తిండి మానేస్తే బరువు
పెరుగుతారు అని నేనేమి తప్పు టైప్ చెయ్యలేదండి!! తిండి మానేస్తే బరువు
తగ్గుతారు అని మీరు అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఒకవేళ కొత్తలో కొంత బరువు
తగ్గినా మీరు తిరిగి బరువు పెరుగుతారు. అలా అని బాగా తిండిని తగ్గిస్తే మీ
శరీరంలో గ్లూకోజ్ లెవల్స్ బాగా తగ్గిపోయి డిస్రటబెన్స్ ఏర్పడుతుంది. దాంతో
మెటబాలిక్ రేట్ పడిపోతుంది. దాంతో జిహ్వచాపల్యం ఏర్పడుతుంది. మీరు తిండి
మానేసి ఎక్కువకాలం ఉండలేరు. తిరిగి తినడం మొదలుపెట్టాక మీరు తినే ఆహారం
కండరాలుగా మారకుండానే కొవ్వుగా మారిపోయి మరింత లావుగా తయారవుతారు.
మీరు తినే ఆహారంలో కేలరీలు బాగా తగ్గించి తింటే, మీ శరీరం మీకు ఆహారం దొరక్క (ప్రమాదవశాత్తూ మీరు ఎక్కడైనా ఆహారం దొరకని చోటుకు చిక్కుకున్నారనే అనుమానం) తినడం లేదేమో అనుకుంటుంది. దాంతో మీశరీరంలో మెటబాలిక్ రేటు తగ్గిపోతుంది. మీ శరీరంలో కొవ్వు నెమ్మదిగా కరుగుతుంది. ఇలా మెల్లగా కరగడం వల్ల కండరాలు కరగడం మొదలవుతుంది. దీంతో శరీరం మరింత గందరగోళంలో పడిపోయి తన సెట్ పాయింట్ మార్చేసుకుంటుంది. అలా అయినతర్వాత మీ శరీరం మరింత కొవ్వు నిలువలు తయారయ్యేలా సెట్ పాయింట్ నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత మీరు బరువు పెరిగిపోతారు.
భోజనానికి, భోజనానికి మధ్యలో మినిమమ్ 4 గంటలయినా గ్యాప్ ఉండాలి. అలా అని పగలు 6 గంటలపాటు ఏమీ తినకుండా ఉండద్దు. అంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినకుండా అంతా మధ్యాహ్నం తినేద్దాం అనుకుంటే, అప్పటికే రాత్రి భోజనానికి గ్యాప్ బాగా పెరిగిపోతుంది. దానితో మీ శరీరంలో షుగర్ లెవల్స్ తగ్గిపోయి, శరీరంలో అలార్మ్ రియాక్షన్ మొదలయ్యి, మెటబాలిక్ రేటు తగ్గిపోయి, కొవ్వు పెరిగేలా మార్పు మొదలవుతుంది. కాబట్టి షుగర్ లెవల్స్ సరిగ్గా మెయిన్ టెయిన్ అవ్వాలంటే ఓ క్రమ పద్దతిలో తినడం తప్పనిసరి.
ఆకలి తగ్గాక తినొద్దు. ఆకలిగా ఉన్నపుడే తినడం అలవాటు చేసుకోండి. ఆకలి మీ మిత్రుడు. మీ బరువు తగ్గడానికీ, మీ మెటబాలిక్ రేటు పెంచడానికీ ఆకలి ఉపయోగపడుతుంది. ఆకలికి సరిపడా మాత్రమే తినండి. ఆకలి లేనపుడు తింటే మళ్ళీ బరువు పెరిగిపోతారు. మీ ఆకలి తీరేంత వరకే తినండి. ఆకలి తీరాక ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోవద్దు. ఆహారం తిన్నాక ఓ రకమైన సంతృప్తి కలగాలి కానీ, ఆయాసం కాదు.
మీ ఆహారంలో ప్రోటీన్స్ ఉండేలా చూసుకోండి. ప్రోటీన్స్ తింటే కండరాలు పెరుగుతాయి. కండరాలు పెరిగితే కొవ్వు తగ్గుతుంది. శక్తినిచ్చే ఆహారాన్ని మాత్రమే తినండి. తినే ఆహారాన్ని కప్పులతోటి, స్పూన్ ల తోటి కొలవద్దు. ఆరోగ్యం కోసం తినేట్టయితే ఇలా కొలతలు, తూనికలు పనిచెయ్యవు. మీ శరీర స్వభావాన్ని బట్టి తినాలి కానీ, సున్నితపు త్రాసునాధారంగా చేసుకొని కాదు. మీకు తెలుస్తుంది ఏదీ తింటే మీ ఒంటికి సరిపడుతుంది అని.
భోజనం అంటే అన్ని రుచులతో ఉండాలి. రుచుల్ని తినడం మానేస్తే జిహ్వచాపల్యం ఏర్పడుతుంది. మానసికంగా కాన్ ప్లిక్ట్స్ ఏర్పడి, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఏదైనా ఒక క్రమ పద్ధతిలో వెళ్ళడం మంచిది. బరువు తగ్గాలి కదా!! అని అన్నీ ఒకేసారి మానేస్తే మన బుజ్జి బొజ్జ పాపం మనకు తగ్గట్టు సర్దుబాటు చెయ్యాలి కదండీ!!! అయితే అనావృష్టి లేదంటే అతివృష్టి కాకుండా సమతూకం అవసరం.

0 Comments