ముఖం పై మొటిమలు, మచ్చలు తొలగి మృదువుగా, తాజాగా ఉంచే చిట్కాలు
గుడ్డులోని తెల్లసొన తీసుకుని దీనికి నిమ్మరసం కలిపి ముఖానికి మర్దనా చేసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది.
కొంచెం తేనె తీసుకుని అందులో అరటిపండు మెత్తగా గుజ్జులా చేసి కలపాలి. దీనిని ముఖానికి రాసుకుంటే ముఖంపై ముడతలు తొలగిపోతాయి.
కొత్తిమీర రసం, ఆలుగడ్డ రసం తీసుకుని వాటికి రెండు చుక్కలు నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. ఇలా చేస్తే మొటిమల వలన ఏర్పడిన మచ్చలు తగ్గుతాయి.
జిడ్డు చర్మం కలవారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా టమాట రసం రాసుకుంటుంటే మొటిమలతో ఏర్పడిన గుంటలు పోతాయి.
మొటిమలు
వేదిస్తుంటే ఒక పది నిమ్మ ఆకులు తీసుకుని మెత్తగా పేస్టు చేసుకుని, అందులో
చిటికెడు పసుపు కలిపి రాసుకోవాలి. ఇలా ఒక వారం రోజుల పాటు చేస్తే ఫలితం
ఉంటుంది.
0 Comments