Full Style

>

బి పి బిళ్ళలు రోజూ వాడాలా


బిపి వచ్చిన ప్రతిఒక్కరు క్రమం తప్పకుండా సంవత్సరాల తరబడి మందులు వాడుతూ ఉంటారు. అంతేకానీ మందుబిళ్ళలు రాసిచ్చిన వైద్యులు మనసును అదుపులో పెట్టుకొనే సాత్వికాహారం తినమనికానీ, అనారోగ్యాన్ని పూర్తిగా నిర్మూలించే ప్రాణాయామం, ధ్యానం, ఆసనాలవంటి యోగ ప్రక్రియలు ఆచరించమని కాని, పొరపాటున కూడా చెప్పరు. రోగులు కూడా వైద్యులను ఇంత చిన్న సమస్యకు జీవిత కాలమంతా మందులు వాడాలా? దీన్ని పూర్తిగా నిర్మూలించే మార్గం లేదా? అని అడుగనే అడుగరు. బి.పి.రోగులు ఏండ్ల తరబడి మందు బిళ్ళలు మింగుతూ మరెన్నో కొత్తరోగాలకు ఆహ్వానం పలుకుతూ ఉంటారు.

రక్తపోటుకు కారణాలు:

ప్రొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు ఉరుకులు పరుగులతో సాగిపోతుంది నేటి మానవ జీవితం. ఎంత సంపాదించినా ఎన్ని అంతస్థులు కట్టినా మనిషికి తృప్తి లేదు. ఎన్ని డబ్బులు కూడబెట్టుకున్నా జీవనమాధుర్యాన్ని మాత్రం అనుభవించలేకపోతున్నాం. అందరిలో అంతులేని ఆరాటం, అవధిలేని ఆందోళన, స్వార్థద్వేషాలు.

రక్తపోటు రాకుండా ఉండాలంటే?


తినవలసినవి: రోజూ విధిగా రెండుపూటలా ఆహారంలో ఒక పచ్చి ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఆ ముక్కలపై నిమ్మరసం పిండి కూరన్నంతో పాటు కలిపితినాలి.
రోజూ రాత్రిపూట ఒక దానిమ్మపండు తినాలి.

రోజూ ఉదయం పరగడుపున ఒక టేబుల్ స్పూన్ బార్లీగింజలు ఉడికించగా వచ్చిన నీరు ఒకటి రెండు గ్లాసులు తాగాలి.

ఉదయకాల భోజనంలో జొన్నరొట్టెలు లేదా రాగిరొట్టెలు ఉడికించిన కూరలతో తినాలి.

మధ్యాహ్న భోజనంలో కూరగాయల రసాలు ఒక గ్లాసు లేదా పలుచని తీయ్యటి మజ్జిగ లేదా పండ్లరసాలు తాగాలి

రోజూ సాయంత్రం కొత్తిమీర, కరివేపాకు, పుదీన, ఇరవై ఆకుల చొప్పున మరియు పదితులసి ఆకులు కలిపి దంచి రసం తీసి అందులో ఒక చెంచా పటికబెల్లం పొడి కలిపి తాగాలి.

రాత్రి భోజనంలో పచ్చికూరలు (క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, ఖీరా దోసకాయ మొదలగునవి) తినాలి.

ఉప్పుకు బదులుగా సైంధవలవణము వాడాలి.

మిరపకాయల కారానికి బదులుగా మిరియాలకారం వాడటం శ్రేష్ఠం.

పాతచింతపండు మాత్రమే వాడాలి.

తినకూడనివి: మాంసం, చేపలు, గుడ్లు, అతికారం, అతిఉప్పు, అతిపులుపు, అతివేడి చేసే పదార్ధాలు, పెరుగు, ఉడికీ ఉడకని, చల్లబడిన ఆహారపదార్ధాలు, కొవ్వుపదార్ధాలు, అతితీపి పదార్ధాలు, పంచదారతో చేసిన పదార్ధాలు నిషిద్ధం.

Post a Comment

0 Comments