ప్రసవించిన వెంటనే దృష్టిలో ఉంచుకోవాల్సిన మొదటి అంశం – గర్భాశయం. గర్భాశయం పూర్తిగా శుభ్రపడాలి. వీలైనంత త్వరగా సాధారణ స్థితికి రావాలి. వాతదోషం ఎక్కువ కాకుండా ఉండాలి. కొన్ని మూలికలు వాడడం ద్వారా ఈ ప్రయోజనాలన్నీ పొందవచ్చు.
పిప్పళ్ళు, పిప్పలీమూలం, గజపిప్పళ్ళు, చిత్రమూలం, శొంఠి – వీటి చూర్ణాలు సమ భాగంగా తీసుకొని, బెల్లపు నీళ్ళలో కలిపి అవసరానుసారం 2-3 రోజుల పాటు ఇస్తే, గర్భాశయం శుభ్రపడుతుంది. ఇంగువ కూడా గర్భాశయాన్ని శుభ్రపరుస్తుంది.
- కరంజ (గానుగ) చూర్ణం, పిప్పలీ మూలం తో చేసిన చూర్ణం- రెండింటినీ కలిపి వారం రోజులు ఇవ్వవచ్చు.
- ఆహారం తేలికగా జీర్ణమయ్యేలా ఉండాలి. మొదటి 3-4 రోజుల వరకు బియ్యం జావ లో ‘పంచకోల చూర్ణం’ లేదా ‘లఘుపంచ మూలాలు’ వేసి తయారు చేసి ఇవ్వాలి.
- గసగసాలతో పాయసంలా చేసి ఇవ్వాలి. లేదా గసగసాలతో బర్ఫీ తయారు చేసి తినిపించవచ్చు.
- మొదటి పది రోజులు దాటిన తరువాత పిప్పళ్ళు, పిప్పలీ మూలం, గజ పిప్పళ్ళు, చిత్రమూలం, శొంఠి (పంచకోలాలు) విడివిడిగా చూర్ణం చేసి, సమభాగాలలో కలిపి రెట్టింపు బెల్లం పొడి చేసి కలిపి, నేతితో లడ్డులలా తయారు చేసి ప్రతిరోజూ ఇవ్వాలి.
- బాలింతలకు దశమూలారిష్టం, సౌభాగ్య శుంఠి వంటి ఔషధాలు ఆరోగ్యం, బలం తిరిగి పుంజుకు నేందుకు ఉత్తమమైనవి.
- బబ్బూల అంటే తుమ్మజిగురు ముక్కల్ని శుభ్రపరి చి, పొడి చేసి, అందులో పాతబెల్లం కలిపి లడ్డూలా గా తయారు చేసి ప్రసవించిన రెండు వారాల తరు వాత ప్రతిరోజూ ఇస్తుంటే రక్తస్రావం తగ్గుతుంది.పొట్ట పెరగకుండా
- ప్రసవించిన తరువాత పొట్ట లోని కండరాలన్నీ వదులుగా, బలహీనంగా ఉంటాయి. ఇవి మళ్ళీ మామూలుగా, దృఢంగా కావడానికి పైన ఆయుర్వేదంలో వివిధ మూలిక లున్నాయి.
- పొట్ట మీద ‘ధన్వంతరి తైలం’ లేదా ‘బలాతైలం’ ఎక్కువ పరిమాణంలో పూసి, మృదువుగా మర్దన చేస్తుండాలి. ప్రతిరోజూ స్నానానికి ముందు ఈ ఔషధ తైలాలతో మసాజ్ చేసుకున్న తరువాత వేడి నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల, సాగి న కండరాలు, మళ్ళీ గట్టిపడుతాయి. తైలాలను ప్రసవించిన మూడు నెలల వరకూ వాడుతుండాలి.
- స్నానం తరువాత గుగ్గులు, అగరు, చంగల్వ కోష్ఠు వీటితో పొగ వెయ్యాలి. పొట్టకి పొగ తగిలేలా చేయాలి.
- ప్రసవించిన తరువాత కడుపులో ఏర్పడిన ఖాళీలో వాతదోషం పెరగకుండా కాటన్ బట్ట పొట్ట మీద కట్టుకోవాలని ఆయుర్వేదం చెబుతోంది.
- ప్రసవించిన ఆరు వారాల నుంచి 12 వారాల తరు వాత డాక్టర్ సలహాతో పొట్ట పెరగకుండా ఉండడా నికి, కండరాలు దృఢంగా ఉండడానికి అవసరమైన వ్యాయామాలు మెల్లగా ప్రారంభించాలి.
- ఈ మూలికలు, తైలంతో చేసే మసాజ్‌ల వల్ల పొట్ట మాత్రమే గాకుండా, బలహీనంగా తయారైన నడుము కూడా మళ్ళీ శక్తి పుంజుకుంటుంది.
ప్రసవించిన 10-12 వారాల తరువాత, పొట్టలో కండరాలు గట్టిపడడానికి, ప్రసవసమయంలో బలహీ నమైన నడుము తిరిగి శక్తివంతం కావడానికీ వ్యాయా మాలు చేయాలి. యోగా సనా లు పద్ధతి ప్రకారం నేర్చు కొని వేయ వచ్చు. త్రికోణాసనం, కోణాసనం, హస్తపా దాస నం, యోగ ముద్ర, హస్త పాదాం గుస్థా సనం, పశ్చిమోత్తాసనం, సర్వం గాస నం, శలభాసనం, హలాసనం, మకరా సనం లాంటివి రోజూ కొద్దిసేపు చేస్తుం డాలి.
0 Comments