స్ట్రోక్ అని పిలవబడుతుంది. అకాల మరణాలకు కారణాలలో స్ట్రోక్ మరణం మూడవ ప్రధాన కారణం గా ఉంటుంది. దీనికి సత్వర చికిత్స అందించకుంటే మెదడు లో కణాలు త్వరగా నిర్వీర్యం అవటం ప్రారంభిస్తాయి. ఫలితంగా తీవ్రమైన వైకల్యం లేదా కొన్ని సందర్భాలలో మరణం సంభవించవచ్చు. ఈ స్ట్రోక్ లక్షణాలు కలిగి ఉంటే, ఆలస్యం లేకుండా అత్యవసర వైద్య సహాయాన్ని తీసుకోవటం ఉత్తమం.
స్ట్రోక్ లక్షణాలు
అకస్మాత్తుగా ఒక వైపు శరీరం మొద్దు బారుట లేదా శరీరంలో బలహీనత ఏర్పడుట.
- అకస్మాత్తుగా కంటి చూపు ఒకవైపు గాని, లేదా రెండు కళ్ళలో గాని సన్నగిల్లుట.
- ఆహారం లేదా మరేదైనా మ్రింగటంలో బాధ కలుగుట.
- ఆకస్మికంగా తీవ్రమైన తలనొప్పి సంభవించుట.
- ఆకస్మికంగా గందరగోళం లేదా ఇతరుల మాటలను అర్ధం చేసుకోలేక పోవటం.
స్ట్రోక్ పరీక్ష:
స్ట్రోక్ అని అనుమానం కలిగినప్పుడు ఈ చిన్నపాటి పరీక్ష దీనిని నిర్ధారించటానికి ఉపయోగపడగలదు.
- ముఖంపై చిరునవ్వు కు ప్రయత్నించటం. దీనిద్వారా ఒక వైపు ముఖం లో నవ్వు కనపడక శుష్కించుకు ఉండటం.
- రెండు చేతులు పైకి ఎత్తడం. ఒకవేళ ఒకవైపు చేయి పూర్తిగా పైకి లేవలేకపోవడం.
- ఒక వ్యాక్యాన్ని చెప్పడం. ఈ ప్రయత్నంలో పదాలు సక్రమంగా పలకలేక పోవడం.
స్ట్రోక్: మెదడు పై ప్రభావం [డామేజ్]
స్ట్రోక్ సంభవించినప్పుడు ప్రతి సెంకండ్ సమయం చాలా విలువైనది. మెదడు లో ఆక్సీజన్ క్షీణిస్తున్నప్పుడు క్రమక్రమంగా కణాలు మరణించటం రంభమవుతాయి.
కణాల రక్తం గడ్డకట్టే ముద్దాలను వినాశం చేసేందుకు మందులు ఉన్నాయి. కానీ ఈ మందులు స్ట్రోక్ సంభవించిన 3 గంటల లోపు వాడాలి. ఒక్కసారి మెదడులో ఒక్క కణం మరణించినచో ఆ కాణానికి సంభంధించిన అవయవాలు పనిచేయటం ఆగిపోతాయి. దీనితో దీర్ఘకాలిక అంగవైకల్యం సంభవించగలదు.
స్ట్రోక్ నిర్ధారణ పరీక్షలు:
స్ట్రోక్ లక్షణాలు ఎవరికైనా వచ్చినప్పుడు ముందుగా ఎటువంటి స్ట్రోక్ కు గురయ్యారు అనేది నిర్ధారించాలి. స్ట్రోక్ లలో రెండు విధాలు కలుగుతాయి, వీటిని ఒకే విధంగా చికిత్స అందించలేము. క్షుణ్ణ సిటి స్కాన్ ద్వారా స్ట్రోక్ రక్త నాళాలు బ్లాక్ అవటం వలన లేదా రక్త నాళాలు చిట్లడమ్ వలన సంభవించిందా అనేది కనుగొనవచ్చు.
ఇతర పరీక్షల ద్వారా ఈ డామేజ్ శరీరంలో ఏ ప్రాంతంలో జరిగింది అనేది గుర్తించవచ్చు.
ఇస్కామిక్ స్ట్రోక్:
సంభవించే స్ట్రోక్ లలో ఇది ప్రధాన మైనది. ప్రతి 10 స్ట్రోక్ లలో 9 ఈ విధమైన స్ట్రోక్ క్రిందికే వస్తున్నట్టు గుర్తించారు. ఇందులో మెదడు లోపల రక్తపు గడ్డ మెదడుకు రక్త సరఫరాకు అంతరాయం కల్పిస్తుంది. ఈ రక్తపు ముద్ద అక్కడే ఏర్పడవచ్చులేదా శరీరంలో మరో ప్రదేశం నుంచి ప్రయాణించి ఒక క్లిష్ట మయిన ప్రదేశానికి వచ్చి అడ్డు
పడవచ్చు.
రక్త స్రావ కారక స్ట్రోక్:
ఈ రక్త స్రావ కారక స్ట్రోక్ సాధారణంగా తక్కువ వ్యక్తులలో సంభవిస్తుంది కానీ ప్రమాద కరమైనది. మెదడులోని బలహీన రక్త నాళం పగిలిపోయినప్పుడు ఈ స్ట్రోక్ సంభవిస్తుంది. దీని కారణంగా మెదడులో రక్తం ప్రవహిస్తూ నివారణ చేయలేక పోయే సందర్భాలు కలగవచ్చు.
మినీ స్ట్రోక్:
మెదడుకు రక్తం ప్రవహించే నాళాలు తాత్కాలికంగా మూసుకు పోయి, తరువాత తిరిగి రక్త ప్రవాహం పునరిద్ధరింపబడుతుంది. దీనిని మినీ స్ట్రోక్ అంటారు. ఈ
లక్షణాలు మీకు కలిగితే వెంటనే వైధ్యుదిని సంప్రదించటం అవసరం. ఈ స్ట్రోక్ ను నివారించుటకు సరి అయిన వైద్య సదుపాయాలు కలవు.
స్ట్రోక్ కలగటానికి కారణాలు:
కొవ్వు, కోలేస్టాల్, కాల్షియం మరియు ఇతర పదార్ధాలు రక్త ప్రవాహం కలిగే నాళాలలో ఫలకం లాగా ఏర్పడి రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. దీని మూలంగా కాల క్రమేణా ఫలకం పరిణామం పెరిగి రక్తపు ముద్దల మాదిరిగా ఏర్పడతాయి. ఈ గడ్డ కట్టిన రక్తపు ముద్ద నాళంలో ఒక సంకుచిత స్థానంలో చిక్కుకు పోయి రక్త
ప్రవాహానికి అడ్డు తగిలి స్ట్రోక్ ఏర్పడేందుకు కారణమవుతుంది. ఇదే రక్తపు గడ్డ అడ్డు పడటం మూలంగా రక్త ప్రవాహం ధాటికి రక్త నాళాలు చిట్లి పోయి స్ట్రోక్ కూడా కారణమవుతుంది.
నష్ట కారకాలు :
కొన్ని తీవ్ర పరిస్తితుల వలన స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. వాటిలో :
- అధిక రక్త పోటు
- అధిక కోలేస్టాల్
- మధుమేధ వ్యాధి
- స్థూలకాయత
- ధూమపానం
- వ్యాయామం చేయకపోవడం
- అధిక మద్యపాన సేవన
- అధికంగా కొవ్వు, కోలేస్టాల్ ఉన్న వంటకాలను తినటం
- ఉప్పును అధికంగా సేవించడం తద్వారా రక్తపోటు పెరగడం
స్ట్రోక్ సంభవించిన 3 గంటల లోపు రక్త సరఫరాను పునరిద్ధరించేందుకు తగిన వైద్య సదుపాయాలు కలిగించటం ద్వారా మరణాన్ని నివారించవచ్చు. స్ట్రోక్ వల్ల శరీర
అవయవాలకు కలిగే నష్టం మెదడుకు సంభవించే డామేజ్ పై ఆధారపడి ఉంటుంది. కొన్ని ప్రత్యేక థెరపీల ద్వారా స్ట్రోక్ మూలంగా కలిగిన వైకల్యాన్ని తగ్గించవచ్చు.
స్ట్రోక్ తరువాత నరాల బలహీనత సర్వసాధారణం. సారైనా చిన్న పాటి వ్యాయామాల ద్వారా సాధారణ పరిస్తితులలో తీసుకురావచ్చు.
భవిష్యత్తులో స్ట్రోక్ నివారణకు ధూమపానాన్ని ఆపేయడం, సాధ్యమైనంత వరకు శాఖాహార వంటకాలు, చేపలు తీసుకోవడం, ఆరోగ్యకరమైన బరువు ఉండటం వంటివి అవసరం.
వైద్యులు సూచించిన ప్రకారం మందులు తీసుకుంటూ, సూచనలు పాటిస్తూ స్ట్రోక్ ను నివారించవచ్చు.
0 Comments