సరే మాకు ఆ చీవాట్లు అదేనండి రోగాలు వద్దు అంటే మీ భోజనం తినే విధానం కొద్దిగా మార్చండి.
పొట్టలో అజీర్ణం కాకుండా, ఆ అజీర్ణం వల్ల గ్యాస్, మంట పుట్టకుండా ఉండటానికి, ఆహారం భుజించేటపుడు ప్రతి ముద్దను 15 నుండి 32 సార్లు బాగా నమిలి మింగాలి. అలా చేయడం వల్ల నోటిలోని లాలాజల గ్రంధుల నుండి లాలారసం ఉత్పన్నమై ఆహారంతో బాగా కలిసి నోటిలోనే కొంతభాగం ఆహారం జీర్ణం కావడం ప్రారంభమవుతుంది. దీనివల్ల కొత్తగా కొవ్వు పెరగకపోగా అప్పటికే పెరిగి ఉన్న కొవ్వు కూడా క్రమంగా తగ్గుతుంది. అలాగే జీర్ణప్రక్రియకు జీర్ణరసాలను అందించే కాలేయానికి, ప్లీహానికి, నాభివద్ద ఉండే క్లోమగ్రంధికి శ్రమతగ్గి అవి ఎక్కువ కాలం ఆరోగ్యంగా తమ విధులు నర్వర్తిస్తాయి.
సరే భోజనం తినే పద్ధతి చూద్దామా!!!
1) కాళ్ళు, నడుము వంగని వృద్ధులు తప్ప మిగిలినవారంతా నేలపై పీట వేసుకొని కూర్చొని తూర్పు లేక ఉత్తరం వైపుకు ముఖం పెట్టి కూర్చోవాలి ఎందుకంటే సూర్యుని ప్రాణశక్తి తరంగాలు ఆవైపే ప్రవహిస్తుంటాయ్.
2) ఆహారం తినేటపుడు పూర్తిగా మౌనాన్ని పాటించాలి. ఎందుకంటే ఇతర విషయాలపై మీ దృష్టి (టీ.వి, పుస్తకాలు, కంప్యూటర్, ఆఫీస్ వర్క్ etc…) ఉంటే జీర్ణరసాలు సరిగ్గా ఉత్పత్తి కావు.
3) ఎంత హడావిడి ఉన్నా కొంపలు మునిగినట్లు ఆహారాన్ని సరిగా నమలకుండా మింగకూడదు. ఇలా చేయడం వల్ల కాలేయానికి, ప్లీహానికి, క్లోమానికి పనిభారం పెరిగి అనారోగ్యమై షుగర్ వ్యాధి చిన్నవయసులోనే వచ్చే అవకాశం ఉంది.
4) ఆహార సేవనం ప్రారంభించే ముందు ఒక గుక్కనీటిని త్రాగాలి. ఒక్కొక్క కూర మారినపుడల్లా ఒక్కొక్క గుక్క మంచినీరు తాగాలి ఎందుకంటే ఆహారనాళం పరిశుభ్రం కావడానికన్నమాట.
5) ఇంకా కొంచెం ఆహారం తీసుకోగలిగిన ఖాళీ ఉన్నపుడే ఆహారసేవనం ఆపేయాలి. గొంతువరకూ తింటే ప్రాణవాయువు సంచరించే అవకాశం లేక ఆహారం జీర్ణమవడం కష్టమవుతుంది.
6) కొంతమందయితే కంచం ముందు కూర్చొని కూరలను చూస్తూ ఛీ!! ఈ రోజు ఈ కూర వండారా? ఎవరు తింటారు? అబ్బా! చీ!! కూరలో ఉప్పు ఎక్కువ ఇలా ఇది తక్కువ, అది ఎక్కువ అంటూ ఆ పరబ్రహ్మస్వరూపం మందు కూర్చొని ఛీ! ఛా! మంత్రాలు చదువుతారు. అలా కాకుండా, ఆహారం వడ్డించిన తర్వాత అన్నం పరబ్రహ్మస్వరూపం అనే పవిత్రమైన భావనతో తినాలి.
చివరిగా.....
ఇది చాలా చిన్న విషయమే కావచ్చు.... కానీ.. పాటిస్తే తప్పేమి లేదుగా... మీ అందరికి గుర్తు ఉండవచ్చు. చిన్నపుడు మాట్లాడుతూ తింటుంటే మౌనంగా తినండి అని మన పెద్దవాళ్ళు కసిరేవాళ్ళు. వాళ్ళు ఏ ఆచారం, ఏ సంప్రదాయం మొదలుపెట్టినా దాంట్లో ఖచ్చితంగా ఓ ఆరోగ్య సూత్రం ఉంటుంది.
0 Comments