Full Style

>

ఆరోగ్యం


మీకు మీరుగా చేసుకోగల ఇంకా... ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ థెరపికి మీరు రోజు 10 నిముషాలు కేటాయిస్తే అద్భుత ఆరోగ్యం మీ సొంతం.

భారతదేశంలో పుట్టిన ఈ థెరపీ ఎల్లలు దాటి అమెరికా, రష్యా, కెనడా, బ్రిటన్, ఆస్ర్టేలియా .... ఇలా ఎన్నో దేశాల్లో ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. పదేళ్ళ క్రితం ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపింది. ముఖ్యంగా రష్యా, యుక్రెయిన్ కు చెందిన డాక్టర్లు ఈ థెరపీపై సుదీర్ఘ పరిశోధనలు చేసి బ్రాంకైటిస్, త్రాంబోసిస్, ఎగ్జిమా, అల్సర్లు, దంతవ్యాధులు, జీర్ణ సంబంధ సమస్యలు, లంగ్స్, లివర్, కిడ్ని, మహిళల సమస్యలతో సహా 30దాకా వ్యాధులపై అద్భుతంగా పనిచేస్తుందని తెలుసుకున్నారు.

ఏంటి పేరు చూసి ఇదేం వింత థెరపి అనుకుంటున్నారా? బ్లాగ్ ప్రారంభంలోనే ఇలాంటి వింత థెరపీ పరిచయం చేస్తున్నరేంటి అని అనుకుంటున్నారా? కాస్త తేలికగా మాకు అర్ధమయ్యే ఆరోగ్య చిట్కా అయితే బాగుణ్ణు అంటారా? కానీ ఇది మీరు ఊహించలేనంత తేలిక. రోజూ ఈజీగా పాటించగల్గే మెడికల్ టిప్ ఇది. సరే ఇంక సస్పెన్స్ వద్దు కానీ ....... ఉపోద్ఘాతం ఆపి విషయంలోకి వెళ్దామా!!!

ఆయుర్వేదంలో కావల గండూష లేదా కావల గ్రహ చికిత్సగా పిలవబడే ఈ థెరపిని ఇంగ్లీష్ లో ఆయిల్ పుల్లింగ్ అని అంటారు. ఓస్!!! ఇంతేనా మేము రోజు ఆయిల్ పుల్లింగ్ చేస్తామండి అంటారా అయితే వెరీగుడ్ లేదంటే దీని వివరాలు తెలుసుకున్నారుగా అలాగే దాని ఉపయోగాలు కూడా తెలుసుకొని రోజూ పాటించండి.

ఆయిల్ పుల్లింగ్ ఎలా చెయ్యలంటే ..............



ఆయిల్ పుల్లింగ్ కు నువ్వులనూనె నాన్ రిఫైన్డ్ వాడుకోవాలి. పరగడుపున (అంటే ఖాళీ కడుపుతో చేస్తే మంచిది) 1 నుండి 2 స్పూనుల నూనె నోటిలో వేసుకొని బాగా పుక్కిలించాలి. పళ్ళ మధ్య నుంచి అంగిటకు నోరంతా కలియతిప్పుతూ పుక్కిలించాలి. ఇలా పది నిముషాలు చేసేసరికి ఆయిల్ నీరుగా మారుతుంది. నురుగు వచ్చిన తర్వాత ఊసేసి బ్రష్ చేసుకోవాలి. తర్వాత 2 – 3 గ్లాసుల నీరు తాగితే చాలు. ఇంక ఏ విధమైన రెస్ర్టిక్షన్స్ లేవు. నోట్లో ఆయిల్ వేసుకొని, ఇతర పనులు చేస్తూ పుక్కిలించకూడదు. ఒకచోట కూర్చుని పుల్లింగ్ మీద శ్రద్ధ పెట్టి చేయాలి. అపుడే రిజల్ట్స్ బాగుంటాయి.

అయిదేళ్ళ దాటిన వారి దగ్గర నుండి ఎవరైనా చెయవచ్చు.
కట్టుడు పళ్ళున్న వారు, వాటిని తీసి చేయాలి.
మహిళలు పీరియడ్స్, ప్రెగ్నెన్సీ సమయంలో కూడా చేయవచ్చు.
కొందరికి ఆయిల్ నోట్లో వేసుకోగానే నీరుగా మారచ్చు. అలాంటివారు నూనె మోతాదు కొద్దిగా పెంచుకోవచ్చు.
మరికొంత మందికి ఎంతసేపు చేసినా ఆయిల్ నీరుగా మారలేదంటే వారి శరీరంలో నీటి శాతం తక్కువగా ఉందన్నమాట. అలాంటి వారు రెండు గ్లాసుల నీరు త్రాగి అరగంట నడిచిన తర్వాత చేస్తే చాలు.
క్రానిక్ డిసీజ్ లు ఉన్నవారు రోజుకు 3 సార్లు అంటే పరగడుపున, లంచ్ డిన్నర్ చేసేటపుడు అరగంట ముందు చేయవచ్చు.
ఆయిల్ పుల్లింగ్ చేసేటపుడు కఫం వస్తే, ఆయిల్ ఊసేసి, మళ్ళీ వేసుకొని చేయడం మంచిది.
ఒక్కొసారి సమస్య తీవ్రమవ్వచ్చు. అంటే దాని అర్ధం ఆయిల్ పుల్లింగ్ పనిచేస్తుందన్నమాట. రియాక్షన్ ఎలా ఉంటుందంటే స్కిన్ మీద దురద రావచ్చు. గాయలైనపుడు ఇన్ ప్లేమేషన్ రావచ్చు. అయినా భయపడవద్దు.

Post a Comment

0 Comments