Full Style

>

పీచులో ఉందిలే మజా


పీచు చేసే మేలు ఈనాటి ఫాస్ట్ తరానికి తెలీదు. వృద్ధాప్య తరానికి తెలుస్తుంది. ఉదయానే్న మోషన్ అవక వాళ్లెంత ఇబ్బంది పడ్తారో… అసలు పీచు పదార్థం తీసుకొన్నవాళ్ళకు ఆహారం జీర్ణమవడమేకాదు చర్మానికి కాంతి కూడా వస్తుంది.

* నూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు, కెంటకీ చికెన్లు… వీటిలో పీచుపదార్థం ఏదీ ఉండదు. నోటికి టేస్ట్… ప్రేవులకు రెస్ట్. ఉదయానే్న మలబద్దకం.. పీచు ఎక్కువ తింటే జీర్ణశక్తిలో ఎలాంటి లోపాలు కలుగవు. ప్యాకేజ్ ఆహారాన్ని పక్కన బెట్టండి. ఇవి ఫైబర్‌ని నాశనం చేస్తాయి.

* పూర్వం బీరకాయ కూర చేసేటప్పుడు, బీరకాయ తొక్కు వృథా పోనిచ్చేవారు కారు. తొక్కు పచ్చడి ఉండేది… కేలరీలకు కేలరీలు. ఫైబర్‌కి ఫైబర్.

* పీచు పదార్థములు తినడం కష్టం కాదు. అదో అలవాటుగా చేసుకోవాలి. వినడానికి, చూడటానికి ఎబ్బెట్టుగా ఉన్నా ఆచరించి తీరాల్సిన నిజాలవి. వేరుశెనక్కాయలు తింటున్నారనుకోండి.. తొక్కలు పారేస్తారు కదా! నాల్గైదు కాయలు గింజలతో సహా నమిలి మింగండి. ఏ కూరగాయకూ తొక్కును సాధారణంగా తీయకండి.

ముడిబియ్యం ఎక్కువ వాడండి
మైదా పిండికంటె చపాతీ పిండి, మొక్కజొన్న పిండి, జొన్నపిండిని బాగా వాడండి.
రాగి అన్నం, జొన్న అన్నం, ఇలా వెరైటీ ట్రై చెయ్యండి. ముదురు కూరగాయలు తినడం అలవాటు చేసుకోండి.

*బీన్స్, బక్రా, పొట్టు ధాన్యాలు, ఓట్స్, ధాన్యంతో తయారయిన బ్రెడ్ వీటిల్లో పీచు అధికమోతాదులోనే ఉంటుంది.

*రోజూ పీచు 25 గాములు తప్పనసరిగా తినాలి. అప్పుడే మనకు జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు రావు. ఈ పీచు పదార్థం మనం తీసుకోకపోతే అనారోగ్యం పలుకరిస్తుంది.

* 35 గ్రాముల పీచు తింటే… మీకు కోవాన్‌క్యాన్సర్ 40 శాతం తగ్గినట్టే అంటున్నారు పీచు నిపుణులు.

Post a Comment

0 Comments