Full Style

>

ధూమపానం మానలేకున్నారా..


కేవలం 10నిమిషాలు వ్యాయామం చేస్తే నికోటిన్‌తో కూడుకున్న సిగరెట్టును మానేయవచ్చు. వ్యాయామం చేస్తే నికోటిన్‌ను శరీరం స్వీకరించదంటున్నారు పరిశోధకులు. ఈ విషయం పరిశోధనలో తేలినట్లు ఎక్సేటర్ యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు.

వ్యాయామం చేయడంవలన రక్త ప్రసరణ బాగా జరుగుతుందని, దీంతో ధూమపానం చేయాలన్న కోరిక కలగదని వారంటున్నారు. రక్త ప్రసరణ బాగా జరగడం వలన నికోటిన్‌ను శరీరం గ్రహించడానికి నిరాకరిస్తుందని వారు వివరించారు.
వ్యాయామం చేయడం వలన ధూమపానం మానేయడంపై ఎన్నోసార్లు పరిశోధనలు జరిగాయని, కాని ఈ సారి మస్తిష్కంపై పరిశోధన జరిపామని వారు తెలిపారు.

ప్రతిరోజు 10నుండి 15 నిమిషాలు నడక, జాగింగ్ లేదా సైకిలింగ్ చేస్తే ధూమపానం మానేయవచ్చని ఓ పరిశోధక విద్యార్థిని కేట్ జేన్స్ వాన్‌రేన్స్ బర్గ్ తెలిపారు. కేవలం ధూమపానం మానేయడమే కాకుండా శరీరంలో మంచి పటుత్వం(ఫిట్‌నెస్) కలిగి, బరువు తగ్గుతుంది. దీంతో మీ మూడ్ కూడా బాగుంటుందంటున్నారు పరిశోధకులు.

Post a Comment

0 Comments