Full Style

>

ఆయాసం

మనం ముక్కు ద్వారా తీసుకుని వదిలే గాలి మన ప్రయత్నం లేకుండా మనకి తెలియకుండానే నిరంతరం సాగే పక్రియ!
మన శరీరంలోని జీవకణాలు బతుకుతున్నది మనం పీల్చేగాలిలోని ఆక్సిజన్ అనబడే ప్రాణవాయువు వల్ల. అదే ప్రక్రియలో మన శరీరంలోని జీవకణాలు వదిలే చెడువాయువు కార్బన్‌డైఆక్సైడ్ కూడా బయటకి వచ్చేస్తుంది. ఈ పక్రియ మొత్తాన్ని శ్వాసక్రియ అంటారు. దీన్ని నిర్వర్తించే అవయవ సముదాయాన్ని శ్వాసకోసమండలం లేదా పల్మనరీ సిస్టమ్ అంటారు.
ఏవో కొన్ని క్షుద్రజీవులు తప్ప సకల జీవులకు ప్రాణం నిలుపుకోవటానికి ఆక్సిజన్ అవసరం.
మన శరీరంలోని జరిగే రసాయనిక మార్పులవల్ల జీవకణాలలో ఈ ఆక్సిజన్ మన పోషక ఆహార సారం నుంచి గ్రహించిన కార్బన్, హైడ్రోజన్‌తో కలుస్తుంది. ఈ పక్రియనే ఆక్సిడేషన్ అంటారు.
దీనివల్ల కణాల నుంచి కార్బన్‌డైఆక్సైడ్, నీరు బయటకి వచ్చి శరీర జీవనానికి కావలసిన శక్తిని, వేడి విడుదలకావడమన్నది జరుగుతుంది. ఈ ఆక్సిడేషన్ వల్లే శరీరానికి కావలసిన నీరు విడుదల అవుతుంది. శరీరానికి అవసరమైన కార్బన్‌డైఆక్సైడ్ బయటకు వెళ్లిపోతుంది.
ఆ పక్రియ మన ప్రయత్నం తోటి కాని, మనకు తెలిసేటట్లు కాని జరిగితే దాన్ని ఆయాసం అంటాం.
మనం గాలి తీసుకుని వదలటం బాగా కష్టమవుతుంటే దాన్ని ఆయాసం అంటారు. ఈ ఆయాసంవల్ల మనిషి నిస్సత్తువతో కదలలేక, కూర్చోలేక, పడుకోలేక అవస్థ పడుతుంటారు.
ఆయాసం ఎందుకు వస్తుంది ?
* శ్వాస మండలంలో అవరోధం ఏర్పడడం వల్ల.
* శ్వాస మండలంలోని గాలి వెళ్లే మార్గంలో గోడలు కుచించుకుని, గాలి వెళ్లకుండా అడ్డుకోవడం వల్ల.
* ఈ పక్రియ చలనానికి ప్రధాన కారణమైన వేగస్ నెర్వులో కొంత మార్పు రావడం వల్ల.
* శ్వాసక్రియలో ప్రధానంగా ఉండే ఊపిరితిత్తులలోని పొరలు ఏ కారణంచేతనైనా రేగడం వల్ల .
* ఎక్కడో ఏదోక కారణంవల్ల ఊపిరితిత్తులలోని పొరలు కుచించుకుపోవడం వల్ల, ముఖ్యంగా ముక్కు, గొంతు, జీర్ణాశయాలలో వచ్చే వ్యాధుల వల్ల.
* కొంతమందికి కొన్ని పదార్థాల వాసనలు, వాతావరణం పడవు. దాన్ని ఎలర్జీ అంటారు. దాన్నివల్ల కూడా గాలి అరలు సంకుచితమై ఆయాసం వస్తుంది.
* గుండెలో వచ్చే మార్పులవల్ల కూడా ఆయాసం వస్తుంది. దీన్ని కార్డియాక్ ఆస్త్మా అంటారు.
* అతి నీరసంవల్ల, రక్తం తగ్గినపుడు, పాండు వ్యాధులోనూ కూడా ఆయాసం వచ్చే అవకాశం ఉంది.
మరెలా గుర్తించటం……
* కొంచెం నడిస్తే ఆయాసం వచ్చి, కూర్చుంటే లేదా కొంచెం విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంటే అది గుండెకు సంబంధించిన ఆయాసం. ఆ వ్యక్తి ఇలాంటి సమయంలో వెల్లకిలా పడుకోలేడు.
* హఠాత్తుగా ఆరంభమై ఆయాసంతోబాటు పిల్లికూతల వంటి శబ్దం వస్తుంటే అది ఆస్త్మా అని అర్థం.
* సాధారణంగా రోజుకు 21,600 సార్లు శ్వాసక్రియ జరుగుతుంది. అంటే నిమిషానికి 15 నుంచి 17 సార్లు ఆరోగ్య వంతుని శ్వాసక్రియ జరుగుతుంది.
* మాములుగానే గాలి తీసుకునే సమయం, వదిలే సమయం కన్నా ఎక్కువగా వుంటుంది. ఈ రెంటికి మధ్య వ్యత్యాసాలు ఆయాసాన్ని సూచిస్తాయి.
ఆయుర్వేదం ఏమంటుంది…….
* భాష వేరైన సత్యం ఒక్కటే! జీవశాస్త్రమైన ఆయుర్వేదం మార్గము కఫించే అడ్డగించడం వల్ల వాతము ప్రకోపించి ఆయాసాని కలుగజేస్తుంది.
* తగ్గని దగ్గు, దూషీవిషం(Toxins), ధూళి, పొగ, తీవ్రమైన చల్లనిగాలి ఇవి వ్యాధికారకాలుగా గుర్తించాలి.
* ఈ వ్యాధిని అనేక కోణాలరిత్యా పరిశోదించి ‘శ్వాస’ వ్యాధిగా పేర్కొన్నది ఆయుర్వేదశాస్త్రం.
* గాలి మార్గం పైకి మాత్రం వెడలుతూ గాలి తీసుకోగలిగినా విడవలేని స్థితిలో వుండే పరిస్థితిని ఊద్దృశ్వాస అని పేర్కొనవలసి వస్తుంది.
* పెద్ద శబ్దంతో శ్వాస పీలుస్తూ దీనావస్థతో వారు కళ్ళు వికృతంగా తెరూస్తూవుంటే అది మహాశ్వాస అంటారు. ఈ అవస్థలో పరిసరముల జ్ఞానం కూడా వుండదు.
* ఎంతో ప్రయత్నం చేసుకుని గాలి పీల్చుకోలేక, అదీ ఆగి ఆగి పీల్చుకోగలిగితే అది భిన్నశ్వాస.
* గుర గుర అనే శబ్ధంతో శ్వాస తీవ్రంగా వుంటూ కఫం అడుకుంటుంటే అది తికమక శ్వాస.
జాగ్రత్తలు……..
* ఆయాసం వున్నవాళ్ళు చల్లటి పదార్థాలు, కూల్‌ డ్రింక్స్, ఐస్‌ క్రీమ్‌లు, బెండకాయ, చేమదుంప, పెరుగు, కొబ్బరి, చేప, సొరకాయ, దుంపకూరలు, బచ్చలికూర, ఎక్కువ పుల్లటి పదార్థాలు తినకూడదు.
* ముల్లంగి, వెలగపండు, వేడినీళ్లు, తేనె, వెల్లుల్లి, గోధుమ, పక్షి మాంసం హితకరములు.
* వాము 50 గ్రాములు గరిటలో వేయించి పల్చటి గుడ్డలో మూటగా కట్టి వీపు భాగంలోనూ, పక్కలలోనూ, వేడి వేడిగా కాపు పెట్టుకోవటం వల్ల కఫం కరిగి ఆ వ్యక్తికి సులభంగా శ్వాస అందుతుంది.
* చక్కెకకేళి అరటిపండును గోమూత్రంలో కలిపి, పిసికి ప్రతిరోజూ ఉదయం తీసుకుంటే ఉబ్బసం తగ్గు ముఖంపట్టే అవకాశం ఉంది.
* మంచి వేపనూనె ఐదు నుంచి పది చుక్కలు ఒక తమలపాకుపై వేసుకుని ప్రతి నిత్యం తింటూవుంటే
క్రమంగా ఆయాసం తగ్గుతుంది.
ఆయాసం ప్రాణాపాయం కాదు. కాని చివరి వరకూ బాధపెడుతుంది. ఎక్కువచేసే పదార్థాలు తినకుండా వుండడం, చల్లని పానీయాలు తాగకుండా వుండటం, చల్లటి ప్రదేశాలలో తిరగకుండా వుండటం రాత్రి తలపై కప్పు కొని బయట తిరగటం చేస్తూ జాగ్రత్తగా ఉంటే ఆయాసమన్నది ఎక్కువ బాధపెట్టదు.
ఇన్‌హేలర్ ఎప్పుడు వాడడంకన్నా చక్కటి సహజమైన చిన్న చిన్న మందులతో ఆయాసాన్ని దూరంగా ఉండవచ్చు. చక్కగా జీవించవచ్చు.

Post a Comment

0 Comments