ప్లాస్టిక్ వాడటం వల్ల మన ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం ....
చాయ్ తాగాల్సి వచ్చినప్పుడు ప్లాస్టిక్ గ్లాసులను ఉపయోగించడం ఇటీవల బాగా పెరిగింది. అలాగే విందువినోదాల్లోనూ మంచినీళ్ల కోసం ప్లాస్టిక్ ఉపయోగిస్తున్నాం. అంతేకాదు.. బాక్స్‌లో పెట్టుకొని వచ్చే ఆహారాన్నీ ఆ కంటెయినర్లలో పెట్టుకుని వస్తున్నాం. దాంతో ఇటీవల వాటి ఉపయోగం బాగా పెరిగింది. దాన్ని మనం రోజూ తింటున్నామా? ఒక మాటలో చెప్పాలంటే అవుననే అనాలి. మనం తీసుకునే ఆహారాల్లో చాలావరకు
ప్లాస్టిక్ ప్యాక్స్‌లోనే లభ్యమవుతాయి. మన ఆహారం రోజూ దాన్నే తాకి ఉండటం వల్ల అది హానికరంగా మారుతోంది. మనకు దాని వల్ల జరిగే హానిని గుర్తించి ఆహారాన్ని నిల్వ చేయడానికి దాన్ని వీలైనంత దూరంగా ఉంచటం మంచిదని గుర్తించాలి.
మనలో చాలామంది ఇప్పుడు ఆహారాన్ని నిల్వ చేయడానికి ప్లాస్టిక్ ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ కంటైనర్ ఉంచి, మనం తిన్నప్పుడు అది కొద్దికొద్దిగా ఆహారంతో పాటు కలిసి మన శరీరంలోకి వెళ్తుంది. అలా ఆహారంతో పాటు ప్లాస్టిక్ శరీరంలోకి వెళ్లే ప్రక్రియను లీచింగ్ అంటారు.
ఆహారం వేడిగా ఉన్నప్పుడు అది కడుపులోకి వెళ్లే పాళ్లు మరింతగా పెరుగుతాయి. అంటే లీచింగ్ ఎక్కువగా ఉంటుందన్నమాట.
ఆహారంలో కొవ్వులు, ఉప్పు ఉన్నప్పుడు లీచింగ్ మరింత పెరుగుతుంది.
ప్లాస్టిక్ అంటే...
ప్లాస్టిక్ కంటెయినర్లు ప్రధానంగా బైస్ఫినాల్ ఏ (బీపీఏ) అనే పదార్థంతో తయారు చేస్తారు.
బీపీఏలతో ఆరోగ్యంపై పడే దుష్ర్పభావం:
ప్లాస్టిక్ బాక్స్‌లలో ఉంచే ఆహారం వల్ల ఆరోగ్యంపై అనేక దుష్ర్పభావాలు పడతాయి.
వాటిలో కొన్ని...
ప్లాస్టిక్ కలిసిన ఆహారం వల్ల హార్మోన్లపై... మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్ స్రావంపై దీని ప్రభావం ఉంటుంది. దీని వల్ల ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యంతో తేడాలు వచ్చి గర్భధారణ సమస్యలు రావచ్చు మూత్రంలో ప్లాస్టిక్ పాళ్లు పెరిగినట్లుగా రిపోర్టులు వచ్చిన చాలామందిలో డయాబెటిస్ వస్తున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది ప్లాస్టిక్ కంటెయినర్లలో ఆహారం తీసుకునేవారిలో స్థూలకాయం పెరుగుతుంది రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ రిస్క్‌లు కూడా ఎక్కువే ప్లాస్టిక్ కంటెయినర్లలో వేడి వేడి ఆహారం పెట్టుకుని తీసుకునేవారిలో జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు, మూడ్స్ మారిపోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు.
ఎక్కడెక్కడ ఉపయోగం...
సాధారణంగా పిల్లలకు ఉపయోగించే పాలపీకలు వాటర్‌బాటిళ్లు లంచ్‌బాక్స్‌లు, సీడీలు, డీవీడీలు, కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు
ఫ్తాతలేట్స్...
ఆహారంలో కలిసేందుకు అవకాశం ఉన్న మరో ప్లాస్టిక్ ఉపకరణాలే ఫ్తాతలేట్స్. ప్లాస్టిక్‌ను ఎటుపడితే అటు ఒంచేందుకు (ఫ్లెక్సిబిలిటీ కోసం) ఉపయోగించే పీవీసీ... ఆహారంలో కలిసి దుష్ర్పభావాలను చూపుతాయి.
ఆరోగ్యంపై ఫ్తాతలేట్స్ వల్ల కలిగే దుష్ర్పభావాలు:
బీపీఏ లాగే ఫ్తాతలేట్స్ టెస్టోస్టెరాన్ వంటి పురుష సెక్స్ హార్మోన్‌పై దుష్ర్పభావం చూపుతాయి. వీటి వల్ల పురుషుల్లో వీర్యం క్వాలిటీ దెబ్బతింటుంది ప్లాస్టిక్‌తో కలిసిన ఆహారం వల్ల అలర్జీలు, ఆస్తమా, పిల్లికూతలు రావచ్చు.
ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు...
ఆహారాన్ని ప్యాక్ చేసేందుకు ఉపయోగించే బాక్స్‌ల కోసం, సీసాల తయారీలో ఉపయోగిస్తారు తోలులా కనిపించే కొన్ని రకాల దుస్తుల తయారీలో వాటర్‌ప్రూఫ్ కోట్లు, జాకెట్స్ వంటి దుస్తుల తయారీలో విద్యుత్ వైర్లపై ఉండే ఇన్సులేటింగ్ పదార్థాలలో ఎలక్ట్రానిక్ వస్తువుల్లో, వినైల్ ఫ్లోరింగ్స్‌లో వాటర్‌బెడ్స్, పిల్లల ఆటవస్తువుల్లో నీళ్ల పైపుల తయారీలో
ప్లాస్టిక్‌తో జరిగే హానిని గుర్తించి మన జీవనశైలిలో దాన్ని వీలైనంత తగ్గించాలని గుర్తుంచుకోండి
ప్లాస్టిక్ భూతం నుంచి విముక్తి ఎలా...
ప్లాస్టిక్ వస్తువుల తయారీలో అది బీపీఏ ఫ్రీ అని రాసి ఉన్న వాటిని మాత్రమే వాడాలి ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించాల్సి వస్తే... వాటిపై ‘మైక్రోవేవ్ సేఫ్’ అని రాసి ఉన్నవే వాడాలి. అలాంటివి మైక్రోవేవ్‌పై పెట్టినా కరగవు కఠినమైన డిటర్జెంట్స్ ఎక్కువగా ఉండే డిష్‌వాషర్స్‌లో ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువసేపు ఉంచకూడదు పిల్లల పాలకోసం గ్లాస్‌తో చేసిన పాల సీసాలు ఉపయోగించాలి. ప్లాస్టిక్ సీసాలు ఉపయోగించేప్పుడు వాటిలో వేడి వేడి పాలు పోయకూడదు ఆహారాన్ని ఉంచడం కోసం ప్లాస్టిక్ డబ్బాల కంటే స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు మంచిది సాగి ఉన్న ఆహారపు డబ్బాలను ఏమాత్రం ఉపయోగించకూడదు.
0 Comments