బాలనెరుపు నివారణ:
గోరింటాకు, మందార ఆకు, కరివేపాకు ఈ మూడింటినీ సమ పాళ్ళలో కలిపి బాగా రుబ్బి తలకు రాసి ఆరేవరకూ ఉంచి తలస్నానం చేస్తూ ఉంటే క్రమంగా బాల నెరుపు పోయి, జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. అదేవిధంగా కరివేపాకు, గుంటగలగరాకు, పొన్నగంటి కూర ఈ మూడింటినీ కలిపి రుబ్బి తలకు రాసి ఆరిన తర్వాత స్నానం చెయ్యాలి. ఈ మిశ్రమాలతో పాటు నేల ఉసిరిని కూడా కలుపుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఒక గుప్పెడు తులసి ఆకులను తీసుకుని ఒక కప్పు నీటిలో వేసి, కాచిన తర్వాత ఆ నీటిని చల్లార్చి గోరు వెచ్చగా అయిన తర్వాత ఆ నీటిని కుదుళ్ళలోకి ఇంకేలా రోజూ రాస్తూ ఉంటే జుట్టు నల్లగా మారుతుంది.
ఆహార ఔషధం:
కరివేపాకును రోజూ ఆహారంలో అంటే, పప్పుచారులోనూ, తాలింపులోనూ, పచ్చడిగానూ, కారప్పొడిగానూ చేసుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. కరివేపాకుని పచ్చిగానే రుబ్బి తీసుకుంటే ( తింటే ) పూర్తి ఫలితం ఉంటుంది. కరివేపాకును ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి.

0 Comments