Full Style

>

పురుషుల చర్మసౌందర్యానికి రహస్యాలు….


ప్రస్తుతం కాలం మారిపోయింది. ప్రతి ఒక్కరు తమ అందానికి, ఆరోగ్యానికి మెరుగులు దిద్దుకుంటున్నారు. ఇందులో మహిళలే కాకుండా పురుషులు కూడా తమ అందాన్ని పెంపొందించుకునేందుకు ఎంతో సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇలాంటి వారు తమ చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకునేందుకు చిన్ని ఉపాయాలు మీ కోసం…

మీది ఆయిలీ స్కిన్ అయితే: మీ చర్మంలో నూనె శాతం ఎక్కువగా ఉండి జిడ్డోడుతుంటే చాలామంది జిడ్డోడు అంటుంటారు. చర్మం జిడ్డోడుతుంటే టమోటాలు, నిమ్మరసం కలుపుకున్న ఫేస్ ప్యాక్ చాలా బాగుంటుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే…అదేంటంటే ఒక ఎర్రటి టమోటాను నిమ్మకాయ రసం కలుపుకోండి. టమోటాను గుజ్జుగా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని కళ్ళ భాగం మినహాయించి ముఖానికి పూయండి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయండి. ముఖంలోనున్న నూనె పదార్థాలు మటుమాయమౌతాయి. సమయం లేదని నిర్లక్ష్యం చేయకండి. ఇలాంటివి ఇంట్లోనే చేసుకోవచ్చు. దీంతో ముఖం మరింత అందంగా తయారవుతుందంటున్నారు సౌందర్య నిపుణులు.

Post a Comment

0 Comments