Full Style

>

గుడ్డు..శిరోజాలకు..వెరీగుడ్డు...

 

Hair Care Through Egg Beautiful Lustrous Hair Aid0069
ఏకాలంలోనైనా శిరోజాలకు సంబంధించిన రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి, నిర్లక్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు. ఇక మనం తీసుకునే ఆహారంలో లోపాలు కూడా జుట్టుపై ప్రభావం చూపుతుంది. ప్రతిరోజూ మంచి పోషకాహారం తీసుకోవాలి. పాలు, గుడ్లు, మొలకెత్తిన విత్తనాలు, సోయాజాతి విత్తనాలు, డ్రైప్రూట్స్‌ వంటివి ఎక్కువగా తీసుకుంటే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా గుడ్డు తీసుకోవడం వల్ల, గుడ్డును వినియోగించడం వల్ల ఇటు శరీరానికే కాదు జుట్టుకు కూడా బాగా పనిచేస్తుంది. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే...
1. హెన్నాలో కోడి గుడ్డు సొన కలిపి తలకి పట్టించి బాగా ఆరని చ్చాక గోరు వెచ్చని నీటితో స్నానం చేయం డి... జుట్టు నిగనిగలాడు తుంటుంది. జుట్టు చిట్లదు.
2. అరటిపండు గుజ్జు, కప్పు పెరుగు, విటమిన్ ఇ క్యాప్సూల్ లోని పదార్థం అన్నీ కలిపి తలకు పట్టించి పదిహేను నిమిషాలయ్యాక తలస్నానం చేయాలి. ఇది చక్కటి కండీషనర్ గా పనిచేస్తుంది.
3. అలాగే ఓ రెండు గుడ్లలోని సొనని ఓ కప్‌లోకి తీసుకుని బాగా గిలకొట్టి దాన్ని తలకు పట్టించి ఆరాక గోరు వెచ్చని నీటితో కడిగేస్తే జుట్టు నల్లబడటం ప్రారంభిస్తుంది. పొడువాటి వెంట్రుకల చిగుళ్లు చిట్లిపోకుండా ఉంటుంది.
4. కొబ్బరి నూనెలో గుడ్డు సొనను కలిపి, తెల్లటి పేస్టులా తయారుచేసి, అందులో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి, మరోసారి కలిపి కుదుళ్ళకు పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలకపోగా పట్టుకుచ్చులా తయారౌతుంది.
5. తల స్నానం చేసేముందు కుదిరితే కోడి గుడ్డు లో నిమ్మకాయరసం, కొంచం పెరుగు కలిపి పెట్టుకోండి, కోడి గుడ్డు జుట్టి కి మంచి కండీషనర్ లాగా పనిచేస్తుంది.(కోడి గుడ్డు లోని పచ్చ సొన లేకుండా పెట్టుకోవాలి.)
6. అరటిపండు గుజ్జు పావుకప్పు, రెండు చెంచాల చొప్పున తేనె, నిమ్మరసం, కలిపి గంటపాటు పక్కన పెట్టి తర్వాత కురులకు పట్టించి ఆరిన తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య నియంత్రణలో ఉంటుంది.
7. నాలుగు చెంచాల ఆలివ్ నూనెకు గుడ్డులోని తెల్లసొన కలిపి బాగా గిలకొట్టి మాడుకు మర్దన చేసి అలానే తకు ఒక వస్త్రాన్ని చుట్టుకుని పదినిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది. పదిహేను రోజులకోసారి ఇలా చేస్తే శిరోజాలు పట్టుకుచ్చులా జాలువారిపోతాయి.
8. గుడ్డు తెల్లసొన లేదా మజ్జికతో కలిపి రుబ్బిన కరివేపాకు లేదా మెంతి ఆకు పేస్టుల్ని తలకు ప్యాక్‌గా వేసుకోవాలి.

Post a Comment

0 Comments