ప్రత్యామ్నాయ చికిత్స లేదా వైద్యం అంటే...
ఈనాడు ప్రపంచవ్యాప్తంగా వాడుకలో వున్న పాశ్చాత్య వైద్యానికి భిన్నంగా పాతతరహా సంప్రదాయబద్ధమైన చికిత్సా పద్ధతుల సముదాయామే ప్రత్యామ్నాయ వైద్యం(ఆల్టర్నేటివ్ మెడిసిన్). వీటికి కొత్త కొత్త పద్ధతులు కూడా తోడవుతున్నాయి. 1973లో రోమ్ విశ్వవిద్యాలయం వైద్య విభాగం వారు మొట్ట మొదటి ప్రపంచ ప్రత్యామ్నాయ వైద్య సదస్సును ( వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్) నిర్వహించింది. సదస్సు తాత్కాలిక కార్యక్రమంలో 135 పైచిలుకు చికిత్సా విధానాలను క్రోడీకరించారు. అన్నికాలాల్లో ప్రతి దేశంలో ఓ వైద్య శాస్త్రం , చికిత్సా పద్ధతులు ఉన్నాయి. ఈనాటికీ ప్రపంచ వ్యాప్తం గా 100కుపైగా ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ఆచరణలో వున్నాయి. ఈ వారం లాఫింగ్ థెరపీ గురించి తెలుసుకుందాం.
నవ్వు ఆరోగ్యానికి ఆయువుపట్టు
నవ్వు
నాలుగిందాల చేటు అనే నానుడి ఏ నేపథ్యంలో పుట్టిం దో తెలియదు కానీ ఆధునిక
కాలంలో మాత్రం నవ్వు వెయ్యి రకాలుగా మేలు అనే చెప్పుకోవాలి. నిత్యం
ఒత్తిడితో సతమతమయ్యే ప్రజలకు నవ్వు ఒక వరమైపోయింది. ఒత్తిడిని పారద్రోలి,
మనసునే కాదు పరిసరాల ను కూడా ఆహ్లాదపరిచే నవ్వు మనం వ్యాధుల బారిన పడకుండా
కాపాడుతుందంటే ఆశ్చర్యం కలగక మానదు. అందుకే నేడు హాస్యం లేక నవ్వును ఒక
చికిత్సగా సిఫార్సు చేస్తున్నారు.హాస్య రసం, నవ్వు ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధాలని, మానసిక ఒత్తిడికి శక్తిమంతమైన విరుగుడని పలు అధ్యయనాలలో రుజువ యింది. 1964లో మొట్టమొదటిసారి నార్మన్ క్విజిన్స్ నవ్వును ఒక చికిత్సగా ప్రయోగించి చూశాడు. సానుకూల ఆలోచన, నవ్వు ప్రయోగించి అందరూ నయం కాదని భావిం చే కీళ్ళనొప్పుల వ్యాధిని నయం చేశారు. హాస్య చిత్రాలను చూడడం, విటమిన్ సి వాడ డం అతడు ప్రయోగించిన పద్ధతిలో ప్రధాన అంశాలుగా వున్నాయి. 30 నిముషాలు హాస్య చిత్రాలు చూస్తే 2 గంటల పాటు నొప్పిలేని నిద్ర వస్తుందని అతడు కనుగొన్నాడు. ఆరు నెలల తరువాత క్విజిన్స్ వ్యాధి పూర్తిగా నయమైపోయింది.
1995లో డా.మదన్ కటారియా ఇండియాలో మొట్టమొదటి లాఫ్టర్ క్లబ్ ప్రారంభించాడు. ��లాఫ్టర్ యోగా� అన్న కొత్త దృక్పథం ఎలాటి కారణం లేకుండా నవ్వ డం పెంపొందిస్తుంది. ఫలితంగా విశ్రాంతి లభిస్తుంది ఉద్రిక్తతల నుంచి, భయాల నుంచి తప్పించుకుంటారు. జీవితం పట్ల సానుకూల వైఖరి అనుసరి స్తారు. ఆవిర్భవించినప్పటి నుంచీ ఈ విధా నం ెపెద్దెత్తున విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 1,000పై చిలుకు లాఫింగ్ క్లబ్బులున్నాయి.
లాఫ్టర్ థెరెపీ వల్ల లాభాలుః: కండరాలు విశ్రాంతి పొందుతాయి, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. నవ్వు కండరాలకు విశ్రాంతినిచ్చే సాధనంగా పరిగణిస్తారు. నవ్వుతో రక్తవాహికలు వెడల్పవుతాయి. శరీరమంతా రక్తం బాగా ప్రసరిస్తుంది. మానసిక ఒత్తిడి కలిగించే హార్మోన్ల స్థాయిని నవ్వు తగ్గిస్తుంది.
రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం: మనం నవ్వినపుడు అంటువ్యాధులను నిర్మూలించే �టి� కణాలు మరింత చురుకుగా పని చేస్తా యి. ఎ,బి,ఇమ్యునోబ్లోబిన్స్‌ను కూడా నవ్వు వృద్ధిచేస్తుంది. ఇది గణనీయమైంది. ఎందు చేతనంటే ఇమ్యునోగ్లోబిన్ ఎ, వైరస్, బాక్టీరియా నుంచి శ్వాస కోశాన్ని కాపాడుతుంది. పనిచేయ కుండా పోయిన కణాలను ఎదుర్కోవడానికి యాంటీ బాడీస్‌కు ఇమ్యునోగ్లోబిన్ బలాన్నిస్తుంది.
ప్రాణవాయువును పెంచుతుంది: ఒక వ్యక్తి నవ్వినపుడు ఎక్కువగా ప్రాణవాయువును పీల్చుకుంటాడు. ఫలితంగా తాజాదనాన్ని అనుభవిస్తారు.
శక్తిమంతమైన నొప్పినివారిణి: సహజంగా నొప్పిని తగ్గించే ఎండార్ఫిన్స్‌ను నవ్వు పెంచుతుంది. ఆర్ధ్‌రైటిస్, స్పాండులైటిస్, కండరాలకు సంబంధిన నొప్పులు మైగ్రేన్, ఉద్రిక్తతకు సంబంధించిన తలనొప్పులను తగ్గించడానికి ఎండోర్ఫిన్స్ ఎంతగానో తోడ్పడతాయి.
zఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగవుతుంది: బ్రాంకైటిస్, ఉబ్బసం వున్నవారికి నవ్వు ఎంతగానో సహాయపడుతుంది. నవ్వు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది, రక్తంలో ప్రాణవాయువు స్థాయిని పెంచు తుంది. కానీ ఈ రోగులు నవ్వు చికిత్స ప్రారంభించే ముందు వారి డాక్టరును సంప్రదించాలి. నవ్వు మానసిక ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లను తగ్గించి రక్తపోటు ను అదుపులో ఉంచుతుంది. పదినిమిషాల పాటు నవ్వు చికిత్స చేస్తే అధిక రక్తపోటు తగ్గుతుందని ప్రయోగాలు రుజువు చేశాయి. నవ్వు వల్ల ప్రాణవాయువు ప్రసారం, రక్త ప్రసారం మెరుగుపడతాయి కనుక హృద్రోగం పెరక్కుండా కూడా నవ్వు నియంత్రిస్తుంది.
ఎయిరోబిక్ ఎక్సర్‌సైజ్‌లా పని చేస్తుంది: ఒక్క నిమిషం హృదయపూర్వకంగా నవ్వితే చాలు పది నిమిషాల పాటు వ్యాయామం చేసిన ఫలితం. నవ్వు ఎయిరోబిక్ వ్యాయామాల వలె గుండె, రక్త సరఫరా వ్యవస్థను ఉద్దీపన చేస్తుంది. భౌతిక శ్రమ లేని ఉద్యోగాలు చేసే వారికి నవ్వు ఒక మంచి వ్యాయామం.
మానసిక సమస్యల నుంచి బయటపడేందుకు: డిప్రెషన్, ఆందోళన, నర్వస్ బ్రేక్ డౌన్, నిద్రలేమి తదితర మానసిక సమస్యలు ఎదుర్కొనే వారికి లాఫ్టర్ థెరపీ లబ్ది చేకూర్చినట్టు అనేక అధ్యయనాల్లో రుజువైంది.
నిత్య యవ్వన రహస్యం: మన ముఖ కండరాలను టోన్ చేయడంలో, ముఖ కవళికలను మెరుగుపరచడంలో నవ్వు కీలక పాత్ర పోషిస్తుంది. మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు మన ముఖం ఎర్రబడుతుంది. దీనికి కారణం రక్త సరఫరా వేగవంతం కావడమే. అలా వేగవంతం కావడం వల్ల మన ముఖ చర్మానికి పోషణ లభించి అది మెరుస్తుంటుంది.
నవ్వు వల్ల కేవలం భౌతిక, మానసిక లాభాలే కాదు సామాజిక లాభాలు కూడా ఉన్నాయి. నవ్వుతూ ఉండేవారు పటిష్ఠమైన సంబంధాలను కలిగి ఉండగలరు. ఇతరులను చాలా తేలికగా అకర్షించి టీం వర్క్‌ను సునాయాసంగా నిర్వహించగలరు. నవ్వుతూ ఉండటం వల్ల ఘర్షణను తగ్గిస్తుంది, ఇతరులతో సంబంధాలు పెంచుతుంది.
నవ్వుతూ ఉండటం ఎలా?
నవ్వు
ముందు చిరునవ్వుతోనే ప్రారంభమవుతుంది. చిరునవ్వులాగే అది కూడా
వ్యాపిస్తుంది. ఎటువంటి హాస్యభరితమైన సన్నివేశం అనుభవంలోకి రాకుండా కూడా
నవ్వడం సాధ్యమేనని లాఫింగ్ థెరపీ ఆద్యులు అంటారు. చిరునవ్వు విషయంలో కూడా
అది వర్తిస్తుంది. కాస్త ఆహ్లాదంగా అనిపించినదేనని చూసినా, అనుభవించినా
చిరునవ్వు నవ్వడం ప్రాక్టీస్ చేయాలి. జీవితంలో మంచి విషయాలు గుర్తు చేసుకోవాలి: పదే పదే జీవితంలో జరిగిన ప్రతికూల అంశాలను గుర్తు చేసుకోవడం అనేది నవ్వుకోవడానికి కూడా అడ్డు పడుతుంది. మనం ఎప్పుడైనా విచారంగా ఉన్నా హాస్యం పుట్టించేవాటికోసం అన్వేషించడం ద్వారా వాటి నుంచి బయటపడవచ్చు.
నవ్వును ఆస్వాదించండి: హాస్యం అన్న పదం వైపే ప్రయాణించే యత్నం చేయాలి. ఎవరైనా నవ్వుతుంటే ఏమిటో కనుక్కొని దానిని మీరూ ఆస్వాదించవచ్చు.
ఆహ్లాదంగా, సరదాగా ఉండే వారితో సమయం గడపండి: సరదాగా ఉండేవారు తమను చూసి, జీవితాన్ని చూసి కూడా నవ్వుకోగల సామర్ధ్యం ఉన్నవారు. ప్రతి అంశంలోనూ వారు హాస్యాన్ని చూడగలరు. అటువంటి వారితో సమయం గడపడం ద్వారా దానిని మనమూ అలవర్చుకోవచ్చు.
సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ను పెంచుకోండి: ఇందుకు మనను మనం చాలా గంభీరంగా పరిగణించుకోవడం మానుకోవాలి. అప్పుడే మనం నవ్వగలం. నవ్వడానికి వీలు లేని, నవ్వకూడని సందర్భాలు చాలా తక్కువే ఉంటాయి. వాటిని మినహాయిస్తే మనం నవ్వును ఏ సమయంలో అయినా సందర్భంలో అయినా ఎంజాయ్ చేయవచ్చు.
నవ్వును జీవితంలోకి ఆహ్వానించడం కోసం లాఫ్టర్ క్లబ్బులోనైనా చేరవచ్చు లేదా జీవితం పట్ల మన దృక్పధానై్ననా మార్చుకోవచ్చు. ఏదైనా మన చేతుల్లో ఉన్నదే.
0 Comments