సిగ్గు మొగ్గల లేత బుగ్గలు
క్కనమ్మ చిక్కినా అందమే అంటారు
భావుకులు. నిజానికి అది వాస్తవమే. ఎందుకంటే, అందం అనేది ముందుగా
ప్రస్పుటించేది ముఖంలోనే. శరీరం చిక్కి తీగలా అయినా ముఖంలో ఉండవలసిన కళ
కాంతులీనుతూ ఉంటే అందానికి ఢోకా ఉండ దు. కానీ, ముఖం మీద మొటిమలు పొడ చూపి,
లేత వయసులో బుగ్గలు కాయలు కాసినట్టు కనబడితే, యువతులు ఎంతో బెంబేలు పడతారు.
ఇక వాటిని గిల్లడం, గోకడంలాంటి పనులు చేసే స్తూవుంటారు. కోతిపుండు
బ్రహ్మరాక్షస యినట్టు ఆ లేత బుగ్గలు సెప్టిక అయ్యి గుంటలుగా, ఉబ్బెతు ్తగా
వికారంగా మారుతుంది. కాబట్టి సొంత ప్రయోగాలు మాని, చిన్నచిన్న చిట్కాలతో
వీటిని అరికట్టుకుంటే, ఏ గొడవావుండదు. అసలు ఈ మొటిమలు అనేవి అందరికీ ఒక
వయసులో తప్పనిసరిగా వస్తూనే ఉంటాయి. అందుకే చిట్కాల చిట్టాలు ఎలా వున్నాయో
చూద్దాం.
- పుదీనా రసం ప్రతిరోజూ రాత్రిపూట పడుకునే ముందు
రాసుకుని ఉదయాన్నే కడ ిగేసుకుంటూవుంటే మొటిమల బాధ తగ్గు తుంది. తేనె,
ఉల్లిరసం బాగా కలిపి బుగ్గలకి రాసుకుని ఒక గంట ఆరనిచ్చి సున్నిపిండితో ముఖం
కడుగుకుంటూవుంటే మొటిమలు, వాటివల్ల వచ్చే నల్ల మచ్చలు పోతాయి.
- బచ్చలి ఆకులు, గులాబీ రేకులు కలిపి బాగానూరి, ఆ రసాన్ని రాసుకుని పూర్తిగా
గంట ఆరిన తరువాత చల్లటి నీటితో ముఖం కడుగుకుంటే, మొటిమలు మొరాయించవు.
- అలాగే కొద్దిగా పెరుగులో శెనగపిండి కలి పి బాగా పేస్టులా చేసుకుని
ముఖానికి రాసు కోవాలి. ఒక గంట ఆరిన తరువాత గోరు వెచ్చటి నీటితో
కడిగేసుకుంటే, మొటిమలు పోయి, ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది.
- జాజికాయ సానమీద గంధంలా అరగదీసి మొటిమలకి రాసుకుంటే దివౌషధంలా పనిచేస్తుంది.
మొటిమల్ని తగ్గించి, మొటిమల వల్ల కలిగే దురదని అరికడుతుంది.
- ముల్తానీ మిట్టి, గరిక రసం, పుదీనా రసం, పసుపు కలిపి పేస్టులా
తయారుచేసుకుని, ముఖానికి రాసుకోవాలి. అ తరువాత 20 నిముషాలు ఆరనిచ్చి చల్లని
నీటితో శుభ్రంగా కడిగేసుకుంటే నల్లమచ్చలు, మొటిమటు మాయమవుతాయి. ఒకవేళ
వీటివల్ల బాగా నల్లమచ్చలు కనుక ఏర్పడివుంటే, 1 కేజీ మినపపðలో 7-8 చెంచాల
దోసకాయ రసం కలిపి బాగా ఎండబెట్టాలి. ఆ తర్వాత మెత్తగా గ్రైండు చేసుకుని ఆ
పొడిలో 100 గ్రా్ప్ప ముల్తానీ మిట్టీ, 100 గ్రా్ప్పలు గులాబీ రేఖల పొడి,
100 గ్రా్ప్పల చందనం కలిపి ఈ పొడిని డబ్బాలో నిల్వవుంచుకుని, ప్రతిరోజూ
రోజ్‌వాటర్‌లో ఈ పొడి బాగా కలుపుకుని ముఖానికి పట్టిస్తూ కొంతకాలం ఈ
చిట్కాపాటిస్తూ వుంటే నల్లమచ్చలు పూర్తిగా మాని ముఖం ప్రకాశవంతం అవుతుంది.
- ఎర్రని వేసచిగుర్లు బాగా నలిచి ఆ రసంలో, కొద్దిగా నిమ్మరసం కలిపి, అరగదీసిన గంధంతో పాటు రాసుకుంటే, పుళ్ళుగామా రిన మొటి మలు తగు ్గముఖం పడతాయి. చెంచాడు తేలేలో, ఖీరాదోసకాయ రసం కొద్దిగా, పసుపు, గులాబీ రేకుల రసం కలిపి
మొటిమలు న్న భాగంలో రాసుకోవాలి. అది ఆరిన తర్వాత రెండోపూతగా తిరిగి మళ్ళీ
రాయాలి. ఆ తరువాత 15 నిముషాలు ఆరనిచ్చి చల్లని నీటితో కడిగితే మొటిమలుపోయి
బుగ్గలు నునుపు దేలి అందంగా ఉంటాయి.
- ఖీరా దోసకాయని గుండ్రని
ముక్కలగా తరిగి ఆ రసం మొత్తం వినియోగం అయ్యేలా బుగ్గలమీద మసాజ్ చేసి, 15
నిముషాలు ఆర నివ్వాలి. ఆ తరువాత రోజ్‌వాటర్ తో ముందు కడిగి అదికూడా కొది
్దగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి తే మొటిమలు ఇంక మన జోలికి రావు.
- ఇక కూరగాయల్తో కూడా మొటిమలు అరికట్టవచ్చు. బీరకాయ రసం చెంచాడు తీసి,
అందులో అరచెంచాడు నిమ్మరసం కలిపి, మొటిమలున్న భాగంలో పట్టిస్తే తొందరగా
ఉపశమిస్తాయి.
- రెండు చెంచాల పెరుగులో, సున్నిపిండి పేస్టులా
కలిపి అందులో అరచెంచాడు నిమ్మ రసం, రెండు చుక్కలు తేనే వేసి ఆ మిశ్రమా న్ని
మొటిమలున్న బుగ్గలకి పట్టించి ఒక గంట తరువాత కడిగేసుకుంటే మొటిమలు
తగ్గిపోతాయి. అంతే కాక ఒకవేళ సెప్టిక దశ లో ఉన్నా దురద, మంట తగ్గించి,
నివారి స్తుంది. పాలమీగడ చెంచాడు తీసుకుని, అందులో శెనగపిండి చిటికెడు
రంగరించి, రోజ్‌వాటర్ అరచెంచాడు వేసి ముఖానికి రాసుకుంటే బుగ్గల నిగారింపు
పెరుగు తుంది. మొటిమలు తగ్గి, తిరిగి రాకుండా చేస్తుంది.
0 Comments