో గ్లూకోజ్ స్ధాయి బాగా పెరుగుతుంది. ఇక ఈ దశ రక్తనాళాలను, నరాల వ్యవస్ధను దెబ్బతీస్తుంది. శరీరం రోగ నిరోధక వ్యవస్ధ బలహీనపడుతుంది. వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇన్ ఫెక్షన్ వంటివి త్వరగా తగ్గవు.

foot problems remedies diabetics
డయాబెటిక్‌ రోగులకు శరీరం నుండి రక్తంలో అధిక షుగర్‌ కారణంగా ద్రవాలు నష్టపోతుంటాయి. దానితో వారికి కాళ్ళు, మోచేతులు, పాదాలు వంటి శరీర భాగాలలో చర్మం పొడిబారుతుంది. పొడి చర్మం అప్పుడు పగులుతుంది. ఆ పగుళ్ళలోకి క్రిములు చేరతాయి. ఇన్‌ఫెక్షన్‌ కలిగి స్తాయి. కనుక చర్మ సంరక్షణ వీరికి ప్రధానం. చర్మానికి వచ్చే చిన్న సమస్యలే తీవ్రమై క్లిష్ట సమస్యలుగా వుంటాయి.డయాబెటిక్‌ ఫుట్‌, కాలిగాయాలు, వంటివి చివరకు కాలు తొలగించే స్థితికి తీసుకువస్తాయి. కనుక డయాబెటీస్‌ రోజులు చర్మాన్ని ఎప్పటికప్పుడు మంచి కండిషన్‌లో వుంచాలి. డయాబెటిక్ వున్నవారు కాళ్ళు ఆరోగ్యానికి తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు...

ఫూట్ మసాజ్: చాలా మంది మధుమేహ గ్రస్తులను ఎక్కువగా బాధించే సమస్య కాళ్ళు. ఒక్కోసారి అవి స్పర్శలేకుండుట. ఒక్కోసారి ఎటువంటి నొప్పిని కలిగి ఉండవు. కాబట్టి కాళ్ళకు రక్త ప్రసరణ బాగా అందేలే చూడాలి. అందుకు సున్నితమైనటువంటి ఫూట్ మసాజ్ చేయడం మంచిది. ఇలా వారానికి ఒక సారి చేయడం వల్ల చాలా సౌకర్యంగా ఫీలవుతారు.

తరచూ పరీక్షించుకోవడం: ప్రతిరోజూ వీరు నిద్రించే సమయంలో తమ పాదాలను పరీక్షించుకోవాలి. పాదాలు రక్తప్రసరణ సరిగా లేక తిమ్మిర్లు ఎక్కుతుంటాయి. స్పర్శ తగ్గిపోతుంది. కనుక డయాబెటీస్‌ రోగులు ఎప్పటికప్పుడు తమ చర్మ సంరక్షణకై తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వైద్య సలహాలను పాటిస్తూ వుండాలి.

స్ర్కబ్, వాష్ మరియు మాయిశ్చరైజింగ్: రక్తంలోని అధిక చక్కెర స్థాయిలు రక్త నాళాలను పాడు చేస్తాయి. అలా జరిగినప్పుడు రక్తకణాల్లోని సిరలు, రక్త ప్రసరణ జరగక రక్త స్రావం జరిగి అనారోగ్యానికి దారితీస్తుంది. దాంతో కాళ్ళకు గాయాలు అవ్వడం జరుగుతుంది. అలాగే మధుమేహగ్రస్తులకు స్వేదగ్రధులు కూడా సరిగా పనిచేయవు. దాంతో చర్మం పొడిబారీ, చర్మపగుళ్లు ఏర్పడి కాళ్ళును గాయపడేలా చేస్తుంది. కాబట్టి కాళ్ళను ఎప్పుడు శుభ్రంగా పెట్టుకొని, మాయిశ్చరైజర్ వంటివి అప్లై చేస్తుండాలి. ఫూట్ క్రీమ్ ను క్రమం తప్పకుండా రాస్తుండాలి.

పాదాలకు పూర్తి రక్షణ కవచం ఏర్పరచుకోండి : మధుమేహగ్రస్తులకు రక్తంలోని చక్కెర స్థాయిలు అధికంగా ఉండటం చేత కాళ్ళు ఏర్పడిన గాయాలు నయం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి పాదాలకు పూర్తి రక్షణ కవచం ఎల్లప్పుడు తొడిగి ఉండాలి. మెత్తని సాక్సులు, షూలను తొడిగి ఉండటం వల్ల కాళ్ళకు ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకకుండా కాళ్ళను కాపాడుతుంది.

కాళ్ళ గోళ్ళను శుభ్రం చేసుకోవడం-కట్ చేయడం: డయాబెటిక్ పేషంట్స్ ఎక్కువగా పాదాల ఇన్ఫెక్షన్ కు గురవుతుంటాయి కాబట్టి కాలి గోళ్ళను ఎప్పుడూ శుభ్రం చేసుకోవాలి. అలాగే వారానికి ఒకసారి కాళి వేళ్ల గోళ్ళను కట్ చేస్తుండాలి.

Post a Comment

0 Comments