ఆరోగ్యానికి ‘బి విటమిన్లు చేసే మేలు
గురించి అందరికీ తెలిసిందే అయితే మరోసారి ఈ ‘బి విటమిన్లలోని ఫోలేట్, బి6
ఉన్న ఆహారాన్ని తీసుకుంటే పక్షవాతం, గుండెజబ్బుల వల్ల కలిగే మరణాల ముప్పు
తగ్గుతుందని జపాన్ పరిశోధ కుల అధ్యయనంలో తేలింది.
జపాన్ కొలాబరేటివ్ కోహార్ట్ స్టడీలో
భాగంగా 40-79 ఏళ్ళ మధ్యగల 23, 119 మంది పురుషులు, 35, 611 మంది మహిళల మీద
అధ్యయనం చేశారు. వారి ఆహార అలవాట్లను నమోదు చేసుకుని, 14 సంవత్సరాల పాటు
గమనించారు.
అనంతరం
చనిపోయిన వారి వివరాలను సునిశితంగా పరిశీలించారు. వీరిలో ఫోలేట్, బి6
ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్న పురుషుల్లో గుండె వైఫల్యం కారణంగా వచ్చే
మరణాలు తక్కువ సంఖ్యలో నమోదైనట్టు గుర్తించారు. అదే మహిళల్లో
గుండెజబ్బులు, పక్షవాతం వల్ల కలిగే మరణాలు తక్కువగా ఉన్నాయి.
0 Comments