Full Style

>

నిత్య యవ్వనానికి బీట్‌రూట్ రసం


నిత్యం నూతనంగా, మరీ యవ్వనంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఉబలాటపడుతుంటారు. మరింత యవ్వనంగా కనపడేందుకు బీట్‌రూట్ రసం సేవిస్తే బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. బీట్‌రూట్‌లో విటమిన్ ఎ, బి, సి, క్యాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, బీటా కెరోటిన్, పీచు పదార్థాలతోపాటు ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా ఉన్నాయి. బీట్‌రూట్ ముదురు ఎరుపు రంగును సంతరించుకునేందుకు ప్రధాన కారణం ఇందులో ఆంధో సైనడిన్లుండటమేనని పరిశోధకులు తెలిపారు.

ప్రతి రోజు ఉదయాన్నే పరకడుపున బీట్‌రూట్ రసాన్ని సేవిస్తే శరీరానికి కావలసిన రక్త శాతాన్ని మరింతగా పెంచుతుంది. ఇందులోనున్న పీచుపదార్థం రక్తకణాలపైనున్న అధిక కొవ్వును తొలగించి, మలబద్దకం సమస్యను కూడా నివారిస్తుంది. బీట్‌రూట్‌లో బిటైన్ అనే పోషకం అధికంగా ఉండటం మూలాన శరీరంలో నిల్వవున్న చెడు కొవ్వును కరిగించి వేస్తుంది. దీంతో నిత్యం యవ్వనులుగా ఉంటారని వైద్యులు పేర్కొన్నారు.

Post a Comment

0 Comments